Home /News /trending /

BOOM SOUND LIKE LAST YEAR BENGALURU AGAIN GETS JOLTED WITH SONIC BOOM SOUND SCIENTISTS ARE TRYING TO REVEAL MYSTERY NK

Bengaluru: బెంగళూరులో వింత శబ్దాలు... హడలిపోయిన ప్రజలు... ఎందుకు వస్తున్నాయి?

బెంగళూరులో వింత శబ్దాలు (image credit - twitter)

బెంగళూరులో వింత శబ్దాలు (image credit - twitter)

Bengaluru: హాలీవుడ్ థ్రిల్లర్ సినిమాల్లో చూపించినట్లుగా బెంగళూరులో వింత శబ్దాలు ప్రజలను బయపెట్టాయి. కిటికీలు కొట్టుకునేంతగా ఆ శబ్దాలు రావడంతో... ఏమవుతోందో అర్థం కాక ప్రజలు టెన్షన్ పడ్డారు.

    Bengaluru: దాదాపు 100 పార్కులతో ఫుల్ గ్రీనరీతో కళకళలాడే కర్ణాటక రాజధాని బెంగళూరు ఒక్కసారిగా వణికింది. శుక్రవారం భూమిలోంచీ భారీ శబ్దాలు వచ్చాయి. బూమ్ అంటూ తీవ్రంగా వచ్చిన ఆ శబ్దాల దాటికి చాలాచోట్ల ఇళ్ల కిటికీలు కొట్టుకున్నాయి. సిటీలో చాలా చోట్ల మధ్యాహ్నం 12.30కి ఈ శబ్దాలు వచ్చాయి. కొంపదీసి భూకంపం వస్తోందా ఏంటి అని ప్రజలు కంగారుపడ్డారు. కొంత మంది ఇళ్లలోంచీ బయటకు పరుగులు పెట్టారు. అందరినోటా ఒకటే మాట... బూమ్... అందరికీ అదేరకం శబ్దం వినిపించింది. అది ఏం శబ్దం, ఎందుకు వచ్చింది? కారణమేంటి... అనే ప్రశ్నలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు.

    ఏయే ప్రాంతాల్లో:
    బెంగళూరులోని మహదేవపుర, సిల్క్ బోర్డ్, మడివాల, HRS లేఅవుట్, బొమ్మనహళ్లి, అగర, కొత్తనూరు, అనేకల్, పద్మానభ నగర్, హుళిమాపు వంటి చాలా ప్రాంతాల్లో ఈ శబ్దం వినిపించింది. ముఖ్యంగా HRS లే అవుట్ దగ్గర్లో శబ్దాల తీవ్రత చాలా ఎక్కువగా వచ్చింది. మొత్తం 90 నిమిషాలపాటూ ఈ శబ్దం వేర్వేరు చోట్ల వినిపించింది. భూమిలోపల ఏదైనా డైనోసార్ ఉందా... అది అరుస్తూ వెళ్లిందా అనే డౌట్ వచ్చింది చాలా మందికి.


    మైనింగ్ జరుగుతోందా?
    ఈ పరిస్థితిపై వాతావరణ శాఖ డైరెక్టర్ CS పాటిల్ స్పందించారు. దీనిపై టెన్షన్ పడాల్సిన పనిలేదు అన్నారు. ఎక్కడైనా మైనింగ్ బ్లాస్టింగ్ జరుగుతుందేమో తెలుసుకుంటున్నాం అన్నారు. దీనిపై స్పందించిన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెట్ (HAL), తాము ఎలాంటి శబ్దాలూ చెయ్యలేదనీ... తమ విమానాలు కూడా ఎప్పట్లాగే ఉన్నాయి తప్ప... ఏ శబ్దాలూ ప్రత్యేకంగా చెయ్యలేదని చెప్పింది.


    భూకంపమా?
    కర్ణాటక నేచురల్ డిజాస్టర్ మానిటరింగ్ సెంటర్ దీనిపై స్పందించింది. బెంగళూరులో భూకంపం ఏదీ రాలేదనీ... ప్రకంపనల రికార్డులు కూడా ఏవీ నమోదు కాలేదని చెప్పింది.

    మరి ఆ శబ్దాలేంటి?
    బెంగళూరులో సౌండ్లు రావడం ఇదే తొలిసారి కాదు. గతేడాది కూడా ఇలాగే వచ్చాయి. దీనిపై నెటిజన్లు సోషల్ మీడియాలో బాగా చర్చించుకున్నారు. మా దగ్గర వచ్చాయి... మీకూ వచ్చాయా అని ఒకర్ని ఒకరు అడిగారు. కొంత మంది తాము వినలేదని చెప్పారు. ముఖ్యంగా ఉత్తర బెంగళూరులో ఈ శబ్దాలు వినిపించలేదు. గతేడాది HAL ఎయిర్ పోర్టులో ఫైటర్ జెట్ విమానాలు వెళ్లినప్పుడు ఇలాంటి శబ్దాలు వినిపించాయి. ఈసారి అలా జరగలేదని HAL చెప్పడం వల్ల ఇది మిస్టరీగా మారింది.

    ఇది కూడా చదవండి: Gold Rates 3-7-2021: పెరిగిన బంగారం, తగ్గిన వెండి ధర... నేటి మార్కెట్ రేట్లు ఇవీ...

    వర్షాకాలం వల్లేనా?
    గతేడాది హైదరాబాద్‌లో వర్షాకాలంలో మరోరకమైన శబ్దాలు టప్ టప్ మని వినిపించాయి. అందుకు కారణం... భూమిలోపలికి వర్షపు నీరు బలవంతంగా వెళ్లేటప్పుడు ఇలాంటి శబ్దాలు వస్తాయని సైంటిస్టులు చెప్పారు. మరి బెంగళూరులో భూమ్ శబ్దానికి కారణమేంటో తెలాల్సి ఉంది.
    Published by:Krishna Kumar N
    First published:

    Tags: Bangalore, VIRAL NEWS

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు