Video: వైరల్‌గా మారిన 'బాటిల్ క్యాప్ ఛాలెంజ్'

#bottlecapchallenge | అల్టిమేట్ ఫైటింగ్ ఛాంపియన్‌షిప్ ఛాంపియన్ మ్యాక్స్ హాల్లోవే ప్రారంభించిన ఛాలెంజ్ ఇది. ఆయన ట్విట్టర్‌లో వీడియో షేర్ చేసిన తర్వాత 'బాటిల్ క్యాప్ ఛాలెంజ్' వైరల్‌గా మారింది.

news18-telugu
Updated: July 2, 2019, 4:29 PM IST
Video: వైరల్‌గా మారిన 'బాటిల్ క్యాప్ ఛాలెంజ్'
Video: వైరల్‌గా మారిన 'బాటిల్ క్యాప్ ఛాలెంజ్' (source: Twitter)
  • Share this:
సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏవో ఛాలెంజ్‌లు కనిపిస్తూనే ఉంటాయి. కానీ వాటిలో కొన్ని మాత్రమే వైరల్ అవుతాయి. కొన్నాళ్ల క్రితం నెటిజన్లు కీకీ ఛాలెంజ్‌ పేరుతో రకరకాల విన్యాసాలు చేశారు. రోడ్లపై డ్యాన్సులు చేస్తూ వీడియోలను అప్‌లోడ్ చేశారు. చివరకు సినిమా స్టార్స్ కూడా అదే బాట పట్టారు. ఇప్పటికీ అలాంటి వెరైటీ ఛాలెంజెస్ ఇంటర్నెట్‌లో కనిపిస్తూనే ఉంటాయి. కొద్ది రోజుల క్రితం టిక్‌టాక్‌లో 'అఛూ ఛాలెంజ్' వైరల్‌గా మారింది. గట్టిగా తుమ్మి ఏదైనా వెరైటీగా చేయడమే ఈ ఛాలెంజ్. ఇప్పుడు ఇంటర్నెట్‌లో మరో ఛాలెంజ్ నెటిజన్లకు సవాల్ విసురుతోంది. అదే 'బాటిల్ క్యాప్ ఛాలెంజ్'. అల్టిమేట్ ఫైటింగ్ ఛాంపియన్‌షిప్ ఛాంపియన్ మ్యాక్స్ హాల్లోవే ప్రారంభించిన ఛాలెంజ్ ఇది. ఆయన ట్విట్టర్‌లో వీడియో షేర్ చేసిన తర్వాత 'బాటిల్ క్యాప్ ఛాలెంజ్' వైరల్‌గా మారింది. ఈ వీడియో చూస్తే 'బాటిల్ క్యాప్ ఛాలెంజ్' అంటే ఏంటో అర్థమవుతోంది.


వీడియో చూశారుగా... ఇదే 'బాటిల్ క్యాప్ ఛాలెంజ్'. అంటే కాలితో ఇలా బాటిల్ మూతను ఓపెన్ చేయాలన్నమాట. ట్విట్టర్, ఫేస్‌బుక్ లాంటి సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ ఛాలెంజ్ వైరల్‌గా మారింది. మరి ఈ ఛాలెంజ్ స్వీకరించినవారి ఫీట్లు చూడండి.













సోషల్ మీడియాలో #BottleCapChallenge పేరుతో సెర్చ్ చేస్తే ఇలాంటి వీడియోలు చాలానే కనిపిస్తాయి.

Cricket Score: క్రికెట్ స్కోర్ ఎంత? ఈ యాప్స్‌లో చూడండి


ఇవి కూడా చదవండి:

Tata Sky: టాటా స్కై యూజర్లకు గుడ్ న్యూస్... కొత్త ప్లాన్‌తో ఒక నెల కనెక్షన్ ఫ్రీ

Petrol Price: ఈ ప్లాన్‌తో లీటర్‌ పెట్రోల్‌పై రూ.10 తగ్గింపు... సాధ్యమేనా?

Insurance: ఎవరూ క్లెయిమ్ చేసుకోని డబ్బు రూ.16,887 కోట్లు... అందులో మీదెంత?
First published: July 2, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...