Library: 60 ఏళ్లకు లైబ్రరీకి పుస్తకం తిరిగిచ్చిన వ్యక్తి.. అంతా ఆశ్చర్యం..

Library: యూకే లోని ఓ లైబ్రరీలో పుస్తకం తీసుకున్న ఓ వ్యక్తి ఏకంగా 60 ఏళ్లకు దానిని రిటర్న్ చేయడం ఆశ్చర్యకరంగా మారింది.

news18-telugu
Updated: October 19, 2020, 12:34 PM IST
Library: 60 ఏళ్లకు లైబ్రరీకి పుస్తకం తిరిగిచ్చిన వ్యక్తి.. అంతా ఆశ్చర్యం..
పుస్తకాన్ని చూపుతున్న లైబ్రరీ అధికారి
  • Share this:
మనమందరం స్కూల్, కళాశాలల్లోని లైబ్రరీల్లో పుస్తకాలు తీసుకుని తిరిగి గడువులోగా రిటర్న్ చేయడం మరిచిపోతూ ఉంటాం. కొన్ని సార్లు వివిధ కారణాలతో ఆలస్యంగా ఇస్తూ ఉంటాం. రోజులు, వారాలు కకపోతే నెలలు ఆలస్యంగా మనం రిటర్న్ చేస్తూ ఉంటాం. అయితే యూకే లోని ఓ లైబ్రరీలో పుస్తకం తీసుకున్న ఓ వ్యక్తి ఏకంగా 60 ఏళ్లకు దానిని రిటర్న్ చేయడం ఆశ్చర్యకరంగా మారింది. అయితే ఎందుకు ఆలస్యంగా ఇచ్చావ్? ఆగ్రహం వ్యక్తం చేయడానికి బదులుగా ఆ లైబ్రరీ సిబ్బంది మొత్తం ఆయనకు ధన్యవాదాలు తెలిపుతూ అభినందిస్తున్నారు. జాఫ్రీ ఫాబెర్ అనే రచయిత యొక్క కవితా సంకలనం యొక్క కాపీ ఇటీవల ఆ లైబ్రరీ యొక్క బుక్ రిటర్న్ విభాగానికి ఓ గుర్తు తెలియని వ్యక్తి అందించారు. అయితే ఆ పుస్తకం 1962 డిసెంబర్ 21న తిరిగి ఇవ్వాల్సి ఉంది. ఇన్ని రోజులు ఆలస్యమైనా ఆ పుస్తకం చెక్కు చెదరకపోవడం విశేషం.

లైబ్రరీ యొక్క బ్లాగ్ పోస్ట్ ప్రకారం.. ఈ కరోనా మహమ్మారి సమయంలో జరిమానాలు నిలిపివేయబడినందున పుస్తకం అనామకంగా తిరిగి ఇవ్వబడిందని భావిస్తున్నట్లు సిబ్బంది తెలిపారు. ఈ సందర్భంగా లైబ్రేరియన్ మరియు కమ్యూనిటీ హబ్ ఆఫీసర్ డేవిడ్ హారింగ్టన్ మాట్లాడుతూ.. ఈ పుస్తకాన్ని మాకు తిరిగి ఇచ్చిన అపరిచిత వ్యక్తికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ఈ పుస్తకం తిరిగి తమ వద్ద ఉన్న పుస్తకాలలో కలవడం సంతోషంగా ఉందన్నారు. భవిష్యత్ తరాలు ఆనందించడానికి ఆ పుస్తకాన్ని రిఫరెన్స్ లైబ్రరీలో ఉంచనున్నట్లు ఆయన చెప్పారు.
Published by: Nikhil Kumar S
First published: October 19, 2020, 12:12 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading