Boyfriend: అర్థరాత్రి ప్రియురాలితో డిన్నర్‌.. కట్ చేస్తే ఉదయం సోషల్ మీడియాలో లేఖ.. నెటిజన్ల రియాక్షన్ ఏంటంటే..

ప్రతీకాత్మక చిత్రం

ఓ అమ్మాయి చేసిన పనికి ఆమె ప్రియుడు తన స్నేహితుల ముందు తలెత్తుకోలేకపోయాడు. ఇలాంటి అవమానాలు జరగడం సహజమే. కానీ ఈ విషయంలో అతడు చాలా హర్ట్ అయ్యాడు.

  • Share this:
    ప్రియురాలితో కలిసి సరదాగా షాపింగ్‌కు వెళ్లడం, బయట లంచ్, డిన్నర్ చేయడం అంటే బాయ్‌ఫ్రెండ్స్‌కు ఓ సరదా. కొందరు ఇలాంటి సరదాలను బాగా ఎంజాయ్ చేస్తారు. కొంత డబ్బు ఖర్చయినా.. ఈ విషయంలో ఏ మాత్రం వెనకాడరు. కానీ ఓ అమ్మాయి చేసిన పనికి ఆమె ప్రియుడు తన స్నేహితుల ముందు తలెత్తుకోలేకపోయాడు. ఇలాంటి అవమానాలు జరగడం సహజమే. కానీ ఈ విషయంలో అతడు చాలా హర్ట్ అయ్యాడు. ఎంతగా అంటే.. తన ప్రియురాలు పేరును ప్రస్తావించకుండా సోషల్ మీడియాలో తనకు జరిగిన అవమానాన్ని, తన పడుతున్న బాధను వ్యక్తం చేశాడు. వివరాల్లోకి వెళితే.. మలేషియాకు చెందిన పేరు తెలియని తన ఫేస్ బుక్ అకౌంట్‌లో ఇలా రాసుకొచ్చాడు. తన స్నేహితుల ముందు కొన్నిసార్లు తన ప్రియురాలు మర్యాదలను కోల్పోతుందని.. ఇది తనకు ఇబ్బందిగా అనిపిస్తోందని కామెంట్ చేశాడు.

    ఇకపై మళ్లీ అలా చేయవద్దని ఆమెకు చెప్పడానికి ప్రయత్నిస్తున్నానని.. కానీ ఆమె విచారంగా కనిపించిందని.. ఆమె కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయని అన్నాడు. ఇటీవల తామిద్దరం రెండు డోసుల టీకాలు వేసుకున్న తరువాత తన స్నేహితులతో కలిసి డిన్నర్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నామని.. ఈ సమయంలోనే తన ప్రియురాలిని తన స్నేహితులకు పరిచయం చేయాలని అనుకున్నానని తెలిపాడు.

    అయితే డిన్నర్‌లో తన ప్రియురాలు ఆర్డర్ చేసిన ఆహార పదార్థాలు చూసిన తన స్నేహితులు ఆశ్చర్యపోయారని చెప్పుకొచ్చాడు. ఆమె చేపలు, చిప్స్ ఆర్డర్ చేయాలనుకుంటున్నట్లు తనకు తెలిసిందని.. కానీ పక్కన కూర్చున్న తన స్నేహితుడు చేపలు, చిప్స్ అంత మంచిది కాదని చెప్పాడని అన్నాడు. తాము వచ్చిన రెస్టారెంట్ వంట చేయడానికి పేలవమైన చేపలను ఎంచుకుంటుందని తెలిపారు.

    Chiranjeevi: క్లైమాక్స్‌కు చేరుకుంటున్న మా ఎన్నికలు.. లాస్ట్ పంచ్ మెగాస్టార్‌దేనా.. ఆయన మాటలకు అర్థమేంటి ?

    Fake Banking Apps: బ్యాంకింగ్ యాప్స్‌తో జరభద్రం.. ఫేక్ యాప్స్‌ను ఇలా గుర్తించండి..

    తమ స్నేహితులు చెప్పిన ఆర్డర్‌ను తన ప్రియురాలు అస్సలు ఒప్పుకోలేదని.. ఆమె దృష్టిలో అది ఖరీదైనదని తెలిపాడు. ఆమె ప్రవర్తించిన తీరుతో తన స్నేహితుల ముందు తన పరువు పోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే ఇతగాడి పోస్టుపై నెటిజన్లు స్పందించారు. వీరిలో కొందరు ఆమె నుంచి విడిపోవడమే మంచిదని సలహా ఇచ్చారు. మరికొందరైతే డబ్బు ఆదా చేయడం మంచి అలవాటు అని.. అలాంటి ప్రియురాలు దొరికితే కూడా బాధపడతారా ? అని కామెంట్ చేశారు.
    Published by:Kishore Akkaladevi
    First published: