Home /News /trending /

BOLLYWOOD STARS MOURN THE DEATH OF HOLLYWOOD LEGENDARY ACTOR SIDNEY POITIER SNR

నల్లజాతి నట ఆణిముత్యం ఇకలేరు..సిడ్నీ పోయిటియర్‌కి బాలీవుడ్‌ సంతాపం

Photo Credit: Instagram

Photo Credit: Instagram

Sidney Poitier: అతనో మహానటుడు. తన అద్భుతమైన నటనతో ప్రతిష్టాత్మకమైన ఆస్కార్‌ అవార్డ్‌ను ప్రకటించిన ఏడాదే దక్కించుకున్న లెజండ్రీ యాక్టర్. 94ఏళ్ల నల్లజాతి ఆణిముత్యం సిడ్నీ పోయిటియర్‌ ఇప్పుడు అందరికి శాశ్వతంగా దూరమయ్యారు.

ఈ లోకాన్ని విడిచివెళ్లిపోయిన ఒకప్పటి హాలీవుడ్‌ స్టార్‌ని ముంబై తారలు మర్చిపోలేకపోతున్నారు. నల్లజాతిలో పుట్టిన లెజండ్రీ యాక్టర్ సిడ్నీ పోయిటియర్‌ (Sidney Poitier)సినిమా ప్రపంచాన్నే కాదు అందర్ని వదిలి శాశ్వతంగా దూరమవడంతో ఆయన్ని స్మరించుకుంటున్నారు. 94ఏళ్ల సిడ్నీ పోయిటియర్‌ ఆస్కార్‌ అవార్డు (Oscar award winner)అందుకున్న తొలి నల్లజాతి నటుడిగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఆయన లేరన్న వార్త తెలిసి బాలీవుడ్‌(Bollywood)కి చెందిన నటులు అనీల్‌కపూర్‌(Anil kapoor), అనుమప్‌ఖేర్‌(Anupam kher),మనోజ్‌బాయ్‌పాయ్(Manoj bajpayee),రణదీప్‌హుడా(Randeep hooda)సంతాపం ప్రకటించారు. ఆయనతో తమకున్న తీపి గుర్తుల్ని సోషల్ మీడియా (Social media)వేదికగా అందరితో షేర్ చేసుకున్నారు బాలీవుడ్‌ నటులు. సిడ్నీ పోయిటియర్‌..లిల్లీస్‌ ఆఫ్ ది ఫీల్డ్ (Lilies of the field)సినిమాతో తానేంటో నిరూపించుకున్న మహానటుడు. ఆస్కార్‌ అవార్డు ప్రకటించిన తొలి ఏడాదే దాన్ని అందుకున్న తొలి నల్లజాతి యాక్టర్ కావడం విశేషం. ముఖ్యంగా సిడ్నీ పొయిటియర్‌(Sidney Poitier)గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన రచనలు, నటన ఎంతటి వారినైనా కట్టిపాడేస్తాయనడంలో అతిశయోక్తి లేదు. అలాంటి మహానటుడు లేడన్న వార్త తనను ఎంతగానో కలచి వేసిందన్నారు బాలీవుడ్ నటుడు అనుపమ్‌ఖేర్. సిడ్నీ పాయిటియర్‌తో 2013లో దిగిన ఫోటోను సోషల్ మీడియా (Twitter)ద్వారా షేర్ చేసుకున్నారు. అలాంటి గొప్ప నటుడు తనతో గడిపిన సమయం ఎప్పటికి మర్చిపోలేనంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు అనుపమ్‌ఖేర్.

లెజెండ్‌ యాక్టర్‌ ఇకలేరు..
ది డిఫైయంట్ వన్స్, పోర్గీ అండ్ బెస్‌, ఏ రైసిన్‌ ఇన్‌ ది సన్‌, పాలిస్ బ్లూస్ వంటి ఎన్నో అద్భుత రచనలు చేసిన నటుడు సిడ్నీ పోయిటీయర్. అలాంటి గొప్ప నటుడు తనకు ఇన్సిపిరేషన్ అన్నారు నటుడు అనీల్‌కపూర్‌. ఆయన నటించిన కొన్ని సినిమాలు తనకు ఎప్పటికి నచ్చుతాయంటూ ట్వీట్ చేశారు. సిడ్నీతో దిగిన ఫోటోను పోస్ట్ చేశారు అనీల్‌కపూర్.

నల్లజాతి నట ఆణిముత్యం..
దిగ్గజ నటుడు సిడ్నీ పోయిటియర్‌ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను అంటూ ట్వీట్‌ చేశారు మరో బాలీవుడ్ యాక్టర్ మనోజ్‌బాయ్‌పాయ్. మహానటుడి మరణానికి చింతిస్తూ సంతాపం తెలిపారు.

ఆయన నటన అందరికి స్పూర్తి..
మరో నటుడు రణదీప్‌ హడా సైతం సిడ్నీ పోయిటియర్‌ మరణవార్తపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ సిడ్నీకి సంబంధిన ఫోటోలను తన ట్విట్టర్‌ అకౌంట్‌లో పోస్ట్ చేశారు.

దివికెగసిన తొలి ఆస్కార్‌ విజేత..
నల్లజాతిలో పుట్టిన నటవజ్రంగా పేరు తెచ్చుకున్నారు సిడ్నీ పోయిటియర్. ఒక్క సినిమా ప్రపంచంలోనే కాదు పేదరికం, నిరక్షరాస్యతకు వ్యతిరేకంగా పోరాడిన నల్లజాతి నటుల్లో ఒకడిగా గుర్తింపు దక్కించుకున్నారు. 2009లో అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా చేతుల మీదుగా ప్రెసిడెన్షియల్ మెడల్‌ ఆఫ్ ఫ్రీడం అనే అమెరికా అత్యున్నత పౌరపురస్కారం అందుకున్నారు సిడ్నీ పోయిటియర్. అంతటి మహానటుడు లేడన్న వార్త హాలీవుడ్‌, బాలీవుడ్‌నే కాదు యావత్ సినీ అభిమానుల్ని కుదిపేస్తోంది.
Published by:Siva Nanduri
First published:

Tags: Bollywood actor, Holllywood News

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు