BOXER EDDIE HALL CHILDHOOD PHOTO GOES VIRAL AND IDENTICAL DISCUSSION ON SOCIAL MEDIA SNR
నన్ను గుర్తు పట్టండి..నా వయసు ఎంతో చెప్పమంటున్న బాహుబలి
Photo Credit: Instagram
Eddie Hall: బాక్సింగ్ ఛాంపియన్, ప్రపంచలోకెల్లా అత్యంత శక్తివంతుడిగా పేరు సంపాధించుకున్న ఎడ్డీహాల్ ఏజ్ ఎంత అనే చర్చ జోరుగా సాగుతోంది. చిన్ననాటి ఫోటో ఒకటి ఇన్‌స్టాలో పోస్ట్ చేయడంతో మొదలైన చర్చ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ బాహుబలి వయసు ఎంతో తెలుసా..
ఆడవాళ్ల వయసు కనుక్కోవడానికి ఎవరైనా ఆరాటపడుతూ ఉంటారు. కానీ మొట్టమొదటి సారి ఓ బాహుబలి వయసు తెలుసుకునేందుకు ప్రపంచంలోని చాలా మంది పోటీ పడుతున్నారు. నా వయసు తెలుసుకోండి అంటూ అతను పోస్ట్ చేసిన చిన్ననాటి ఫోటో చుట్టూ నెటిజన్ల కళ్లు తిరుగుతున్నాయి. ఈ ఫోటో ఎప్పటిది..ప్రస్తుతం అతని వయసు ఎంత ఉంటుంది అనే చర్చ తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ అంత మందిని ఆలోచనలో పడేసిన వ్యక్తి ఎవరో తెలుసా. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతుడి(World strongest man)గా పిలవబడే బాక్సర్ (Boxer )ఎడ్డీ హాల్(Eddie Hall). యస్ ఆ బాహుబలికి ప్రస్తుతం ఎంత వయసు ఉంటుంది అనే చర్చ సోషల్ మీడియా (Social media)గ్రూప్‌లోనే కాదు ఇంటర్ నేషనల్ మీడియా(International media)ను ఎట్రాక్ట్ చేస్తోంది. ఈ స్టోరీ ఎక్కడ మొదలైందంటే ఎడ్డీ హాల్ తన కుటుంబ సభ్యులతో కలిసి దిగిన చిన్ననాటి ఫోటో (Childhood photos)ఒకటి తన ఇన్స్టాగ్రామ్(Instagram)లో పోస్ట్ చేశాడు. పెట్టిన వాడు ఊరుకోకుండా ఫోటోలో తాను ఎక్కడున్నానో చెప్పండి అంటూ కామెంట్ పెట్టాడు. అంతే కాదు నా వయసు (Age)కూడా ఎంతో చెప్పండి అంటూ పెద్ద క్విజ్(Quiz)పెట్టాడు ఎడ్డీ హాల్. ఈ పోస్ట్‌తో నెటిజన్లు అంతా రకరకాలుగా స్పందిస్తున్నారు. ప్రపంచంలోని అత్యంత బలవంతుల్ని తన పిడుగుద్దులతో మట్టి కరిపించే ఈ శక్తిమాన్ వయసు ఎంత అయి ఉంటుందబ్బా అంటూ నెటిజన్లు అలోచనలో పడిపోయారు. దీంతో ఎడ్డీహాల్ ఇన్‌స్టా ఫోటో తెగ వైరల్ (Viral)అయిపోయింది.
బాహుబలి ఫోటోకున్న క్రేజ్ ఇది..
ఈ శక్తివంతుడు పోస్ట్ చేసిన ఫోటోలో ఫ్యామిలీ అంతా ఉండటంతో..ఖచ్చితంగా ఇది హాలీడేస్‌లో ఎక్కడికో వెళ్లినప్పుడు దిగిన ఫోటోగా గుర్తుపట్టారు. కానీ ఎడ్డీ హాల్ వయసు ఎంత ఉంటుంది. ఈ ముగ్గురు పిల్లల్లో ఎడ్డీ హాల్ ఎవరన్న దానిపై కన్ఫ్యూజ్ అవుతున్నారు. 16ఏళ్ల మృగం అని ఎడ్డీ హాల్ పెట్టిన ట్యాగ్ లైన్ ఆధారంగా ఫోటోలో ఉన్న ముగ్గురి పిల్లల్లో ఎడమ వైపున ఉన్న చిన్న పిల్లాడే ఎడ్డీహాల్ అని ఫిక్సైపోయారు. గుర్తు పట్టారు సరే.. ఎడ్డీ హాల్ వయసు ఎంత అనే దానిపై ఎవరికి తోచిన సంఖ్యను వాళ్లు పోస్ట్ చేస్తున్నారు. ఫోటో కనీసం పాతికేళ్ల క్రితం తీసుకున్నట్లుగా భావిస్తూ కొందరు నలభై సంవత్సరాలు అంటే మరికొందరు ముప్పై ఏళ్లు ఉంటాయని ఎడ్డీ హాల్ ఏజ్‌తో గేమ్స్ ఆడుతున్నారు సోషల్ మీడియా యూజర్స్.
ఈసారి టైటిల్ ఎవరిదో..?
తన బాక్సింగ్ కిక్స్‌తో రెండు సార్లు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతుడిగా పేరు తెచ్చుకున్న ఎడ్డీ హాల్..మరోసారి అదే పేరును సార్ధకం చేసుకునే పనిలో పడ్డారు. మార్చిలో జరిగే బాక్సింగ్ పోటీల్లో థార్ బ్జోర్న్సన్తో పోటీ పడేందుకు కసరత్తు చేస్తున్నాడు. 2017లో వరల్డ్ స్ట్రాగెస్ట్మెన్గా రికార్డులకెక్కాడు ఎడ్డీ హాల్. అప్పటికే వరల్డ్ ఫేమస్ బాక్సర్‌గా పేరున్న థార్ బ్జోర్న్సన్ను వెనక్కి నెట్టి ముందు వరుసలో నిలిచాడు. ఆ తర్వాత యూకే స్ట్రాంగెస్ట్మెన్, ఇంగ్లాండ్ స్ట్రాంగెస్ట్ మెన్‌గా ఎన్నో టైటిల్స్ తన సొంతం చేసుకున్నాడు. మార్చిలో జరిగే ప్రతిష్టాత్మక బాక్సింగ్ పోటీలపైనే అందరి దృష్టి ఉంది. ఈసారి టైటిల్ ఎవరు గెలుస్తారన్న దానిపైనే ఉత్కంఠ నెలకొంది.
Published by:Siva Nanduri
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.