• HOME
  • »
  • NEWS
  • »
  • TRENDING
  • »
  • BODY OF 8 YEARS OLD BOY CUTS OUT OF CROCODILE AS IT SWALLOWS IN INDONESIA SK

బాలుడిని మింగిన మొసలి.. పొట్ట కోసి బయటకు తీశారు.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో..

బాలుడిని మింగిన మొసలి.. పొట్ట కోసి బయటకు తీశారు.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో..

మొసలి పొట్టను చీల్చుతున్న అధికారులు (Image:Twitter)

మరుసటి రోజు ఎట్టకేలకు మొసలి చిక్కింది. 26 ఫీట్ల పొడవున్న ఆ భారీ మొసలిని అధికారులు చంపేశారు. అనంతరం కత్తులతో దాన్ని పొట్టను చీల్చి బాలుడిని బయటకు తీశారు.

  • Share this:
    ఒళ్లు గగుర్పొడిచే ఘటన ఇది. వింటుంటేనే వణుకు పుట్టించే వార్త ఇది. ఏడేళ్ల బాలుడిని ఓ భారీ మొసలి అమాంతం మింగేసింది. ఆ తర్వాత మొసలిని రెస్క్యూ సిబ్బంది పట్టుకొని చంపేశారు. మొసలి పొట్టను కత్తులతో కోసి బాలుడిని బయటకు తీశారు. ఇండోనేసియాలో ఈ ఘటన జరిగింది. మరి ఆ బాలుడు బతికాడా? చనిపోయాడా? వివరాల్లోకి వెళ్తే.. ఇండోనేసియాలోని ఈస్ట్ కలిమాంటన్‌కు చెందిన దిమాస్ ముల్కన్ సపుత్ర అనే 8 ఏళ్ల బాలుడు.. తన తండ్రితో కలిసి ఓ నదిలో చేపలు పట్టేందుకు వెళ్లాడు. ఇద్దరు కలిసి నదిలో చేపలు పట్టారు. కాసేపటి తర్వాత తండ్రి ఒడ్డుకు వచ్చి సేద తీరుతున్నాడు. బాలుడు మాత్రం లోపలే ఉండి ఈత కొడుతున్నాడు.

    అంతలో ఓ భారీ మొసలి దూసుకొచ్చింది. ఎక్కడి నుంచి వచ్చిందో ఏమో గానీ.. అమాంతం బాలుడిని మింగేసింది. ఆ దృశ్యాన్ని చూసిన బాలుడి తండ్రి.. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా నదిలో దూకేశాడు. కుమారుడిని కాపాడుకునేందుకు ఆ మొసలితో పోరాడాడు. ధైర్యంతో ఒంట్లో ఉన్న శక్తిని మొత్తం కూడదీసుకొని.. మొసలి తలపై పిడిగుద్దులు కురిపించాడు. కానీ అది నీటి లోతుకు వెళ్లిపోయింది. కాసేపటి తర్వాత కనిపించలేదు. తండ్రి ఏడుస్తూనే నది మొత్తం గాలించాడు. కానీ మొసలి చిక్కలేదు. కాసేపటి తర్వాత గ్రామానికి వెళ్లి స్థానికులకు విషయం చెప్పాడు. గ్రామస్తులంతా నదిలోకి దిగి గాలించారు. సమాచారం అందుకున్న.. పోలీసులు, రెస్క్యూ బృందాలు కూడా ఘటనా స్థలానికి చేరుకొని నది మొత్తం వెతికారు.

    మరుసటి రోజు ఎట్టకేలకు మొసలి చిక్కింది. 26 ఫీట్ల పొడవున్న ఆ భారీ మొసలిని అధికారులు చంపేశారు. అనంతరం కత్తులతో దాన్ని పొట్టను చీల్చి బాలుడిని బయటకు తీశారు. అప్పటికే 24 గంటలు గడవడంతో మొసలి కడుపులోనే బాలుడు కన్నుమూశాడు. మొసలి పొట్టను చీల్చి బాలుడిని బయటకు తీస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

    బాలుడి మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులతో పాటు స్థానికులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఆ నదిలో పెద్ద పెద్ద మొసళ్లు ఎక్కువగా ఉన్నాయని.. చుట్టు పక్కల ప్రజలు అందులోకి వెళ్లకూడదని అధికారులు హెచ్చరించారు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    అగ్ర కథనాలు