గుజరాత్(Gujarat)లో పండుగ పూట విషాద సంఘటన అందర్ని తీవ్రంగా బాధించింది. దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దాండియా(Dandiya)ఓ కాలనీలో వాసులంతా దాండియా ఆడుతున్నారు. ఆ సమయంలో ఓ యువకుడు దాండియా ఆడుతూనే కుప్పకోలిపోయాడు. వెంటనే ఆసుపత్రి (Hospital)కి తరలించేలోపే మృతి చెందాడు. పట్టుమని పాతికేళ్ల వయసు లేని ఆ యువకుడు ఎందుకు చనిపోయాడో తెలిసి అందరూ షాక్ అయ్యారు. కాలనీలో దాండియా దృశ్యాల్ని సెల్‌ఫోన్(Cell phone)లో చిత్రీకరిస్తున్న సమయంలో ఈ లైవ్ డెత్ వీడియో(Live Death Video)రికార్డైంది. ఇప్పుడు ఈ వీడియోనే సోషల్ మీడియా(Social media)లో తెగ వైరల్(Viral)అవుతోంది.
పండుగ వేడుకల్లో విషాదం ..
దేశ వ్యాప్తంగా దసరా మహోత్సవాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఉత్తర, దక్షిణాది రాష్ట్రాల్లో ఈపండుగను అందరూ 9రోజుల పాటు ఘనంగా నిర్వహించుకుంటారు. గుజరాత్‌లో కూడా అంతే గొప్ప శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఆనంద్‌లోని తారాపూర్ సమీపంలోని యారాపూర్‌లోని ఆటి శివశక్తి సొసైటీలో గర్భా సందర్భంగా స్థానికులు దాండియా ఆడారు. కాలనీ వాసులంతా ఒక్క దగ్గరకు చేరి అమ్మవారికి భక్తితో పాటలకు అనుగూణంగా దాండియాను పోలిన నృత్యం చేస్తున్నారు.
డ్యాన్స్ చేస్తూనే ..
అదే సమయంలో ఓ బాలుడు గర్భా ఆడుతూ కిందపడిపోయాడు. చిన్న, పెద్ద, మహిళలు, కుర్రాళ్లంతా కలిసి పాలుపంచుకున్న ఈవేడుకను మరో యువకుడు వీడియో తీస్తుండగా బాలుడు డ్యాన్స్ చేస్తు కిందపడిపోయిన వీడియో రికార్డైంది. బాలుడు కిందపడిపోవడంతో అందరూ డ్యాన్స్ ఆపేసి పరుగు పరుగున అక్కడికి చేరుకున్నారు.
ఆసుపత్రికి వెళ్లేలోపే ..
తారాపూర్‌లోని ఆటి శివశక్తి సొసైటీలో ఏర్పాటు చేసిన గర్భాలో కిందపడిపోయిన బాలుడు గుండెపోటుకు గురైనట్లుగా నిర్ధారించారు. వెంటనే ఆసుపత్రికి తరలించారు స్థానికులు. అయితే దురదృష్టకరమైన సంఘటన ఏమిటంటే బాలుడ్ని ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించేలోపే మృతి చెందడంతో కాలనీలో విషాదం నెలకొంది. ఈసంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Gujarath, Trending news, Viral Video