• HOME
  • »
  • NEWS
  • »
  • TRENDING
  • »
  • BOUGAINVILLE IS A NEW COUNTRY IN MAKING GETS STAGGERING VOTES IN FAVOUR OF INDEPENDENCE FROM PAPUA NEW GUINEA NK

Bougainville : మరో కొత్త దేశం వస్తోందోచ్...

Bougainville : మరో కొత్త దేశం వస్తోందోచ్...

కొత్త దేశం బోగన్‌విల్లె (credit - google map)

Bougainville Island : ప్రపంచవ్యాప్తంగా ఐక్యరాజ్యసమితి 193 దేశాల్ని గుర్తించింది. అవన్నీ అందులో సభ్య దేశాలుగా ఉన్నాయి. ఐరాస గుర్తించనివి మరో పది దాకా ఉన్నాయి.

  • Share this:
    Bougainville : మన ప్రపంచంలో ఎన్ని దేశాలు అన్న ప్రశ్నకు సరైన సమాధానం లేదు. ఒక్కొక్కరూ ఒక్కోలా చెప్పే పరిస్థితి. ఈ క్రమంలో మరో కొత్త దేశం రాబోతోంది. అదే బోగన్ విల్లె. దక్షిణ పసిఫిక్‌ ప్రాంతంలోని బోగన్‌విల్లె దీవి కొత్త దేశంగా ఆవిర్భవించబోతోంది. పపువా న్యూ గినియా నుంచి స్వాతంత్య్రం కోరుతూ నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో 98 శాతం మంది కొత్త దేశం కావాలని ఓటు వేశారు. రెండువారాల పాటు సాగిన ఓటింగ్‌లో 85 శాతం మంది ఓటు హక్కును వాడుకున్నా్రు. ఇప్పటివరకూ ఈ ప్రదేశం... బోగన్‌విల్లే సార్వభౌమత్వ ప్రాంతంగా ఉంది. చూడటానికి ఇది ఓ సింగిల్ దీవిలా ఉన్నా... ఇందులో చిన్న చిన్న దీవులు చాలా ఉన్నాయి. మొత్తం 700 కిలోమీటర్లు విస్తరించి ఉంది. ఇక్కడ 1,80,000 మంది నివసిస్తున్నారు. ఇప్పుడు వాళ్లంతా ఫెస్టివల్ మూడ్‌లో ఉన్నారు. త్వరలోనే బోగన్‌విల్లే కొత్త దేశంగా అధికారిక గుర్తింపు పొందబోతోంది.


    2001లో పపువా న్యూ గినియాలో ఎన్నికలు జరిగినప్పుడు... అప్పటి పాలకులు కొత్త దేశాన్ని ఇస్తామని హామీ ఇచ్చారు. దాంతో అప్పటివరకూ స్వాతత్ర్యం కోసం పోరాడుతున్న వివిధ తెగల ప్రజలు... అంతర్గత యుద్ధాన్ని ఆపారు. దాంతో అప్పట్లో దశాబ్దకాలం పాటూ జరిగిన యుద్ధానికి తెరపడింది. కానీ అప్పటికే దాదాపు 20,000 మంది ప్రాణాలు విడిచారు. ఇప్పుడు అంతా సైలెంట్‌గా ఉంది.


    బోగన్‌విల్లే ప్రస్తుతం ఓ టూరిస్ట్ డెస్టినేషన్. చక్కటి తీర ప్రాంతాలు, బుకా (Buka) టౌన్ చూడటానికి చాలా బాగుంటాయి. ప్రకృతి ప్రేమికులకు ఈ దీవి బాగా నచ్చుతుంది. సాహసాలు చెయ్యాలనుకునేవారికి ఈ దీవి బాగా సెట్టవుతుందని స్థానికులు తెలిపారు. స్కూబా డైవింగ్, సర్ఫింగ్, కయాకింగ్ వంటివి ఇక్కడ చెయ్యడానికి అనుకూలంగా ఉంటుందని అక్కడి టూరిజం శాఖ వివరించింది.


    వెంకీ మామ బ్యూటీ రాశీ ఖన్నా క్యూట్ పిక్స్




    ఇవి కూడా చదవండి :

    ఓం...క్రీం...హ్రీమ్... అన్నాడు... యువతిని రేప్ చేశాడు

    పౌరసత్వ సవరణ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం

    అమ్మో కిలాడీ... డేటింగ్ పేరుతో రూ.73 లక్షలు దోపిడీ

    గాలి నుంచి నీరు... లీటర్ రూ.5... ఎక్కడో తెలుసా?

    Health Tips : గుండె ఫిట్‌గా ఉండాలా... ఈ 5 చిట్కాలు పాటించండి
    Published by:Krishna Kumar N
    First published: