బాటిల్ క్యాప్ చాలెంజ్‌ విసిరిన మొసలి...చూస్తే షాకవ్వాల్సిందే...

సుమారు 9 ఫీట్ల పొడవున్న ఈ మొసలి తన తోకతో బాటిల్ మూతను తొలగించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.

news18-telugu
Updated: August 9, 2019, 6:31 PM IST
బాటిల్ క్యాప్ చాలెంజ్‌ విసిరిన మొసలి...చూస్తే షాకవ్వాల్సిందే...
(Image : Facebook)
  • Share this:
సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్న బాటిల్ క్యాప్ చాలెంజ్ వెర్రి ఇప్పుడు జంతువులతో సైతం చేయించే స్థాయికి చేరింది. తాజాగా అమెరికాలోని ఆర్లాండోలోని ఓ థీమ్ పార్క్ లో మొసలితో ఈ ఫీట్ చేయించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. సుమారు 9 ఫీట్ల పొడవున్న ఈ మొసలి తన తోకతో బాటిల్ మూతను తొలగించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఇదిలా ఉంటే ఇప్పటికే బ్యాటిల్ క్యాప్ ఛాలెంజ్ ను సెలబ్రిటీలు, స్పోర్ట్స్ పర్సనాలిటీలు, సామాన్య ప్రజలు సైతం చేస్తున్నారు. అయితే చాలా మంది ఈ బ్యాటిల్ క్యాప్ చాలెంజ్ లో సక్సెస్ అవ్వడం ద్వారా తమ ఫిట్ నెస్ నిరూపించుకుంటున్నారు. బాలివుడ్ లో అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ వంటి తారలు సైతం బాటిల్ క్యాప్ చాలెంజ్ ద్వారా తమ సత్తా నిరూపించుకున్నారు.First published: August 9, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు