అదిరిపోయే హెయిర్‍‌కట్‌తో ఏనుగు... ఎవరి స్టైలో తెలుసా?

ఆ ఏనుగు అలా రోడ్డుపై వెళ్తుంటే... అందరి కళ్లూ దానిపైనే ఉంటాయి. ముఖ్యంగా దాని హెయిర్ స్టైల్ చూసి... కాసేపు చర్చించుకుంటారు.

news18-telugu
Updated: July 6, 2020, 2:29 PM IST
అదిరిపోయే హెయిర్‍‌కట్‌తో ఏనుగు... ఎవరి స్టైలో తెలుసా?
అదిరిపోయే హెయిర్‍‌కట్‌తో ఏనుగు... ఎవరి స్టైలో తెలుసా? (credit - twitter)
  • Share this:
ఏనుగును ఎప్పుడు చూసినా మనకు ఒకింత ఆనందం కలుగుతుంది. ఆ భారీ ఆకారం, ఆ పొడవైన తొండం, పెద్ద పెద్ దంతాలు... ఇవన్నీ చూస్తూ... అలా స్టన్ అయిపోతారు ప్రజలు. పిల్లలైతే కేరింతలు కొడతారు. ఐతే... మిగతా ఏనుగులకు లేని ఓ ప్రత్యేకత ఆ గజానికి ఉంది. అదే... బాబ్ కట్ హెయిర్ స్టైల్. తమిళనాడులో ఉండే ఈ ఏనుగు పేరు బాబ్ కట్ సెంగమలం. చాలా మంది లాగే... IFS అధికారి సుధా రామెన్... ఈ ఏనుగు రెండు ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ సమయంలో... దాని జుట్టును దువ్వుతూ కనిపించాడు మావటి. మరో ఫొటోలో ఇది నడుస్తూ కనిపించింది.


ఈ ట్వీట్ ఇప్పటికే 16వేలకు పైగా లైక్స్ పొందింది. చాలా మంది ఆ ఏనుగుతో తమ ఎక్స్‌పీరియన్స్‌ను షేర్ చేస్తున్నారు. దానికి సంబంధించిన ఫొటోలను చూపిస్తున్నారు.








దక్షిణాది రాష్ట్రాల్లో ఏనుగులకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. వాటిని కూడా ఉద్యోగుల లాగా పెంచుతూ... వాటితో ప్రత్యేక ఆలయాల పనులు చేయిస్తూ ఉంటారు. అలా ఏనుగులు భక్తుల సేవలో తరిస్తూ... భక్తులు ఇచ్చే తినుబండారాలు తింటూ... జీవిస్తుంటాయి.
Published by: Krishna Kumar N
First published: July 6, 2020, 2:29 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading