హోటల్‌లో షాంపూలు దొంగతనం చేసిన దీపిక పదుకోన్.. సంచలన విషయాలు వెల్లడించిన..

Deepika Padukone: బాలీవుడ్ అగ్ర నటి దీపిక పదుకోన్ అప్పుడప్పుడు హోటల్ గదిలోంచి తనకిష్టమైన షాంపూ బాటిళ్లను దొంగతనం చేసేందంట.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: August 2, 2019, 5:08 PM IST
హోటల్‌లో షాంపూలు దొంగతనం చేసిన దీపిక పదుకోన్.. సంచలన విషయాలు వెల్లడించిన..
దీపిక పదుకోన్
  • Share this:
ఏదైనా లాడ్జికి గానీ, హోటల్‌కు గానీ వెళ్తే.. అక్కడున్న టవల్స్, చిన్న చిన్న వస్తువులు, సబ్బులు తీసుకెళ్లిపోవాలని అనిపిస్తుంది. ‘మనం వాటికి డబ్బులు చెల్లించాం.. ఊరికే ఇక్కడ ఎందుకు వదిలేయాలి? పైగా మనకు ఇష్టమైనవేగా..’ అని మనలో మనం సర్దిచెప్పుకుంటూ వాటిని బ్యాగుల్లో సర్దేసుకుంటాం. అయితే, ఓ కుటుంబం కూడా బాలిలో ఇలాగే చేసింది. విహార యాత్రకు అక్కడికి వెళ్లిన ఆ కుటుంబం.. హోటల్ గదిలోని సామాన్లు, డెకోరేటివ్ వస్తువులను బ్యాగుల్లో వేసుకొని వెళ్లిపోయారు. ఇంతలో దాన్ని గమనించిన హోటల్ సిబ్బంది వెంటనే అప్రమత్తమై వారి సామాన్లను తనిఖీ చేయగా.. వస్తువులన్నీ బయటపడ్డాయి. ఇలాంటి ఘటనలు అంతగా బయటికి రాకపోయినా.. జరిగేవి కోకొల్లలు. చిలిపి పనులు కూడా. అది చిన్న వస్తువు అయినా తెలీకుండా, చెప్పకుండా తీసుకెళ్లి పోవడం సరదా అనుకుంటారు కొందరు.

అలాంటి వారికి మినహాయింపేమీ కాదు బాలీవుడ్ అగ్ర నటి దీపిక పదుకోన్. తాను కూడా అప్పుడప్పుడు హోటల్ గదిలోంచి తనకిష్టమైన షాంపూ బాటిళ్లను దొంగతనం చేసేందంట. ఈ విషయాన్ని దీపిక ప్రాణ స్నేహితురాలు స్నేహ రాంచందర్ తెలిపింది. స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఆమె దీపిక పదుకోన్ వెబ్‌సైట్‌లో ఈ విషయాన్ని వెల్లడించింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో జోరుగా చక్కర్లు కొడుతున్నాయి కూడా.

దీపిక పదుకోన్ వెబ్‌సైట్‌లో స్నేహ రాంచంద్రన్ రాసిన లేఖ (Photo: deepika padukone website)


ఇదిలా ఉండగా, ఓం శాంతి ఓం సినిమాతో బాలీవుడ్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. హౌస్‌ఫుల్, పీకూ, పద్మావత్, బాజీరావ్ మస్తానీ.. ఇలా చరిత్రలో నిలిచిపోయే సినిమాల్లో నటించింది. ఈ మధ్యే రణ్‌వీర్ సింగ్‌ను పెళ్లాడిన ఈ బ్యూటీ చేతిలో బోలెడన్నీ సినిమాలతో బిజీగా ఉంది.

First published: August 2, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...