హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Kareena Kapoor-Khan: ఏంటి కరీనా ఇలా చేశావ్..? ఆమెపై విపరీతంగా ట్రోల్స్ చేస్తున్న నెటిజన్లు.. ఎందుకంటే..

Kareena Kapoor-Khan: ఏంటి కరీనా ఇలా చేశావ్..? ఆమెపై విపరీతంగా ట్రోల్స్ చేస్తున్న నెటిజన్లు.. ఎందుకంటే..

మలబార్ గోల్డ్ యాడ్ లో నటించిన కరీనా కపూర్ ఖాన్‌

మలబార్ గోల్డ్ యాడ్ లో నటించిన కరీనా కపూర్ ఖాన్‌

కరీనా కపూర్ నటించిన మలబార్ గోల్డ్ జ్యువెలర్స్ యాడ్‌పై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. నగల బ్రాండ్ మలబార్ గోల్డ్ కోసం కరీనా కపూర్ ఖాన్‌ ఒక యాడ్‌లో నటించింది.

మన దేశంలో వ్యాపార ప్రకటనలు లేదా యాడ్స్ (advertisement) అనేవి ఎమోషన్స్‌ను (Emotions) ప్రతిబింబిస్తాయి. అందుకే కొన్ని యాడ్స్ ప్రజలకు చిరకాలం గుర్తుంటాయి. అయితే కొన్నిసార్లు యాడ్ మేకర్స్ చేసే చిన్న తప్పిదాలకు, కంపెనీలు పెద్ద శిక్ష అనుభవించాల్సి వస్తుంది. ఇప్పటికే ఇలాంటి ఘటనలు చాలా జరిగాయి. తాజాగా కరీనా కపూర్ (Karena Kapoor) నటించిన మలబార్ గోల్డ్ జ్యువెలర్స్ యాడ్‌పై నెటిజన్లు(Netizens) విరుచుకుపడుతున్నారు. నగల బ్రాండ్ మలబార్ గోల్డ్(Malabar Gold) కోసం కరీనా కపూర్ ఖాన్‌ ఒక యాడ్‌లో నటించింది. అయితే దీనికి సంబంధించిన ఫోటోలో ఆమె నుదుటిపై బొట్టు లేకుండా కనిపించింది. దీంతో కొందరు నెటిజన్లు సదరు కంపెనీపై, కరీనాపై విరుచుకుపడుతున్నారు. బిందీ (బొట్టు) లేకపోతే బిజినెస్ లేదని ట్వీట్లు చేస్తూ.. మలబార్ జ్యువెలర్స్‌ను బ్యాన్ చేయాలని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కరీనా కనిపించిన తాజా యాడ్‌.. హిందువులు బంగారం కొనుగోళ్లకు శుభప్రదంగా భావించే పండుగ అక్షయ తృతీయకు సంబంధించినది. ఇందులో కరీనా గులాబీ రంగు లెహంగా ధరించి, పెద్ద డైమండ్ నెక్‌పీస్, చెవిపోగులు, ఇతర నగలు ధరించి కనిపించింది. కానీ ఆమె నుదుటిపై బొట్టు మాత్రం లేదు. దీంతో నెటిజన్లు ఈ విషయాన్ని ఎత్తిచూపుతూ విమర్శలు చేస్తున్నారు.

ఈ యాడ్‌లో కరీనా అద్భుతంగా కనిపించినప్పటికీ, ఆమె నుదుటిపై బొట్టు లేకపోవడం.. సోషల్ మీడియా యూజర్లలో ఒక వర్గానికి కోపం తెప్పించింది. మెజారిటీ హిందువులు ఈ యాడ్‌పై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది హిందూ సంప్రదాయాలు, పండుగలను విస్మరించే ప్రయత్నం అని పేర్కొన్నారు. మహిళలకు, ముఖ్యంగా వివాహితలకు భారతీయ సాంప్రదాయంలో నుదుటిపై బొట్టు పెట్టుకోవడం ఒక ముఖ్యమైన అంశం అని చాలా మంది అభిప్రాయపడ్డారు. ముస్లింను పెళ్లాడిన కరీనా.. హిందూ పండుగకు సంబంధించిన యాడ్‌లో బొట్టు లేకుండా కనిపించినందుకు యూజర్లు ట్రోల్ చేస్తున్నారు. #BoycottMalabarGold, #BoycottKareenaKapoorKhan, #NoBindiNoBusiness వంటి హ్యాష్‌ట్యాగ్స్‌ను ట్విట్టర్‌ ట్రెండ్‌ చేస్తున్నారు.

‘మలబార్ గోల్డ్ కంపెనీ అక్షయ తృతీయ వంటి పవిత్రమైన రోజు కోసం తమ ఆభరణాలను ప్రమోట్ చేస్తోంది. ఒకవైపు హిందువులు డబ్బును తమ కంపెనీలో ఖర్చు చేయాలని కోరుతూ.. మరోవైపు హిందూ మత సంప్రదాయాలను విస్మరిస్తూ కరీనా కపూర్ ఖాన్‌ను బొట్టు లేకుండా యాడ్‌లో చూపిస్తుంది’ అని ఒక యూజర్ ట్వీట్ చేశారు.

‘ఇది మహిళలు బొట్టు పెట్టుకునే సంప్రదాయాన్ని దూరం చేసే చర్యలా కనిపిస్తోంది. హిందూ పండుగలకు ప్రత్యేకంగా విక్రయించే ఉత్పత్తుల కోసం మహిళా మోడల్స్ బొట్టు లేకుండా యాడ్స్‌లో కనిపిస్తున్నారు. హిందూ మహిళల బొట్టు ప్రాముఖ్యతను తుడిచిపెట్టడానికి ఉద్దేశపూర్వకంగా ఇలా చేస్తున్నట్లు అర్థమవుతోంది’ అని మరో వ్యక్తి ట్వీట్‌లో పేర్కొన్నారు. ‘‘అక్షయ తృతీయకు బొట్టు లేకుండా కరీనా కపూర్‌తో ‘ది రెస్పాన్సిబుల్ జ్యువెలర్’ యాడ్ చేసింది! వారు హిందూ సంస్కృతిని, సంప్రదాయాలను పట్టించుకుంటున్నారా?’’ అని ఇంకో యూజర్ అసంతృప్తి వ్యక్తం చేశారు.

First published:

Tags: Kareena Kapoor, Malabar gold, Trending news, Viral

ఉత్తమ కథలు