అమితాబ్ బచ్చన్(Amitabh Bachchan).. బిగ్ బీ, బాలివుడ్ మెగాస్టార్.. ఇవన్నీ ఇప్పుడు కావచ్చు. కానీ పాఠశాల రోజుల్లో(School Days) ఆయన కూడా అందరిలానే సాధారణ విద్యార్థే. మిత్రులతో కలిసి సరదగా ఆడుకోవడం, కొంటె పనులు చేయడం లాంటివి ఆయన కూడా చేశారట. ఇందుకు సంబంధించి ఇటీవలే ఓ సంఘటనను పంచుకున్నారు. కౌన్ బనేగా కరోడ్ పతీ-12 (kaun banega crorepathi-12)వ సీజన్ లో చిన్నప్పుడు తాను చెప్పిన ఓ అబద్దం కారణంగా ప్రిన్సిపాల్(Principal) చేతిలో దెబ్బలు తిన్న విషయాన్ని గుర్తు చేసుకున్నారు.
‘నేను చిన్నప్పుడు నా స్నేహితులతో కలిసి ఓ పాముపై దాడి చేసి చంపేశాం. ఆ రోజుల్లో పామును చంపడమంటే అతి పెద్ద విషయం. అయితే పామును వేటగాడు చంపాడని, మేము చంపలేదని అందరికి చెప్పాం. అనంతర ఆ పామును హాకీ స్టిక్ కు తగిలించి పాఠశాల మైదానమంతా కలయతిరిగాం. ఈ విషయాన్ని తెలుసుకున్న మా ప్రిన్సిపాల్ మమ్మల్నందరిని గదిలో పిలిచాడు. మా ప్రిన్సిపాల్ బ్రిటీషస్థుడు. పాఠశాల ప్రాంగణమంతా బ్రిటీష్ వాతావరణం ఉంటుంది. అంతేకాకుండా ఆయన ఎంతో నిజాయితీగా ఉంటారు. క్రమశిక్షణగా విషయంలో కఠినంగా ఉంటారు. పామును చంపిన విషయాన్ని గ్రహించి.. మీరు తప్పు చేశారా అని గద్దించారు. దీంతో నేను తడుముకున్నా.. విషయాన్ని అర్థం చేసుకున్న ఆయన ఆరు కోతలు పెట్టండి అని గట్టిగా చెప్పి వెళ్లిపోయారు’ అని అన్నారు.
అంతేగాక.. ‘ఎవరు తప్పు చేసినా శిక్షించడానికి మా పాఠశాలలో ఓ గ్యారేజ్ అక్కడ ఉంది. అక్కడ విద్యార్థులను నూనెతో పూసిన కర్రలతో కొట్టేవారు. మమ్మల్ని కూడా వంగమని చెప్పి ఆ కర్రలతో వీపుపై కొట్టారు. ఇప్పుడు నవ్వుకుంటున్నప్పటికీ అప్పుడు మాత్రం చాలా బాధేసింది. ఇక్కడ హాస్యాస్పదమైన విషయంమేమంటే కొట్టడం పూర్తయిన తర్వాత ప్రిన్సిపాల్ మా అందిరిని థ్యాంక్యూ చెప్పమని కోరారు. ఈ సంఘటన తలచుకుంటే ఇప్పటికీ నవ్వొస్తుంది’ అని అమితాబ్ తన చిన్ననాటి సంఘటనను గుర్తుచేసుకున్నారు. కాగా, ఈ విషయం గురించి అమితాబ్ కెబిసి లో ప్రస్తావించినప్పటి నుంచి సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ గా మారింది.
ప్రముఖ హిందీ కవి హరివంశ్ రాయ్ బచ్చన్, తేజీ బచ్చన్ దంపతులకు జన్మించిన అమితాబ్ తన విద్యను నైనిటాల్ లోని షేర్వూడ్ కాలేజి, దిల్లీ వర్సిటీలో కిరోరి మాల్ కాలేజిలో పూర్తి చేశారు.
Published by:Srinivas Munigala
First published:December 28, 2020, 15:14 IST