• HOME
  • »
  • NEWS
  • »
  • TRENDING
  • »
  • BOLLYWOOD HERO SALMAN KHAN TURNS TO BE A FARMER DURING LOCKDOWN NK

తొలిసారి వ్యవసాయం చేస్తున్న సల్మాన్‌ఖాన్... ఏం పండిస్తున్నాడంటే...

తొలిసారి వ్యవసాయం చేస్తున్న సల్మాన్‌ఖాన్... ఏం పండిస్తున్నాడంటే...

తొలిసారి వ్యవసాయం చేస్తున్న సల్మాన్‌ఖాన్... (credit - instagram)

లాక్‌డౌన్‌లో సినీ తారలు, స్పోర్ట్స్ వీరులూ... అందరూ వ్యవసాయంపై ఎక్కవగా ఆసక్తి చూపిస్తున్నారు. MS ధోనీ లాగే సల్మాన్ ఖాన్ వ్యవసాయం చేస్తున్నాడు.

  • Share this:
    కరోనా లాక్‌డౌన్ కాలం... షూటింగ్స్ జరిపే పరిస్థితి లేదు. ఇంట్లోనే ఉంటే బోర్. అందుకే... కోలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకూ... తారలు రకరకాల ఛాలెంజ్‌లలో పాల్గొంటున్నారు. ఎక్కువ మంది గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటుతుంటే... టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ లాంటి వారు ఏకంగా ఆర్గానిక్ ఫార్మింగ్ చేపడుతున్నారు. తాజాగా... బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ సైతం... పొలం బాట పట్టాడు. తన ఫామ్‌లోని పొలంలో సల్మాన్ పనిచేస్తున్న దృశ్యాలు ఇప్పుడు తెరపైకి వచ్చాడు. తన గర్ల్ ఫ్రెండ్ లూలియా భంటర్‌తో కలిసి... సల్మాన్ గుడ్ టైమ్ ఎంజాయ్ చేశాడు. పొలం పనులతో కలిగే ఆనందాన్ని స్వయంగా తెలుసుకున్నాడు.








    View this post on Instagram





    Daane daane pe likha hota hai khane wale Ka naam... jai jawan ! jai kissan !


    A post shared by Salman Khan (@beingsalmankhan) on













    View this post on Instagram





    Following the Legend........ My Maalik @Beingsalmankhan #Salmankhan #Legend #Sheraa #Beingsheraa


    A post shared by Being Sheraa (@beingshera) on





    సల్మాన్ ఎన్నో పాత్రలు పోషించినా... పొలం పనులు ఎప్పుడూ చెయ్యలేదు. ఇప్పుడు మాత్రం మిగతా పనులన్నీ బోర్ కొట్టాయేమో... వ్యవసాయం చేస్తున్నాడు. సల్మాన్ ఖాన్ బాడీ గార్డ్ షెరా... కొన్ని ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. సల్మాన్‌లో మరో కోణాన్ని చూడండి అని రాశారు.




    షెరా... తను నేచర్‌లో తీసుకున్న ఫొటోలను కూడా షేర్ చేశారు. ప్రస్తుతం సల్మాన్ కొత్త అవతారాన్ని నెటిజన్లు ఆసక్తిగా చూస్తున్నారు. సల్లూ భాయ్ గడ్డి కోస్తున్నాడు అంటూ కామెంట్స్ రాస్తున్నారు. ఐతే... సల్మాన్ రైతుల లాగా ఏవేవో పంటలు పండించాలనే ఉద్దేశంతో లేడని తెలిసింది. ధోనీ మాత్రం తన 60 ఎకరాల తోటలో అరటి, బొప్పాయి పండిస్తున్నాడు.
    Published by:Krishna Kumar N
    First published:

    అగ్ర కథనాలు