హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

దయచేసి కస్టమర్ లు అలా పిలవోద్దు.. స్మార్ట్ గా రిక్వెస్ట్ చేస్తున్న క్యాబ్ డ్రైవర్.. ఎందుకో తెలుసా..?

దయచేసి కస్టమర్ లు అలా పిలవోద్దు.. స్మార్ట్ గా రిక్వెస్ట్ చేస్తున్న క్యాబ్ డ్రైవర్.. ఎందుకో తెలుసా..?

కారు డ్రైవర్ సీటుపై రాసిన నోట్..

కారు డ్రైవర్ సీటుపై రాసిన నోట్..

Viral news: క్యాబ్ డ్రైవర్ సీటు వెనుకాల ఉన్న యాడ్ ఇప్పుడు సోషల్ మీడియాలో హట్ టాపిక్ గా మారింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Maharashtra, India

మనం తరచుగా ఎక్కడికి వెళ్లాలన్న ప్రైవేటు కార్లు, ఆటో సర్వీసులలో వెళ్తుంటాం. ఎక్కువగా ఓలా, ఉబర్ కార్లను ఆన్ లైన్ లో బుక్ చేసుకుని మరీ వెళ్తుంటాం. ఈ క్రమంలో.. మనలో చాలా మందికి క్యాబ్ డ్రైవర్లను.. భయ్యా అని లేదా అంకుల్ అని గానీ పిలుస్తుంటాం. అయితే.. ఈ మధ్య ముంబాయిలో కొంత మంది క్యాబ్ డ్రైవర్లు తమ సీటు వెనకాల తమను భయ్యా అనిగానీ, అంకుల్ అని పిలవోద్దని రాసి మరీ పేస్ట్ చేశారు. అంతే కాకుండా.. తమ పేర్లతో పిలవాలని కూడా దానిలో సూచించారు.

అయితే.. ఇప్పుడు ఈ సీటువెనుకాల ఉన్న నోట్ నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతుంది. దీనిపై నెటిజన్లు ఒక రేంజ్ లో కామెంట్ లు చేస్తున్నారు. కొన్నిసార్లు... ‘టీనేజ్ అమ్మాయిలు కారులో ఎక్కే చాన్స్ ఉంది.. అలాంటి వాళ్లు భయ్యా.. అంటే పాపం.. మనోడికి ఆశలు కల్లాస్.. ’..అందుకే ఇలా రాశాడోమో.., ‘డ్రైవర్ అమ్మాయా.. లేక అబ్బాయా..?..’.అంటు కామెంట్ లు పెడుతున్నారు.

ఇంకొందరు.. ‘కొందరు యంగ్ గా ఉన్న వాళ్లను కూడా అంకుల్’.. అని పిలుస్తుంటారు.,‘కొందరు తమ రైడింగ్ అయ్యేవరకు అందమైన అమ్మాయిలను లవ్ లో దింపేయాలనుకుంటారు..అలాంటి వాళ్లు ఒక్కసారిగా దిగేటప్పుడు భయ్యా.. అంటే.. ఇంకే మైన ఉందా.. ’.. అందుకే అలా రాశాడేమో..’,‘ఇక నుంచి డ్రైవర్ సాబ్.. పిలవాలి..’.. అంటూ ఫన్నీగా కామెంట్ లు పెడుతుంటారు. ఏదీ ఏమైన ఈ డ్రైవర్ సీటువెనుకాల ఉన్న యాడ్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇదిలా ఉండగా దేశ మంతాట దుర్గాపూజలు ఘనంగా నిర్వహిస్తున్నారు. తొమ్మిది రోజుల పాటు భక్తులు వివిధ రూపాలలో అమ్మవారిని కొలుస్తారు. కొందరు తొమ్మిది రోజుల పాటు ఉపవాసాలు కూడా ఉంటారు. అయితే.. అనేక చోట్ల దాండియా డ్యాన్స్, గర్భా ప్రదర్శన చేస్తుంటారు. వీటిల్లో పోటీ కూడా ఉంటుంది. ఎవరైతే గర్భాడ్యాన్స్ బాగా చేస్తారో వారికి ప్రత్యేకంగా బహుమతిని కూడా ఇస్తారు.

అయితే.. ముంబైలోకి (mumbai) లోకల్ ట్రైన్ లో (local trin)  కొందరు మహిళలు ట్రైన్ లోనే ఒక సమూహంగా ఏర్పాడ్డారు. అందరు కలిసి గర్బా డ్యాన్స్ చేశారు. లోకల్ ట్రైన్ లో కాలేజీలకు, ఆఫీసులకు వెళ్లే యువతులు, మహిళలు అంత గుంపులుగా ఏర్పడి గార్భ ప్రదర్శన చేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ మధ్యనే కొందరు వినూత్నంగా రాజస్థాన్ లో స్విమ్మింగ్ పూల్ లో గుంపులుగా గర్భా డ్యాన్స్ చేసిన విషయం తెలిసిందే.

Published by:Paresh Inamdar
First published:

Tags: Cab services, Maharashtra, VIRAL NEWS

ఉత్తమ కథలు