నూతన సంవత్సర వేళ బాలీవుడ్‌లో విషాదం.. విలక్షణ నటుడు ఖాదర్ ఖాన్ ఇక లేరు

నూతన సంవత్సర వేళ బాలీవుడ్‌లో విషాదం చోటు చేసుకుంది. గత కొన్నేళ్లుగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతోన్న బాలీవుడ్ ప్రముఖ నటుడు ఖాదర్ ఖాన్ కెనడా లోని తన స్వగృహంలో తెల్లవారు ఝమున నాలుగు గంటలకు కన్నుమూసారు. ఈ విషయాన్ని ఆయన తనయుడు సర్ఫరాజ్ ఖాన్ అధికారికంగా వెల్లడించారు.

news18-telugu
Updated: January 1, 2019, 11:16 AM IST
నూతన సంవత్సర వేళ బాలీవుడ్‌లో విషాదం.. విలక్షణ నటుడు ఖాదర్ ఖాన్ ఇక లేరు
‘ఖాదర్ ఖాన్’
  • Share this:
నూతన సంవత్సర వేళ బాలీవుడ్‌లో విషాదం చోటు చేసుకుంది. గత కొన్నేళ్లుగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతోన్న బాలీవుడ్ ప్రముఖ నటుడు ఖాదర్ ఖాన్ కెనడా లోని తన స్వగృహంలో తెల్లవారు ఝామున నాలుగు గంటలకు కన్నుమూసారు. ఈ విషయాన్ని ఆయన తనయుడు సర్ఫరాజ్ ఖాన్ అధికారికంగా వెల్లడించారు. గత కొన్నేళ్లుగా ఖాన్..న్యూమెనియాతో బాధ పడుతున్నారు.

బాలీవుడ్‌లో  ఎన్నో సినిమాలకు ఆయన కథా రచయితగా పనిచేశారు. అంతేకాదు ఒకవైపు రైటర్‌గా పనిచేస్తూనే బాలీవుడ్‌లో విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్నారు.

తనదైన నటనతో ప్రేక్షకుల మనసులో చెరగని ముద్రవేసిన ఖాదర్ ఖాన్..22 అక్టోబర్ 1937లో అఫ్ఘనిస్థాన్‌లో జన్మించారు. ముందు కథా రచయితగా సినీ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఖాన్..ఆ తర్వాత 1971లో తెరకెక్కిన ‘ఫజ్ర్ అల్ ఇస్లామ్’లో వాయిస్ ఓవర్ అందించారు.

ఖాదర్ ఖాన్ (ఫైల్ ఫోటో)


ఇక 1973లో రాజేష్ ఖన్నా హీరోగా తెరకెక్కిన ‘డాగ్’ మూవీతో నటుడిగా తన ప్రస్థానాన్ని మొదలు పెట్టిన ఖాదర్ ఖాన్..ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. ఒకవైపు నటిస్తూనే చాలా సినిమాలకు కథా సహకారంతో పాటు మాటలు అందించారు.

ఖాదర్ ఖాన్ (ఫైల్ ఫోటో)


ముఖ్యంగా అమితాబ్ బచ్చన్ నటించిన చాలా సినిమాలకు ఆయన కథ, మాటలు అందించడం విశేషం.
అమితాబ్ బచ్చన్, ఖాదర్ ఖాన్ (యూట్యూబ్ క్రెడిట్)


బాలీవుడ్‌లో విలన్‌గా తన నటనతో మెప్పించిన ఖాదర్ ఖాన్..ఆ తర్వాత టాప్ కమెడియన్‌గా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా బాలీవుడ్‌లో ఆయనకంటూ కొన్ని పేజీలు రాసుకున్నారు. ముఖ్యంగా గోవిందాతో ఈయన కాంబినేషన్ బాలీవుడ్‌లో కాసులు వర్షం కురిపించాయి.

గోవిందాతో ఖాదర్ ఖాన్ (యూట్యూబ్ క్రెడిట్)


అంతేకాదు బాలీవుడ్‌లో కమెడియన్‌గా విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎక్కువ సినిమాల్లో డ్యూయల్, త్రిపుల్ రోల్స్ చేసి మెప్పించిన నటుడిగా ఖాదర్ ఖాన్‌కు బాలీవుడ్‌లో సెపరేట్ రికార్డు ఉంది.ఇక ఆయన నటించిన చివరి చిత్రం 2017లో తెరకెక్కిన  ‘మస్తు నహీ శస్తీ’. ఆ తర్వాత ఆరోగ్యం సరిగా లేకపోవడంతో సినిమాలకు దూరంగా ఉన్నారు.మొత్తానికి బాలీవుడ్‌లో తనదైన నటనతో మెప్పించిన ఆయన లేని లేటు పూడ్చలేనిది.


ఇది కూడా చదవండి 

#HBD:విద్యాబాలన్@40Published by: Kiran Kumar Thanjavur
First published: January 1, 2019, 10:54 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading