Home /News /trending /

BOLLYWOOD ACTRESS POONAM PANDEY SAYS INDIAN CRICKET TEAM WILL WIN MANY WORLD CUPS FROM NOW ON SNR

మనవాళ్ల సత్తా ఎంటో మీకు పూర్తిగా తెలియదన్న పాపులర్ మోడల్..

Poonam Pandey

Poonam Pandey

Poonam Pandey: భారత్‌లో క్రికెట్‌కి విపరీతమైన క్రేజ్ ఉందని చెప్పింది మోడల్ పూనమ్‌పాండే. మనోళ్ల సత్తాను తక్కువ అంచనా వేయవద్దని గల్లీకో సచిన్ టెండూల్కర్ ఉన్నాడంది. 2023లో కాదు రాబోయే రోజుల్లో చాలా వరల్డ్‌ కప్‌లు గెలుచుకొస్తారని చెప్పింది ముంబై పాపులర్ మోడల్ పూనమ్‌పాండే.

ఇంకా చదవండి ...
యూట్యూబ్ స్టార్, మోడల్‌ (Model) పూనమ్‌పాండే (Poonam Pandey) మరోసారి ఇంట్రెస్టింగ్‌ కామెంట్ చేసింది. 2023లోనే కాదు రాబోయే రోజుల్లో ఇండియా క్రికెట్ జట్టు (India cricket team) చాలా వరల్డ్ కప్‌ (World cup)లు సాధిస్తుందనే నమ్మకం తనకి ఉందని చెప్పింది. ఇండియాలో క్రికెట్‌ ఆట అంటే ఎంతో క్రేజ్ ఉందన్న పూనమ్... గల్లీకో సచిన్‌ టెండూల్కర్‌ (Sachin Tendulkar)ఉన్నాడంది. అంతే కాదు రాజకీయాల గురించి తనకేమి తెలియదన్న ఈ బోల్డ్ బ్యూటీ రాహుల్‌గాంధీ (Rahul Gandhi)అంటే ఇష్టమని చెప్పింది. వరల్డ్ కప్‌ కొడితే బోల్డ్‌గా కనిపిస్తానని గతంలో ఇచ్చిన స్టేట్‌మెంట్‌పై కూడా క్లారిటీ ఇచ్చింది పూనమ్. క్రికెట్‌ అంటే తనకు ఎంతో ఇష్టమంది. సచిన్ టెండూల్కర్‌ విగ్రహాన్ని (Statue) ఏర్పాటు చేస్తానని మీడియాకి చెప్పింది. క్రికెటర్‌ కపిల్‌దేవ్ (Kapil dev) జీవిత కథతో తెరకెక్కించిన 83 సినిమాపై అభిప్రాయం చెప్పడానికి తాను ఆ మూవీని చూడలేదని చెప్పింది పూనమ్‌ పాండే. కొత్త ఏడాదిలో మీ పర్సనల్ లైఫ్ ఎలా ఉండబోతోందని అడిగితే ప్రస్తుతానికి బాగానే ఉందని..తాను సింగల్ అంటూ బదులిచ్చింది. తనను చూసి కాపీ కొట్టే వాళ్లు ఉండవచ్చేమో కానీ వాళ్లు తనతో సమానం కాదని పొగరుగా బదులిచ్చింది పూనమ్‌ పాండే. అంతే కాదు తన పేరు పూనమ్‌ పాండే కాదని..పూనమ్‌ శోభన పాండే అంటూ పూర్తి పేరును లీక్ చేసింది ముంబై హాట్ మోడల్.

మనోళ్ల టాలెంట్‌ మీకు తెలియదు..
పూనమ్‌ పాండే వేసుకునే దుస్తులు, ఫోటోలు, ఫోటోషూట్‌లకు ఇచ్చే ఫోజులు కుర్రాళ్లకే కాదు మగాళ్లకు మత్తెక్కించేలా ఉంటాయి. ఇలాంటి వాటిని చూస్తుంటే సెక్స్‌వాలిటీ మీరే ప్రేరేపిస్తున్నట్లుగా ఉంటుందంటే ..నేనొక్కదాన్ని కాకపోవచ్చు కాని నేను మాత్రం కాదని చెప్పను అంటూ తేల్చి చెప్పింది. ఇక జీవితంలో నష్టపోయిన అమ్మాయిలు ఎవరైనా తనలా ఉంటే తప్పేంటని పబ్లిక్‌గా బాంబ్‌ పేల్చేసింది పూనమ్‌ పాండే. ముంబైలో బిర్యానీ తినేందుకు వెళ్తున్న హాట్‌ లేడీని కదిలిస్తే బోలెడన్ని విషయాలు షేర్ చేసుకుంది. మీ బాయ్‌ఫ్రెండ్‌తో ఒకసారి కనిపించవచ్చుగా అంటే నవ్వుతూ ముఖం తిప్పేసింది పూనమ్‌ పాండే.

న్యూఇయర్‌లోనూ పూనమ్‌కి చేతి నిండా పనే ..
షార్ట్‌ ఫిల్మ్స్, వెబ్ సిరీస్‌, యూట్యూబ్‌ ఛానల్‌ షూటింగ్‌లో బిజీగా ఉన్నానని చెప్పింది పూనమ్‌పాండే. గతేడాదిలా కాకుండా 2022లో అంతా హ్యాపీగా అందరూ బిజీగా గడపుతారని ఆశిస్తున్నట్లు చెప్పింది. దెనిమ్ కాటన్ నిక్కర్, వైట్ కలర్ టాప్‌తో నడిరోడ్డుపై తన అందాల్ని ఆరబోసుకుంటూ వెళ్తున్న పూనమ్‌పాండేని మీడియా నిలదీయడంతో ఈ ఇంట్రెస్టింగ్‌ విషయాల్ని చెప్పింది. ఫైనల్‌గా బిర్యానీ తినేందుకు కూడా రమ్మంటూ ఆఫర్ చేసింది. ముంబైలోని అంధేరిలోని ఓ బిర్యానీ హోటల్‌ లోపలికి వెళ్తూ విచ్చలవిడిగా ఫోటోలకు ఫోజులిచ్చింది పూనమ్‌ పాండే.

పూనమ్ పాండే తగ్గేదెలే..
తనపై వచ్చే కాంట్రవర్సీలు, బోల్డ్ కామెంట్స్‌ని ఏమాత్రం లెక్కచేయని పూనమ్‌పాండే ఛాన్సు దొరికినప్పుడల్లా పబ్లిక్‌ ప్లేసుల్లో తన అందచందాల్ని ఆరబోస్తూనే ఉంటుంది. ఇక పర్సనల్‌ వీడియోలతో సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంది. లేటెస్ట్‌గా ఎయిర్‌పోర్ట్‌లో లోదుస్తులు లేకుండా వేసుకున్న బ్లాక్‌ డ్రెస్‌ ఫోటోలపై ఫోజులిచ్చిన పూనమ్‌ పాండే 2022లో కూడా డోసు పెంచేలా ఉంది తప్ప తగ్గేట్లు కనిపించడం లేదని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.
Published by:Siva Nanduri
First published:

Tags: Poonam Pandey, Team india, World cup

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు