Praveen Kumar VadlaPraveen Kumar Vadla
|
news18-telugu
Updated: July 24, 2020, 3:33 PM IST
సోనూ సూద్ (Twitter/Sonu Sood)
బాలీవుడ్ నటుడు సోనూ సూద్ పేరు ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తుంది. మరీ ముఖ్యంగా ఆయన మొన్న కోవిడ్ 19 అప్పుడు చాలా మంది వలస కూలీలను సొంత రాష్ట్రాలకు పంపించి అందరికీ హీరో అయ్యాడు. సినిమా విలన్ కాస్తా ఇప్పుడు హీరో అయిపోయాడు. కొందరు అయితే ఏకంగా తమకు పుట్టిన బిడ్డలకు కూడా సోనూ సూద్ పేరు పెట్టుకున్నారు. మరికొందరు తమకు జీవనాధారం అయిన షాప్‌లకు కూడా సోనూ పేరు పెట్టుకున్నారు. ఇప్పుడు మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాడు ఈయన.
ఈ మధ్యే సోషల్ మీడియాలో ఓ మసలామె వీడియో వైరల్ అయింది. రెండు కర్రలు పట్టుకుని పొట్టకూటి కోసం కర్ర సాము చేస్తుంది. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. కూటి కోసం కోటి విద్యలన్నట్లు చాలా మంది కామెంట్ కూడా చేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈమె వీడియోను చూసిన సోనూ సూద్ ఆమె వివరాలు నాకు కావాలి అంటూ ట్వీట్ చేసాడు. దయచేసి ఈమె ఎవరో నాకు చెప్పండి.. నా దగ్గరికి తీసుకొస్తే కచ్చితంగా ఆడవాళ్ల రక్షణ కోసం ఆమెతో శిక్షణ ఇప్పిస్తాను అంటూ ట్వీట్ చేసాడు. ఈయన చేసిన ట్వీట్ కూడా వైరల్ అవుతుంది.
Published by:
Praveen Kumar Vadla
First published:
July 24, 2020, 3:33 PM IST