Blue Whale heart size : బ్లూ వేల్(Blue whale) ప్రపంచంలోనే అతిపెద్ద జంతువు అని మీరు వినే ఉంటారు. ట్విట్టర్‌లో బ్లూ వేల్ గుండె యెక్క వైరల్ అవుతోంది. గుండె సైజును బట్టి ఆ జీవి ఎంత పెద్దదిగా ఉంటుందో అర్థమవుతుంది. ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష్ గోయెంకా తరచుగా సోషల్ మీడియాలో అద్భుతమైన ఫోటోలు మరియు వీడియోలను షేర్ చేస్తుంటారు. తాజాగా అతను బ్లూ వేల్ యొక్క సంరక్షించబడిన గుండె కనిపించే ఫోటోను పోస్ట్ చేశాడు. హర్ష్ గోయెంకా షేర్ చేసిన ఫొటోలో తిమింగలం హృదయాన్ని చూసి మీరు ఆశ్చర్యపోతారు. ఇది నీలి తిమింగలం యొక్క సంరక్షించబడిన గుండె. దీని బరువు 181 కిలోలు కాగా 4.9 అడుగుల పొడవు, 3.9 అడుగుల వెడల్పు.
దీని గుండె చప్పుడు 3.2 కిలోమీటర్ల దూరం నుండి వినబడుతుంది అని హర్ష్ గోయెంకా తెలిపారు. జాతీయ వన్యప్రాణి సమాఖ్య నివేదిక ప్రకారం.. నీలి తిమింగలాలు 110 అడుగుల పొడవు, అలాగే 150 టన్నుల బరువు ఉంటాయి.
This is the preserved heart of a blue whale which weighs 181 kg. It measures 1.2 meters wide and 1.5 meters tall and its heartbeat can be heard from more than 3.2 km away. ???? ???? pic.twitter.com/hutbnfXlnq
— Harsh Goenka (@hvgoenka) March 13, 2023
Obesity link to cancer : ఊబకాయం ప్రమాదకర స్థాయి దాటిందా? 13 రకాల కేన్సర్‌లు వస్తాయంట!
ఈ ఫోటోకు వేల లైక్‌లు వచ్చాయి మరియు చాలా మంది దీనిని రీట్వీట్ చేసారు. చాలా మంది కామెంట్స్ ద్వారా తమ అభిప్రాయాన్ని తెలియజేశారు. మనిషి ముందు శూన్యం అని ఒకరు అన్నారు. చేపకు చాలా పెద్ద హృదయం ఉందని ఒకరు చెప్పారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Blue Whale Movie, Heart, Viral photo