ఒకేసారి 30 పిల్లిమొగ్గలు... సోషల్ మీడియాను ఊపేస్తున్న ఫీట్స్

కేవలం 24 సెకన్ల విడిదిగల ఈ వీడియోలో యువకుడు 30 సార్లు ఫీట్లు చేసి అందరితో వావ్ అనిపించాడు.

news18-telugu
Updated: September 11, 2019, 8:13 AM IST
ఒకేసారి 30 పిల్లిమొగ్గలు... సోషల్ మీడియాను ఊపేస్తున్న ఫీట్స్
కేవలం 24 సెకన్ల విడిదిగల ఈ వీడియోలో యువకుడు 30 సార్లు ఫీట్లు చేసి అందరితో వావ్ అనిపించాడు.
  • Share this:
పిల్లిమొగ్గలు... చాలామందికి వీటి గురించి తెలిసే ఉంటుంది. ఎవరో ఒకరు ఏదో ఒక సందర్భంలో.. మంచమీదో... లేక నేలపైన పిల్లిమొగ్గలు వేసి ఉంటారు. అయితే ఓ యువకుడు నిలబడి.... నేలమీదే... 30సార్లు పిల్లిమొగ్గలు వేయడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.ఆ యువకడి అద్భుతమైన ఫీట్స్‌ను కొందరు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. వెంటనే ఆ పోస్టుకు లైకులు మీద లైకులు కొ్ట్టారు నెటిజన్లు. స్వేత అనే అమ్మాయి యువకుడి ఫీట్స్‌కు సంబంధించిన పోస్టును తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. ఇలాంటి అమేజింగ్ టాలెంట్‌ ఉన్నవాళ్లు మన దేశంలో చాలామంది ఉన్నారు. వాళ్లకు కాస్త ఆశీర్వదించి కాస్త చేయూతనివ్వండి అంటూ తన పోస్ట పెట్టింది. కేవలం 24 సెకన్ల విడిదిగల ఈ వీడియోలో యువకుడు 30 సార్లు ఫీట్లు చేసి అందరితో వావ్ అనిపించాడు.

దీంతో ఈ పోస్టును నెటిజన్లు వైరల్ చేస్తున్నారు. క్రీడాశాఖమంత్రి కిరణ్ రిజుజాకు ట్యాగ్ చేస్తున్నారు. ఇంతటి టాలెంట్ ఉన్న యువకుడ్ని ప్రోత్సహించాలంటూ మరికొందరు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. జిమ్నాస్టిక్స్‌లో ట్రైనింగ్ ఇస్తే.., మరిన్ని అద్భుతాలు సాధిస్తాడంటూ... కొనియాడుతున్నారు. సెప్టెంబర్ 9న అయిన ఈ పోస్టుకు ఇప్పటివరకు మొత్తం 10వేలమంది లైకులు కొట్టగా... 4వేలమంది రిట్వీట్ చేశారు.First published: September 11, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>