ఐష్‌కు అవమానం.. ఎట్టకేలకు క్షమాపణ చెప్పిన వివేక్ ఒబెరాయ్

Bollywood News: ఐశ్వర్యరాయ్ అభిమానులు, ఫెమినిస్టులు, మహిళా కమిషన్, ఇతరుల ఆగ్రహానికి గురైన బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ ఎట్టకేలకు క్షమాపణ చెప్పాడు.

news18-telugu
Updated: May 21, 2019, 1:34 PM IST
ఐష్‌కు అవమానం.. ఎట్టకేలకు క్షమాపణ చెప్పిన వివేక్ ఒబెరాయ్
ఐశ్వర్య‌రాయ్, వివేక్ ఒబెరాయ్
  • Share this:
ఎగ్జిట్ పోల్స్‌పై ఓ వ్యక్తి క్రియేట్ చేసిన ఫోటోను ట్వీట్ చేసి ఐశ్వర్యరాయ్ అభిమానులు, ఫెమినిస్టులు, మహిళా కమిషన్, ఇతరుల ఆగ్రహానికి గురైన బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ ఎట్టకేలకు క్షమాపణ చెప్పాడు. తొలుత తాను ఓ వ్యక్తి చేసిన పోస్ట్‌ను మాత్రమే ట్వీట్ చేసి నవ్వానని, తానేతప్పూ చేయలేదని చెప్పిన ఈ నటుడు తర్వాత తగ్గాల్సి వచ్చింది. క్షమాపణ కోరడమే కాకుండా ఐశ్వర్యరాయ్‌ని ఉద్దేశించి చేసిన ట్వీట్‌ను డిలీట్ చేశాడు. ఈ సందర్భంగా ట్విట్టర్‌లో ‘కొన్నిసార్లు మనకు కనిపించేవి చూసిన వెంటనే సరదాగా, ఎలాంటి ఇబ్బంది లేనట్టుగా కనిపిస్తాయి. ఇతరులకు అలా కనిపించకపోవచ్చు. గత పదేళ్లలో నేను దాదాపు రెండు వేల మందికి పైగా పేద ఆడపిల్లలను చూసుకునే బాధ్యత తీసుకున్నాను. ఒక్క స్త్రీని కూడా అగౌరవ పరిచేలా ప్రవర్తించడాన్ని నేను ఊహించలేను. ఎవరో క్రియేట్‌ చేసిన మీమ్‌కు నేను సరదాగా రిప్లై ఇవ్వడం వల్ల ఓ మహిళ బాధపడుంటే దానికి నివారణ చర్యలు చేపట్టాల్సిందే. క్షమించండి.. ట్వీట్ డిలీట్ చేశాను’ అని వివేక్ ట్వీట్‌లో పేర్కొన్నారు.

కాగా, ఐశ్వర్య, సల్మాన్‌లను ఉద్దేశిస్తూ ఒపీనియన్ పోల్ అని, ఐశ్వర్య-వివేక్‌లను ఉద్దేశిస్తూ ఎగ్జిట్ పోల్ అని, ఐశ్వర్య-అభిషేక్ వారి కూతురు ఆరాధ్యలను ఉద్దేశిస్తూ రిజల్ట్ అని రాసి ఉన్న ఫోటోను ఎవరో పోస్ట్ చేయగా దాన్ని వివేక్ ట్వీట్ చేశాడు. ఐశ్వర్యని అవమానించే విధంగా ఉన్న ఈ పోస్ట్‌ను పోస్ట్ చేయడమే కాకుండా ‘క్రియేటివ్! నో రాజకీయాలు.. కేవలం జీవితమే’ అని కామెంట్ పెట్టాడు కూడా. దీంతో వివాదం రాజుకున్న విషయం తెలిసిందే.






ఇవి కూడా చదవండి:

ఐశ్వర్యరాయ్‌పై అవమానకర ట్వీట్.. అది తప్పేం కాదంటున్న బాలీవుడ్ హీరో

ఐశ్వర్యరాయ్‌ని అవమానించిన వివేక్ ఒబెరాయ్.. నోటీసులు జారీ చేసిన..
Published by: Shravan Kumar Bommakanti
First published: May 21, 2019, 1:34 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading