హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Viral video : కారు, బైకు,బాటిల్,క్యాన్ లేకుండానే బంకులోంచి పెట్రోల్ తీసుకెళ్లాడు ..ఎలాగో ఈ వీడియో చూడండి

Viral video : కారు, బైకు,బాటిల్,క్యాన్ లేకుండానే బంకులోంచి పెట్రోల్ తీసుకెళ్లాడు ..ఎలాగో ఈ వీడియో చూడండి

(Photo Credit:Youtube)

(Photo Credit:Youtube)

Viral video: బైక్ , కారు, బాటిల్, క్యాన్ లేకుండా బంకులోంచి పెట్రోల్ తీసుకెళ్లడం సాధ్యం కాని పని. కాని ఉత్తరప్రదేశ్‌లో ఓ బాలుడు ఇవేమి లేకుండానే పెట్రోల్ తీసుకెళ్లాడు. అతడి తెలివి తేటలు చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

ఉపాయం ఉంటే ఎలాంటి వాళ్లకైనా సమాధానం చెప్పి మన పని సులువుగా చేసుకోవచ్చని ఆ చిన్న కుర్రాడ్ని చూస్తే అర్ధమవుతుంది. పిల్లల్లో ఇలాంటి చురుకైన వాళ్లు చాలా మంది ఉంటారు. కాని సోషల్ మీడియా(Social media) పుణ్యమా అంటూ ఉత్తరప్రదేశ్‌(Uttar Pradesh)లో ఉంటున్న ఆ బాలుడు ఇప్పుడు నెట్టింట్లో తెగ పాపులర్ అయ్యాడు. బైక్(Bike), బాటిల్(Bottle), డబ్బా (Can)లేకుండా పెట్రోల్(Petrol)బంకు నుంచి పెట్రోల్‌ ఎలా తీసుకెళ్లాలో అతనికి వచ్చిన ఐడియానే ఇప్పుడు అందర్ని నవ్విస్తోంది. వీడియో అనేక గ్రూపుల్లో చక్కర్లు కొడుతోంది.

Viral Video : భర్తను నిద్రపుచ్చి బాయ్‌ఫ్రెండ్‌ని కలిసింది..తర్వాత ఏం జరిగిందో ఈ వీడియో చూడండివాటే బ్రిలియంట్ బాయ్ ..

బైక్‌ లేదంటే కారు తీసుకెళ్తేనే బంకులో పెట్రోల్, డీజిల్ పోస్తారు. బాటిల్స్, డబ్బాలు తీసుకెళ్తే పెట్రోల్ పోయమని తెగేసి చెబుతారు. ఉత్తరప్రదేశ్‌ పిలిభిత్‌లో కూడా అలాగే చేస్తున్నారు. కొన్ని పెట్రోల్ బంకుల్లో డబ్బాలు, బాటిల్స్‌లో పెట్రోల్ నింపబడదు అని పేపర్‌ పైన నోటిస్ రాసి మరీ పెడుతున్నారు. కాని పిలిభిత్‌లోని ఓ పెట్రోల్‌ బంకులో మైనర్ బాలుడు బైక్ , బాటిల్స్ , డబ్బాలు తీసుకెళ్లకుండానే పెట్రోల్ తెచ్చుకున్నాడు. పెట్రోల్ తీసుకెళ్లడానికి అతనికి వచ్చిన ఐడియా చూసి బంకులో పనిచేస్తున్న సిబ్బందే ఆశ్చర్యపోయాడు. బాలుడు సైకిల్‌పై బైక్ పెట్రోల్‌ ట్యాంక్‌ని కట్టుకొని రావడంతో అతడికి పెట్రోల్ పోయనని చెప్పడానికి కారణం దొరక్కపోవడంతో పెట్రోల్ నింపాడు.


బైక్ లేకుండా పెట్రోల్ ..

ఇంత తెలివిగా పెట్రోల్ తీసుకెళ్లేందుకు వచ్చిన బాలుడు బంకులో పనిచేస్తున్న సిబ్బంది ఒకసారి ముఖం చూపించు బాబు అంటూ తలదాచుకున్నాడు. చూడటానికి కాస్త హాస్యంగా ఉన్నప్పటికి ..ఈవిధంగా కూడా పెట్రోల్ పోయడం సరికాదని సిబ్బంది చెబుతున్నాడు. సైకిల్‌పై బైక్ పెట్రోల్ ట్యాంక్‌ కట్టుకొని వచ్చిన బాలుడికి బంకు యజమాని ఎలాంటి సమాధానం చెబుతారోనని పక్కనే వచ్చిన మరో బాలుడు వీడియో తీశాడు. బాటిల్ తెస్తే పెట్రోల్ పోయమని పంపించారు కదా..ఇప్పుడు ఎందుకు పోయరూ అని ప్రశ్నించడానికే వీడియో తీస్తున్నట్లుగా ఆ ఇద్దరు పిల్లలు తెలిపారు. ఏది ఏమైనా పిలిభిత్‌లో కుర్రాడు చేసిన పనికి నెటిజన్లు మాత్రం తెగ నవ్వుకుంటున్నారు.

రూల్స్ ప్రకారం ఇవ్వకూడదు..

కొందరు మాత్రం మైనర్ పిల్లలు ఈవిధంగా పెట్రోల్ తీసుకెళ్లడానికి వస్తే విక్రయించకూడదని బంకు సిబ్బందికి సూచిస్తున్నారు. ఆ విధంగా తీసుకెళ్లిన ఇంధనంతో ఏదైనా నేరానికి పాల్పడితే బాధ్యులు ఎవరని ప్రశ్నిస్తున్నారు. ఇంత తెలివిగా బంకు నుంచి పెట్రోల్ తీసుకెళ్లిన పిల్లవాడు పేరు చెప్పడానికి, ముఖం చూపించడానికి మాత్రం ఇష్టపడలేదు.

First published:

Tags: Uttar pradesh, Viral Video

ఉత్తమ కథలు