మహిళలు ఏ రంగంలో ఉన్నా వారి అందం, ట్యాలెంట్, ఇతర సామర్థ్యాలపై కామెంట్స్ చేయడం.. కాదు కాదు గేలి చేయడం చూస్తూనే ఉన్నాం. దీనికి ఎవరూ అతీతులు కాదు. అయితే సమాజంలో ఎంతో ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తులు చేసినప్పుడే దాని రియాక్షన్ మరో విధంగా ఉంటుంది. బాలీవుడ్ బిగ్ బి ప్రస్తుతం ఆ ఆగ్రహాన్ని చవిచూస్తున్నారు. అమితాబ్ బచ్చన్ ఊహించని వివాదంలో చిక్కుకున్నారు. ఒక ఉన్నత స్థానంలో ఉన్న మహిళను గురించి ప్రస్తావిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యాలే దీనికి ఆజ్యం పోశాయి. ఈ వీడియో నెట్టింట వైరల్ కావడంతో.. నెటిజన్లు అమితాబ్ బచ్చన్ పై విమర్శలకు దిగుతున్నారు. అసలేం జరిగిందంటే..
దేశవ్యాప్తంగానే గాక ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన గేమ్ షో కౌన్ బనేగా కరోడ్ పతి. దీనికి అమితాబ్ బచ్చనే హోస్ట్ గా వ్యవహరిస్తున్నారన్న విషయం విదితమే. అయితే ఈ షోలో భాగంగా అమితాబ్ ఒక వివాదాస్పద కామెంట్ చేశారు. అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) చీఫ్ గా వ్యవహరిస్తున్న గీతా గోపీనాథ్ గురించి ఆయన కంటెస్టెంట్ ను ఒక ప్రశ్న అడిగారు. ఆమె ఏ సంస్థకు కంటెస్టెంట్ గా ఉన్నారన్నది ప్రశ్న. ఇక్కడి దాకా బాగానే ఉంది.
స్క్రీన్ మీద ఉన్న ఆమెను చూస్తూ.. ‘ఆమె ముఖం ఎంత అందంగా ఉంది... ఆర్థిక వ్యవస్థతో ఆమె అందాన్ని ఎవరైనా పోల్చి చూడగలరా..?’ అంటూ వ్యాఖ్యానించారు. ఇదే ఇప్పుడు ఆయనకు కొత్త తలనొప్పులు తీసుకొచ్చింది.
కాగా.. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అమితాబ్ వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు.
sorry to say but that was blatant sexism. https://t.co/px9ZWXHvIP
— stfu UncLe (@someotherkapoor) January 22, 2021
ఆయన వైఖరిని తీవ్రంగా తప్పుబడుతున్నారు. అందానికి, టాలెంట్ కు సంబంధం లేదని అమితాబ్ కు కౌంటర్ ఇస్తున్నారు. అత్యంత చిన్న వయసులో అంతటి ఘనతను సాధించిన గోపీనాథ్ సాధించిన గౌరవాన్ని గుర్తించకుండా.. ఇలాంటి కామెంట్స్ చేయడం విచారకరమని విమర్శలకు దిగుతున్నారు.
@GitaGopinath sorry to say..
But he was being sheer sexist there..
What has the beautiful face and economics to do against each other??
It sounds very.. Irking.. https://t.co/KB6xCcfmrx
— ഇയാഗോ (@iagolevel) January 22, 2021
ఇదిలాఉండగా.. ఇందుకు సంబంధించిన వీడియోను గీతా గోపీనాథ్ కూడా ట్విట్టర్ లో పంచుకున్నారు.
Ok, I don't think I will ever get over this. As a HUGE fan of Big B @SrBachchan, the Greatest of All Time, this is special! pic.twitter.com/bXAeijceHE
— Gita Gopinath (@GitaGopinath) January 22, 2021
తాను బిగ్ బీకి పెద్ద అభిమానినని.. తనకు ఈ వీడియో చాలా ప్రత్యేకమైనదంటూ ఆమె రాసుకొచ్చారు. తనపై అమితాబ్ చేసిన కామెంట్స్ పై మాత్రం ఆమె అసంతృప్తివ్యక్తం చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Amitabh bachchan, Imf, Trending, Twitter, Viral, VIRAL NEWS