Home /News /trending /

BLUE SKY TURNS INTO GREEN OVER SOUTH DAKOTO IN USA DUE TO STORM AND NETIZENS REACTS DIFFERENTLY WATCH VIRAL PICS VIDEO SRD

Strange Things : ఇదేం వింత రా మామ.. ఆకుపచ్చగా మారిన ఆకాశం.. వైరలవుతున్న ఫోటోలు, వీడియో..

Photo Credit : Twitter

Photo Credit : Twitter

Strange Things : నీలాకాశం ఉన్నట్టుండి ఒక్కసారిగా ఆకుపచ్చ రంగులోకి మారింది. ఇలా ఎందుకు జరుగుతోందో అర్థం కాక ప్రజలు అవాక్కవుతున్నారు. ఈ దృశ్యాలను కెమెరాలో బంధించి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

    ప్రస్తుత సోషల్ మీడియా(Social Media) యుగంలో ప్రపంచమే ఒక కుగ్రామంలా మారింది. ఏ మూలన ఏం జరిగినా ఇట్టే తెలిసిపోయే పరిస్థితి ఉంది. ఇక సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక వార్త, వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. వాటిలో చాలా వరకు ఫన్నీ వీడియోలు ఉంటాయి. ఇక ప్రాంక్‌లు, జంతువులకు సంబంధించిన ఫన్నీ వీడియో, భయానకమైవి, ఆశ్చర్యాన్ని కలిగించేవి, విజ్ఞానాన్ని పెంపొందించేవి కూడా ఉంటాయి. తాజాగా సోషల్ మీడియాలో ఓ ఆశ్చర్యకరమైన ఘటన ఇప్పుడు వైరలవుతోంది. కొన్ని ఆశ్చర్యకర ఘటనలను తేలిగ్గా కొట్టిపారేసినా.. చూడటానికి మాత్రం చాలా ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి. ఇలాంటి సిత్రాలు కూడా జరుగుతుంటాయా.. అన్నంత విస్మయానికి గురవుతూ ఉంటాం. కొన్ని వీడియోలు గ్రాఫిక్స్‌తో కూడుకున్నవి కాగా.. కొన్ని మాత్రం మన కల్లు కూడా నమ్మలేని విధంగా ఉంటాయి.

    అలాంటి.. ఫోటోలు, వీడియోలు ఇప్పుడు వైరల్ గా మారాయ్. సాధారణంగా మనకి ఆకాశం నీలం రంగులో కనిపిస్తుంది. సూర్యాస్తమయ సమయాల్లో పడమటి వైపున కాస్తంత ఎర్రగానూ ఉంటుంది. ఇది అందరికీ తెలిసిందే. అయితే.. అమెరికాలోని(USA) దక్షిణ డకోటా రాష్ట్రంలో(South Dacota) ఆగ్నేయం దిశగా కొన్ని ప్రాంతాల్లో ఆకాశం(Sky) ఆకుపచ్చ(Green) రంగులో కనిపించడం ఇప్పుడు స్థానికంగా పెద్ద చర్చనీయాంశమవుతోంది.



    ఇలా ఎందుకు జరుగుతోందో అర్థం కాక ప్రజలు అవాక్కవుతున్నారు. ఈ దృశ్యాలను కెమెరాలో బంధించి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ' అచ్చు సినిమాల్లో చూపించినట్టు ఉంది.. రాబోయే ప్రమాదాలకు ఇవి సంకేతాలా' అంటూ కొందరు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఎలియన్స్ వచ్చేటప్పుడు సినిమాల్లో ఇలానే జరుగుతుంది అని మరికొందరు క్రేజీ కామెంట్లు పెడుతున్నారు. అయితే.. ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని శాస్త్రవేత్తలు తేల్చేశారు.




    అయితే ఆకాశం ఆకుపచ్చగా మారడానికి వాతావరణంలో అనూహ్య మార్పులే కారణమని తెలుస్తోంది. దక్షిణ డకోటా, మిన్నెసొటా, అయోవ నగరార్లో మంగళవారం ప్రచండ గాలులతో తుపాను బీభత్సం సృష్టించింది. ఆ సమయంలోనే ఈ ప్రాంతాల్లో 'డెరోకో' ఏర్పడిందని వాతావరణ శాఖ ధ్రువీకరించింది. అందుకే ఆకాశం రంగు మారినట్లు పేర్కొంది.


    మేఘాల్లో ఎక్కువ మోతాదులో ఉండే నీటి బిందువులు.. నీలిరంగు తరంగధైర్ఘ్యాన్ని పరిక్షేపణం చేస్తాయన్న విషయం తెలిసిందే. ఆ కిరణాలు.. డెరెకో ధూళి తుఫాను, పగటి సమయంలో ప్రసారమయ్యే ఎరుపు, పసుపు రంగు కాంతితో కలిసిపోవడంతో ఆకాశం ఇలా ఆకుపచ్చగా మారినట్టు శాస్త్రవేత్తలు తెలిపారు.ఇదిలా ఉంటే.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న దృశ్యాలు మాత్రం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: Trending video, USA, Viral photo, Viral Video

    తదుపరి వార్తలు