దీపికా పెళ్లి డేట్ ఫిక్స్...ఇన్‌స్టాలో శుభలేఖ పోస్ట్ చేసిన పద్మావతి!

నవంబర్ 14, 15 తేదీల్లో పెళ్లి చేసుకోబోతున్నట్టు తెలుపుతూ ఇన్‌స్టాలో హిందీ శుభలేఖ పోస్ట్ చేసిన దీపికా పదుకునే... ప్రదేశం, పెళ్లి ముహుర్తం ఖరారు చేయని జంట!

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: October 21, 2018, 4:34 PM IST
దీపికా పెళ్లి డేట్ ఫిక్స్...ఇన్‌స్టాలో శుభలేఖ పోస్ట్ చేసిన పద్మావతి!
రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకునే
  • Share this:
గత కొన్నేళ్లుగా పీకలోతు ప్రేమలో మునిగిపోయిన బాలీవుడ్ హాట్ జంట రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకొణే ఎట్టకేలకు పెళ్లి చేసుకుని ఒక్కటి కాబోతున్నారు. కొన్నాళ్లుగా బాలీవుడ్ ‘పద్మావతి’ పెళ్లి గురించి వార్తలు షికార్లు చేస్తున్నా, డేట్ గురించి మాత్రం స్పష్టత లేకపోయింది. అయితే ఎట్టకేలకు దీపికా పదుకునే స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా పెళ్లి డేట్ ఖరారు చేస్తూ శుభలేక ట్వీట్ చేసింది. నవంబర్ 14, 15 తేదీల్లో పెళ్లి చేసుకోబోతున్నట్టు తెలుపుతూ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో హిందీలో రాసిన శుభలేఖ పోస్ట్ చేసింది దీపికా పదుకునే.

రణబీర్ కపూర్‌తో బ్రేకప్ తర్వాత రణ్‌వీర్ సింగ్‌తో పీకల్లోతు ప్రేమలో కూరుకుపోయింది దీపికా. వీరిద్దరూ కలిసి నటించిన ‘రామ్‌లీల’, ‘భాజీరావ్ మస్తానీ’, ‘పద్మావత్’ సినిమాల్లో కలిసి నటించిన ఈ ప్రేమ జంట... బాలీవుడ్ సూపర్‌హిట్ జోడిగానూ గుర్తింపు తెచ్చుకుంది. వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నారని, తల్లిదండ్రులను ఒప్పించి త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని చాలారోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు పెళ్లి పనులు ప్రారంభమయ్యాయనని, డ్రెస్ డిజైనర్లను మాట్లాడేశారని, పెళ్లికి సంబంధించిన అన్ని పనులు పూర్తి కావొచ్చిన్నట్టు వార్తలు వచ్చాయి.


రీసెంట్‌గా రణ్‌బీర్ ముంబాయిలో కొనుగోలు చేసిన ఇంటికి మెరుగులు దిద్దాడు. పెళ్లి తర్వాత దీపికా, రణ్‌వీర్ ఇక్కడే కలిసి ఉంటారనే ప్రచారం జరుగుతోంది. ప్రెజెంట్ వీళ్లిద్దరు వాళ్ల ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఆయా ప్రాజెక్టులు కంప్లీటైన తర్వాత వీళ్లిద్దరు మూడు మూళ్లతో ఒక్కటి కావాలనుకుంటున్నట్టు సమాచారం. పెళ్లి డేట్ చెప్పిన ఈ ప్రేమజంట... ఎక్కడ పెళ్లి చేసుకోబోతున్న విషయం చెప్పలేదు. పెళ్లి ముహుర్తం కూడా ఖరారు చేయలేదు. అనుష్క- విరాట్ జోడిలా విదేశాల్లో పెళ్లి చేసుకుని, ఇక్కడ రిసెప్షన్ పార్టీ ఇస్తారా... అనే విషయాలపై క్లారిటీ రాలేదు.రణవీర్ సింగ్ ట్విట్టర్లో పెళ్లి కార్డును పోస్ట్ చేశాడు. నమస్కరిస్తున్న ఎమోజీ మాత్రమే యాడ్ చేశాడు. ప్రస్తుతం దీపికా పదుకునే, షారుక్ ఖాన్ ‘జీరో’ సినిమాలో నటిస్తుండగా... రణ్‌వీర్ ‘సింబా’ (టెంపర్ రీమేక్), ‘గల్లీ బాయ్’ సినిమాల్లో నటిస్తున్నాడు.
Published by: Ramu Chinthakindhi
First published: October 21, 2018, 4:18 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading