HOME »NEWS »TRENDING »bollywood actress priyanka chopra jonas said she would like to run for prime minister of india bs

మోదీ ప్లేస్ కావాలంటున్న ప్రియాంక.. అతడికి అమెరికా అధ్యక్ష పదవి..

మోదీ ప్లేస్ కావాలంటున్న ప్రియాంక.. అతడికి అమెరికా అధ్యక్ష పదవి..
ప్రియాంక, నిక్ జోనస్ (ఫైల్)

తనకు భారత ప్రధాని కావాలని ఉందని బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా చెప్పింది. తన భర్త నిక్ జోనస్‌ అమెరికా అధ్యక్షుడు అయితే చూడాలని ఉందని కూడా వ్యాఖ్యానించింది.

  • Share this:
    ఇటు బాలీవుడ్.. అటు హాలీవుడ్ ప్రపంచాన్ని ఏలేస్తున్న ప్రియాంక చోప్రా తన మనసులోని అరుదైన కోరికను బయటపెట్టింది. తనకు భారత ప్రధాని కావాలని ఉందని చెప్పింది ఈ మాజీ మిస్ వరల్డ్. తనకంటే పదేళ్లు చిన్నవాడైన అమెరికా సింగర్ నిక్ జోనస్ ను పెళ్లి చేసుకొని హ్యాపీగా గడుపుతున్నానంటూ చెబుతూనే.. సామాజిక మార్పును తీసుకురావడానికి భారత ప్రభుత్వంలోని కీలక పదవి చేపట్టాలని ఉందంటూ కీలక వ్యాఖ్యలు చేసింది. రాజకీయాల్లో ప్రవేశించాలన్న కోరిక ఉందా? ఉంటే ఏ పదవి కోరుకుంటున్నారని అడగ్గా.. ఈ సమాధానం ఇచ్చిందీ అందాల ముద్దుగుమ్మ. అంతేకాదు, తన భర్త నిక్ జోనస్‌ అమెరికా అధ్యక్షుడు అయితే చూడాలని ఉందని కూడా వ్యాఖ్యానించింది. నిక్‌కు కూడా అదే కోరిక ఉందని చెప్పింది. రాజకీయాలపై ఆసక్తి లేకపోయినా సమాజంలో మార్పు తీసుకు రావడానికి మాత్రమే ఆ పదవిని చేపట్టాలని ఉందని ప్రియాంక చెప్పింది.

    ఇక, తన భర్త నిక్ జోనస్ గొప్ప ఫెమినిస్టు అని, తాను ఫెమినిస్టునని చెప్పుకోవడానికి అస్సలు సిగ్గుపడడని ప్రియాంక హోయలు పోయింది. ‘నేను ఓ ఫెమినిస్టును పెళ్లి చేసుకోన్నానని చెప్పడానికి గర్వంగా ఉంది’ అని అన్నది. అయితే ఆమె సరదాగా ఈ వ్యాఖ్యలు చేశారా..? లేక నిజంగానే రాజకీయాల్లోకి రావాలన్న ఆసక్తి ఉందా? అన్నది చర్చనీయాంశంగా మారింది.

    First published:June 04, 2019, 14:07 IST