Home /News /trending /

BOLLYWOOD BEAUTY MOUNI ROY SURAJ NAMBIAR GOT MARRIED IN GOA THEIR WEDDING PHOTOS GOES VIRAL IN SOCIAL MEDIA SNR

పెళ్లి కూతురుగా హాట్ బ్యూటీ మౌనీ రాయ్.. వైరల్ అవుతున్న వెడ్డింగ్ వీడియో, ఫోటోలు

Photo Credit: Instagram

Photo Credit: Instagram

Mouni Roy Wedding: బాలీవుడ్ హాట్ బ్యూటీ మౌనీ రాయ్ మ్యారేజ్‌ గ్రాండ్‌గా జరిగింది. మలయాళ సంప్రదాయంలో సూరజ్‌ నంబియార్‌ని మనువాడింది ముంబై స్టార్. వాళ్లిద్దరి పెళ్లి వీడియో, ఫోటోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి.

బాలీవుడ్‌ బ్యూటీ (Bollywood beauty) మౌనిరాయ్‌(Mouni Roy)ఆమె ప్రియుడు సూరజ్‌ నంబియార్‌(Suraj nambiar)ని పెళ్లి చేసుకుంది. వీరిద్దరి మ్యారేజ్ ఈవెంట్‌ ఎంతో ట్రెడిషినల్‌(Traditional)గా, ట్రెండీ(Trendy)జరిగింది. గోవా (Goa)లో మలయాళ సంప్రదాయ (Malayala tredition)పద్దతిలో అతి కొద్ది మంది స్నేహితులు, బంధువుల మధ్య గ్రాండ్‌గా జరిగింది. ఎప్పటి నుంచో ప్రేమించుకుంటున్న మౌనిరాయ్‌, సూరజ్‌ నూతన వధువరులుగా పెళ్లి దుస్తుల్లో దిగిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఇద్దరిని జంటగా చూసిన ఫ్యాన్స్ మేడ్‌ ఫర్ ఈచ్ అదర్ అంటూ విషెస్‌ చెబుతున్నారు. మౌనిరాయ్‌ పెళ్లి (Wedding)విశేషాల్ని ఆమె భర్త సూరజ్‌ నంబియార్, ఫ్రెండ్ అర్జున్‌ బిజ్లానీ, మందిరాబేడీ ప్రతి మూమెంట్‌ని ఫ్యాన్స్‌ కోసం సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు. హల్దీ ఫంక్షన్ నుంచి మెహందీ, సంగీత్, వెడ్డింగ్ ఇలా అన్ని ఫోటోలు, వీడియోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.

వెడ్డింగ్‌ డ్రెస్‌లో జోడి అదిరింది..
పెళ్లి వేడుకలో మౌనీరాయ్‌ ఎంతో సంప్రదాయ పద్దతిలో పెళ్లికూతురుగా అదిరిపోయింది. ఎరుపు రంగు అంచుతో ఉన్న తెల్లటి చీర కట్టుకుంటే..ఆమె భర్త సూరజ్ పెళ్లికొడుకుగా గోల్డెన్‌ కలర్ కుర్తా, వైట్‌ కలర్‌ ధోతీ వేసుకున్నాడు. ఇద్దరు కలిసి పెళ్లి మండపంలో దిగిన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు సూరజ్. ఎప్పటి నుంచో ప్రేమలో మునిగి తేలుతున్న ఈ ఇద్దరు సెలబ్రిటీలు మలయాళ సంప్రదాయ పద్దతిలో ఒక్కటయ్యారు.








View this post on Instagram






A post shared by Mouni Roy (@angelmouniroy_)






సోషల్ మీడియాలో పెళ్లి సందడి..
నిన్నటి వరకూ సోషల్ మీడియా పేజ్‌లో హాట్ హాట్‌గా కనిపించిన మౌనిరాయ్‌ ఒక్కసారిగా పెళ్లికూతురు గెటప్‌లో సిగ్గుమొగ్గలు వేస్తూ కనిపించింది. బంధు,మిత్రుల మధ్య సూరజ్‌ ఆమెకు మంగళసూత్రం కట్టడంతో అందరూ పూలవర్షం కురిపించారు.








View this post on Instagram






A post shared by Mouni Roy (@angelmouniroy_)






సెలబ్రిటీ కపుల్‌కి ప్రముఖుల విషెస్‌..
మౌనిరాయ్, సూరజ్‌ నంబియార్‌ వెడ్డింగ్ పార్టీకి ఫ్రెండ్స్ మందిరా బేడీ, అర్జున్‌ బిజ్లానీతో పాటు మరికొందరు సెలబ్రిటీలు అటెండ్ అయ్యారు. కపుల్‌గా మారిన మౌనిరాయ్, సూరజ్‌ నంబియార్‌ల ప్రతి వీడియోలను షేర్ చేసుకుంటున్నారు.








View this post on Instagram






A post shared by Mouni Roy (@angelmouniroy_)






పెళ్లికి ముందు జరిగిన సంగీత్‌లో కూడా మౌనిరాయ్‌ పసుపు రంగు డ్రెస్‌లో అదరిపోయే డ్యాన్స్‌ చేసింది. మౌని రాయ్.. 2004లోనే సినిమాల్లోకి వచ్చినా.. నాగిన్ సీరియ్‌తో బాగా పేరొచ్చింది. టీవీ షోలు, సీరియల్స్‌లో సందడి చేసిన మౌని రాయ్.. ఇప్పడు సినిమాల్లోనూ సత్తా చాటుతోంది.








View this post on Instagram






A post shared by Suraj Nambiar (@nambiar13)






కాగా, తుమ్ బిన్2, గోల్డ్‌‌ చిత్రాలతో పాటు కేజీఎఫ్‌లో ఐటెం సాంగ్‌లో నటించి అందరి దృష్టిని ఆకర్షించిన మౌని రాయ్.. ఇప్పుడు. బ్రహ్మాస్త్ర, మొగుల్ సినిమాల్లో నటిస్తోంది. పెళ్లి తర్వాత యాక్ట్ చేస్తుందో లేక ఫ్యామిలీ లైఫ్‌కి పరిమితం అవుతుందో చూడాలి.
Published by:Siva Nanduri
First published:

Tags: Mouni Roy, Wedding

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు