నిత్యం షూటింగ్‌లతో బిజీగా ఉండే హీరోలు, హీరోయిన్లు, నటులు..ఒక్కసారిగా బయట కనిపిస్తే జనం మీద పడటంతో వాళ్లు ఒకింత అసహనానికి లోనవుతుంటారు. అది బయటకు చెప్పులోక ఏదో మేనేజ్ చేస్తుంటారు. అయితే బాలీవుడ్(Bollywood)హీరో రణ్‌బీర్‌కపూర్ (Ranbir kapoor) మాత్రం తన కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయాడు. ముంబైలో ఓ అభిమాని సెల్ఫీ (Selfie) కోరగానే ఆగి నిల్చున్నాడు. ఫోటో తీసే వ్యక్తి రెండు, మూడు సార్లు ప్రయత్నించినా ఫోన్ కెమెరా ఆన్ కాకపోవడంతో చిర్రెచ్చుకొచ్చిన రణ్‌బీర్ కపూర్ అతని చేతిలో సెల్‌ఫోన్(Cell phone)లాక్కొని విసిరేశాడు. ఇప్పుడు ఈ వీడియో(Video)నే సోషల్ మీడియా(Social media)లో తెగ వైరల్ అవుతోంది. అయితే కొందరు బాలీవుడ్ హీరో చేసిన పనిని సమర్దిస్తుంటే..మరికొందరు తప్పు పడుతున్నారు.
అభిమాని ఫోన్ విసిరేసిన హీరో..
సినిమా హీరోలకు ఒక్కొక్కసారి అభిమానులు ఆగ్రహం తెప్పిస్తుంటారు. సెల్పీలు, ఆటోగ్రాఫ్‌ల కోసం వారిని వెంటపడటమే కాకుండా..తెగ ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఎక్కడైనా బయట కనిపిస్తే చాలు..మీద పడి షేక్ హ్యాండివ్వడానికి, అతని పక్కన నిల్చోవడానికి ట్రై చేస్తుంటారు. ముంబైలో హీరో రణ్‌బీర్‌కపూర్‌తో ఫోటో దిగాలని ఓ ఫ్యాన్ ముచ్చటపడ్డాడు. హీరో వెళ్తుంటే ఒక్క సెల్ఫీ ప్లీజ్ అని రిక్వెస్ట్ చేసాడు. వెంటనే రణ్‌బీర్ కపూర్ ఆగి ఫోటోకు నవ్వుతూ ఫోజిచ్చాడు.అయితే సెల్‌ఫోన్‌తో ఫోటో తీస్తున్న అభిమానికి కెమెరా ఆన్ కాకపోవడంతో రెండు సార్లు ప్రయత్నించాడు. అప్పటికే హీరోకి ఓపిక నశించడంతో మూడోసారి ఫోన్ ఇవ్వమని తీసుకొని వెనక్కి విసిరేశాడు.
????AD???? pic.twitter.com/nyp8Tl88f1
— ???????????????????????????????? ???????????????????? (@BheeshmaTalks) January 27, 2023
వీడియోపై రియాక్షన్స్..
అయితే రణ్‌బీర్ కపూర్ ఇంత సీరియస్‌గా బిహేవ్ చేసిన వీడియోపై నెటిజన్లు డిఫరెంట్‌గా స్పందిస్తున్నారు. కొందరు బాలీవుడ్ హీరో అలాంటి వాడు కాదని సమర్ధిస్తున్నారు. మరికొందరు ఈదేదో సెల్‌ఫోన్ బ్రాండ్ ప్రచారానికి సంబంధించిన వీడియో అనుకుంటా అంటూ ప్రాంక్ వీడియోగా భావిస్తున్నారు. ఇంకొందరు రణ్‌బీర్ కపూర్ చేసింది ఏం బాగోలేదని ...హీరోలను అభిమానించే ఫ్యాన్స్ పట్ల ఇంత దురుసుగా, పొగరుగా ప్రవర్తించడం మంచిపద్దతి కాదంటూ ట్వీట్‌లే చేస్తున్నారు.
వైరల్ వీడియో...
అయితే రణ్‌బీర్ కపూర్‌కి నిజంగానే కోపం వచ్చిందా లేక ఏదైనా ప్రమోషన్ కోసం ఇదంతా చేసి వీడియోని వైరల్ చేస్తున్నారా అనే విషయంపై మాత్రం క్లారిటీ రాలేదు. అయితే నెటిజన్లు మాత్రం ఈవిషయాన్ని, వీడియోని సీరియస్‌గానే తీసుకుంటున్నారు. ట్రోల్ చేస్తూనే ఉన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bollywood actor, Ranbir Kapoor, Viral Video