అక్కడ ఏనుగుల వేటపై నిషేధం ఎత్తివేత...మండిపడుతున్న జంతు ప్రియులు

చాలా ప్రాంతాల్లో రైతులు తన జీవనోపాధి కోల్పోయే దుస్థితి నెలకొనడంతో ఏనుగుల సంతతిని నియంత్రించే లక్ష్యంతో ఏనుగుల వేటపై నిషేధాన్ని ఎత్తివేసినట్లు బోత్సవానా ప్రభుత్వం చెబుతోంది.

news18-telugu
Updated: July 3, 2019, 6:20 PM IST
అక్కడ ఏనుగుల వేటపై నిషేధం ఎత్తివేత...మండిపడుతున్న జంతు ప్రియులు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఏనుగుల వేటపై నిషేధాన్ని ఎత్తివేస్తూ ఆఫ్రికా దేశమైన బోత్సవానా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వివాదాస్పదం అవుతోంది. బోత్సవానా ప్రభుత్వ నిర్ణయాన్ని పర్యావరణ పరిరక్షకులు, జంతు ప్రియులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆఫ్రికా దేశాల్లో ఏనుగుల సంతతి అత్యధికంగా ఉన్న దేశం బోత్సవానా. ఆ దేశంలో దాదాపు 1,35,000 ఏనుగులు అడవులు, ఫెన్సింగ్ లేని పార్కులు, బహిరంగ ప్రదేశాల్లో విహరిస్తున్నాయి. గత 30 ఏళ్లలో అక్కడ ఏనుగుల సంతతి దాదాపు మూడింతలు పెరిగి 1,60,000లకు చేరుకుందని అంచనావేస్తున్నారు.

ఆ దేశంలో గత కొన్నేళ్లుగా ఏనుగుల సంతతి గణనీయంగా పెరిగిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. రైతుల పంటలను ఏనుగుల గుంపులు ధ్వంసం చేయడంతో పాటు రైతులపై దాడి చేసి చంపేస్తున్నాయి. అటవీ ప్రాంతాల్లోని గ్రామాలపై ఏనుగుల దాడి నిత్యకృత్యంగా మారుతున్నాయి. ఏనుగుల దాడి భయం కారణంగా ప్రజలు తమ గ్రామాలను వడిచి వెళ్లిపోతున్నారు. చాలా ప్రాంతాల్లో ఏనుగుల బెడద కారణంగా రైతులు తమ జీవనోపాధిని కోల్పోయే దుస్థితి నెలకొంటోంది.

Botswana, elephants ban, hunting elephants, africa country, save elephants, బోత్సవానా, ఏనుగులు, వన్యప్రాణుల సంరక్షణ, ఏనుగుల వేట
ప్రతీకాత్మక చిత్రం


ఈ నేపథ్యంలో అక్కడ ఏనుగుల సంతతిని తగ్గించే లక్ష్యంతో బోత్సవానా ప్రభుత్వం...ఏనుగుల వేటపై దశాబ్ధాలుగా కొనసాగుతున్న నిషేధాన్ని ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. ఏనుగుల బెడద తీవ్రం కావడంతో మరో గత్యంతరంలేని పరిస్థితిలో వేటపై నిషేధాన్ని ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నారు.Botswana, elephants ban, hunting elephants, africa country, save elephants, బోత్సవానా, ఏనుగులు, వన్యప్రాణుల సంరక్షణ, ఏనుగుల వేట
ప్రతీకాత్మక చిత్రం


అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని కెన్యాకు చెందిన వన్యప్రాణి సంరక్షణ కార్యకర్త డాక్టర్ పౌలా కహుంబు తప్పుబట్టారు. యావత్ ప్రపంచం వణ్యప్రాణుల వేటను అడ్డుకునేందుకు చర్యలు తీసుకుంటుంటే...ఏనుగుల సంరక్షణలో ప్రపంచంలో అగ్రగామిగా ఉన్న బోత్సవానా ఏనుగుల వేటపై నిషేధాన్ని ఎత్తివేయడం సరికాదన్నారు. దీని ద్వారా అంతర్జాతీయంగా ఆ దేశం ఇమేజ్ దెబ్బతింటుందని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని పర్యావరణ ప్రియులందరూ తీవ్రంగా వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ నిర్ణయంతో బోత్సవానా జీవ వైవిధ్యానికి తీవ్ర విఘాతం కలిగే ప్రమాదముందని హెచ్చరించారు.
First published: July 3, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>