Home /News /trending /

BOLLYWOOD ACTRESS JUHI CHAWLA INTERESTING COMMENTS ON CHILDREN PK GH

Juhi Chawla: పిల్లలంటే న్యూసెన్స్.. నాకు అస్సలు ఇష్టం లేదు.. జూహీ చావ్లా షాకింగ్ కామెంట్స్

జూహీ చావ్లా (Juhi Chawla)

జూహీ చావ్లా (Juhi Chawla)

Juhi Chawla: ఒకప్పటి బాలీవుడ్ నంబర్ 1 హీరోయిన్ జూహీ (Juhi Chawla) చావ్లా ఈమధ్య ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ఆమె ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చాయి. "నాకు పిల్లలంటే చాలా విసుగు (nuisance), చిరాకు, పిల్లలంటే నాకు అస్సలు ఇష్టం లేదు" అంటూ..

ఒకప్పటి బాలీవుడ్ నంబర్ 1 హీరోయిన్ జూహీ (Juhi Chawla) చావ్లా ఈమధ్య ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ఆమె ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చాయి. "నాకు పిల్లలంటే చాలా విసుగు (nuisance), చిరాకు, పిల్లలంటే నాకు అస్సలు ఇష్టం లేదు" అంటూ సంచలనం సృష్టంచారు.తన కెరీర్ లో ఎంతో మంది బాలనటులతో కలిసి పనిచేసినప్పటికీ పిల్లలంటే తనకు చిరాకంటున్నారు జూహీJuhi. 'హమ్ హై రాహీ ప్యార్ కే', 'వన్ టూ కా ఫోర్' వంటి సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టులతో కలిసి తెరపై తెగ సందడి చేసి, బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టిన జూహీ చెప్పే మాటలు అంత ఈజీగా మనం ఎవరం నమ్మలేం. ఎందుకంటే ఈ సినిమాల్లో జూహీ నటించలేదు, చిన్నారులతో కలిసి ఏకంగా జీవించేశారు. చిన్న పిల్లల మధ్య చిన్న పిల్లలా కలిసిపోయేలా జూహీ చావ్లాలో బాల్యం తొంగిచూస్తుంటే ఎవరైనా ఆమె మనసులో ఉన్న ఫీలింగ్ ఎలా పసిగట్టగలరు? తాను హీరోయిన్ గా వెలుగు వెలుగిన రోజుల్లో చాలామంది చిన్నారులకు ఫేవరెట్ స్టార్ యాక్ట్రెస్ గా జూహీ పాపులర్ అయ్యారు. అలాంటిది ఈ అందగత్తెకు పిల్లలంటే ఇష్టం లేకపోవడమేంటో అర్థం కావడం లేదని ఇంటర్వ్యూ interviewచూసిన వారు, చదివిన వారు తెగ ఫీల్ అవుతున్నారు.
Miss India, Juhi Chawla, nuisance, interview, pinkvilla, outdoor, shootings.  జూహీ చావ్లా, పింక్ విల్లా, ఔట్ డోర్, షూటింగ్స్, న్యూసెన్స్
జూహీ చావ్లా (Juhi Chawla)

తల్లయ్యాక మైండ్ సెట్ మారింది..
ఇదే విషయంపై మరింత స్పష్టత ఇచ్చిన జూహీ, తనకు పిల్లలు పుట్టాక మాత్రం తన మైండ్ సెట్ పూర్తిగా మారిపోయిందని సగర్వంగా చెబుతున్నారు. పింక్ విల్లా (Pinkvilla) కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో జూహీ చాలా నిజాయితీగా పలు విషయాలపై కుండబద్ధలు కొట్టినట్టు మాట్లాడారు. తల్లయ్యాక తన ఆలోచనా తీరు మారిందని చెప్పుకొచ్చారు. జాన్వీ, అర్జున్ అనే ఇద్దరు పిల్లలకు తల్లయ్యాక తన అభిప్రాయం పూర్తిగా మారిందని సంతోషంగా చెబుతున్నారు. పిల్లలు పుట్టాక తన షూటింగ్ షెడ్యూల్స్ పూర్తిగా మార్చుకున్నట్టు, ముంబైలోనే షూటింగ్ (shootings) ఉండేలా జాగ్రత్త పడుతున్నట్టు చెబుతున్నారు. ఇక ముంబై వెలుపల షూటింగ్ కోసం హాజరవ్వాల్సి వస్తే అత్తారింటి నుంచి ఎవరైనా తన పిల్లలకు తోడుగా ఉండేలా చూసుకుంటూ, 10 రోజులకు మించకుండా ఉండేలా తన ఔట్ డోర్ (outdoor) షూటింగ్స్ ప్లాన్ చేసుకుంటానని చెబుతున్నారు. తనను విడిచి పిల్లలు ఉండగలిగినప్పటికీ తానే వారిని విడిచి ఎక్కువ రోజులు దూరంగా ఉండలేకపోతున్నట్టు జూహీ చావ్లా చెబుతున్నారు.
Miss India, Juhi Chawla, nuisance, interview, pinkvilla, outdoor, shootings.  జూహీ చావ్లా, పింక్ విల్లా, ఔట్ డోర్, షూటింగ్స్, న్యూసెన్స్
జూహీ చావ్లా (Juhi Chawla)

నా పిల్లలు నా సినిమాలు చూడరు..
జూహీ చావ్లా లీడ్ రోల్ లో వచ్చిన ఎన్నో సూపర్ హిట్ సినిమాలున్నప్పటికీ తన సొంత పిల్లలు మాత్రం తన సినిమాలు చూసేందుకు ఇష్టపడరని జూహీ చెప్పడం విశేషం. "నా భర్త జై మెహతా హమ్ హై రాహీ ప్యార్ మే సినిమా చాలా బాగుంది, చూడండి అంటూ పిల్లలకు చెప్పారు కూడా. ఆ సినిమాలో రొమాన్స్ ఉందా మామ్? అని అర్జున్ నన్ను అడిగాడు. అప్పుడు నేను ఎస్, అది ఓ రొమాంటిక్ కామెడీ అని చెప్పా.. అప్పుడు వాడు నువ్వు రొమాన్స్ చేస్తున్నట్టు నటించే సినిమాలేవీ నేను చూడలేనని చెప్పాడు. అంతే వారు నా సినిమాలు చూడరు" అని జూహీ పింక్ విల్లాకు వివరించారు. ఇప్పటికీ జూహీ సినిమాలు మనలో ఎంతో మంది హ్యాపీగా చూస్తాం కదా, కానీ ఆమె పిల్లలు మాత్రం జూహీని తెరపై చూసేందుకు ఇష్టపడక పోవడం విశేషమే.
జూహీ చావ్లా (Juhi Chawla)

సెకెండ్ ఇన్నింగ్స్..
భర్త జై మెహతాతో ప్రస్తుతం హ్యాపీగా జీవితం కొనసాగిస్తున్న జూహీ, పిల్లలు పుట్టాక సినిమాల నుంచి కాస్త బ్రేక్ తీసుకుని తనకు ఎంతో ఇష్టమైన శాస్త్రీయ సంగీతం నేర్చుకుని, కచేరీ సైతం చేశారు. ఆతరువాత సెకెండ్ ఇన్నింగ్స్ కూడా మొదలు పెట్టారు. ఎప్పటికప్పుడు సినిమాలు, షోలు, ఫంక్షన్లు, యాడ్స్ అంటూ బిజీగా ఉండే జూహీ చావ్లా ఒకప్పుడు కోట్లాది మందికి వెండితెరపై ఆరాధ్య దైవం. అన్నట్టు జూహీ చావ్లా మిస్ ఇండియా (Miss India) కూడా.
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Bollywood, Hindi Cinema, Juhi Chawla

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు