అది బిజీ రోడ్డు..! ఉదయం నుంచి రాత్రి వరకు వేల సంఖ్యలో వాహనాల రాకపోకలు జరుగుతుంటాయి. అలాంటి రోడ్డుపక్కన ఓ శవం కనిపించడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. తెల్లటి వస్త్రంతో కప్పిన మృతదేహం ఉండడంతో తీవ్ర భయభ్రాంతులకు లోనయ్యారు. అసలే ఇది కరోనా టైమ్..! ఏదైనా కోవిడ్ ఆస్పత్రిలో రోగి చనిపోతే రాత్రి వేళ తీసుకొచ్చి ఇక్క పడేశారా? అనే అనుమానాలు మొదలయ్యాయి. అలా రోడ్డుపై వెళ్తున్న వారంతా తమ వాహనాలు ఆపి మరీ శవాన్ని చూశారు. కానీ దగ్గరకు వెళ్లేందుకు మాత్రం భయపడ్డారు. ప్రజలు భారీగా గుమిగూడడంతో పోలీసులకు సమాచారం వెళ్లింది. పోలీసులు స్పాట్‌కు చేరుకొని శవం దగ్గరకు వెళ్లారు. పైన కప్పి ఉన్న తెల్లటి వస్త్రాన్ని తొలగించడంతో అసలు ట్విస్ట్ బయటపడింది.
అసలు అక్కడ శవం లేదు. ఓ వ్యక్తి నిద్రపోయాడు. పైన తెల్లటి వస్త్రం కప్పుకొని పడుకోవడంతో అందరూ శవమని అనుమానించారు. పోలీసులు తెల్లటి వస్త్రాన్ని తొలగించగానే.. ఆ వ్యక్తి తల గోకుతూ నిద్రలేచాడు. 'ఏమైంది సార్.. నిద్రపోతుంటే లేపారు.' అని అడగడంతో స్థానికులతో పాటు పోలీసులు షాక్ అయ్యారు. ఏంటి.. అది శవం కాదా..? వ్యక్తి నిద్రపోతున్నాడా..? అని ఆశ్చర్యపోయారు. హమ్మయ్య.... మొత్తానికైతే శవం కాదు కదా అని అక్కడి నుంచి వెళ్లిపోయారు. యూపీలోని ఘజియాబాద్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ వీడియోపై నెటిజన్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చూస్తూ ట్వీట్స్ చేస్తున్నారు. 2020లో బెస్ట్ ప్రాంక్ అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. మనదేశంలో ఉన్న అన్ని పరిస్థితులకు ఈ వీడియో అద్దం పడుతోందని మరొకరు అభిప్రాయపడ్డారు.
Published by:Shiva Kumar Addula
First published:September 10, 2020, 06:50 IST