కరోనా మహమ్మారి(CoronaVirus) కారణంగా దాదాపు ఏడాదిన్నర కాలంగా ప్రజలు ఇంటికే పరిమితమయ్యారు. ఇప్పుడిప్పుడే పరిస్థితులు సాధారణంగా మారుతున్నాయి. ఆఫీసులు, స్కూళ్లు, కాలేజీలు, వ్యాపార సముదాయాలు తెరుచుకుంటున్నాయి. అయితే, గతంతో పోలిస్తే కరోనా కేసులు కాస్త తగ్గినప్పటికీ కరోనా పూర్తి స్థాయిలో అంతం కాలేదు. ప్రతి రోజూ వందలాది కరోనా కేసులు నమోదవుతున్నాయి. దీంతో, అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటికొచ్చేందుకు జంకుతున్నారు. సాధ్యమైనంత వరకు ఇంట్లోనే అన్ని పనులు చేసేకునేందుకు ప్రాధాన్యతనిస్తున్నారు. ఈ క్రమంలో ఇంటి సభ్యులంతా కలిసి ఓ బాలుడికి ఇంట్లోనే హెయిర్ కట్ (Haircut) చేసిన వీడియో తెగ వైరల్ అవుతోంది.
కరోనా భయంతో బయట హెయిర్ సెలూన్‌కు తీసుకెళ్లకుండా ఇంట్లోనే పిల్లవాడికి కంటింగ్ చేస్తున్న వీడియో ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోను BViral అనే ఇన్స్టాగ్రామ్ పేజీలో అప్‌లోడ్ చేయగా వెంటనే వైరల్ (Viral Video) అయ్యింది. వీడియోను నిషితంగా పరిశీలిస్తే.. బాలుడికి అతని తల్లి జుట్టు కత్తిరించడాన్ని మనం చూడవచ్చు. నల్లటి ఆప్రాన్‌ను ధరించి బాలుడి తలపై ఒక ప్లాస్టిక్ గిన్నె (Katora) పెట్టి ట్రిమ్మర్‌తో హెయిర్ కటింగ్ చేశారు.
ముందు భాగంలో కొంచెం హెయిర్ కట్ చేయగానే దాన్ని చూసి అతడి తల్లి నవ్వడం ప్రారంభించింది. ఆ తర్వాత బాలుడి తలపై నుంచి గిన్నె తీయగానే కుటుంబంలోని ఇతర సభ్యులు నవ్వడం ప్రారంభించారు. వారిని చూసి ఆ బాలుడు కూడా నవ్వుతూ అద్దంలో తన జుట్టు చూసుకోవడానికి గదిలోకి వెళ్లడం మనం గమనించవచ్చు.
View this post on Instagram
నెటిజన్ల ఫన్నీ కామెంట్స్..
ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేసిన ఈ వీడియోను 7 లక్షల మందికి పైగా వీక్షించారు. ఈ వీడియోను 34 వేల లైక్స్ సంపాదించింది. ఇక ఈ వీడియోపై అనేక మంది నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఒక నెటిజన్ వ్యాఖ్యానిస్తూ “ఆ బాలుడు తన హెయిర్‌ను అద్దంలో చూసుకొని తపాకీ కోసం గదిలోకి వెళ్లాడని అనుకున్నాను.”అని ఫన్నీగా కామెంట్ చేశాడు. మరో నెటిజన్ “బాలుడి హెయిర్ ప్రముఖ స్పోర్ట్స్ ఫ్రాంచైజీ ఓనర్ మార్క్ డేవిస్ లాగే ఉంది.”అని కామెంట్ చేశాడు. ఆ బాలుడు స్కూల్‌కు వెళ్లి తన స్నేహితులను కలిసేలోపు అతని జుట్టు తిరిగి పెరుగుతుందని ఆశిస్తున్నామని కొంతమంది నెటిజన్లు ఆశాభావం వ్యక్తం చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hair styling, Viral Video