Viral: అందంగా ఉందని చేతులేస్తే.. అంతు చూస్తుంది..!

పామును చూస్తే ఎవరైనా ఏం చేస్తారు? ఇదేం ప్రశ్న.. అక్కడ నుంచి పారిపోతాం లేదా దాన్ని చంపేంత వరకు నిద్రపోం అని అనుకుంటున్నారా. అయితే ఈ పామును చూస్తే ఎవరైనా చూపు తిప్పుకోకుండా ఉండలేరు.

news18-telugu
Updated: September 19, 2020, 1:35 PM IST
Viral: అందంగా ఉందని చేతులేస్తే.. అంతు చూస్తుంది..!
ఫొటో క్రెడిట్- Twitter/Life on Earth
  • Share this:
పామును చూస్తే ఎవరైనా ఏం చేస్తారు? ఇదేం ప్రశ్న.. అక్కడ నుంచి పారిపోతాం లేదా దాన్ని చంపేంత వరకు నిద్రపోం అని అనుకుంటున్నారా. అయితే ఈ పామును చూస్తే ఎవరైనా చూపు తిప్పుకోకుండా ఉండలేరు. ఎందుకంటే అంత అందంగా ఉంటుంది. చూసేందుకు ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా ఒక్కసారైనా పట్టుకోవాలి అనేలా విస్తుగొలుపుతుంది. నీలం రంగులో ఉండి చూపరులను ఆకర్షిస్తుంది. చూడటానికి అందంగా కనిపించే ఈ పాము ప్రపంచంలోనే అత్యంత అరుదైంది. అదే బ్లూ పిట్ వైపర్. ప్రస్తుతం ఈ బ్లూస్నేక్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అంతేకాకుండా దీని అందాన్ని చూసి చాలా మంది నెటిజన్లు ముగ్ధులైపోతున్నారు. ఈ సర్పరాజు అందం గురించి విభిన్నమైన కామెంట్లు పెడుతున్నారు. ఎరుపు రంగు గులాబీని చుట్టుకొని ఉన్న ఈ నీలం రంగు పాము.. బ్లూ-రెడ్ కాంబినేషన్ తో అబ్బురపరుస్తుంది.

ముద్దుగా ఉన్నా.. ముప్పు ఎక్కువే..

అందంగా ఉంది కదా అని హాని కలిగించదు కదా అనుకుంటే మీరు పొరబడినట్లే. ఎందుకంటే ఈ పాము అత్యంత విషపూరితమైంది. ఒక్కసారి కాటువేసిందంటే దీని విషప్రభావంతో శరీరంలో లోపల, వెలుపల తీవ్ర రక్తస్రావమై మనిషి ప్రాణానికి ముప్పు ఏర్పడుతుంది. మాస్కో జూ ప్రతినిధుల ప్రకారం.. ఈ పాములు వైట్ లిపిడ్ రకానికి చెందినవి. ఐలాండ్ పిట్ వైపర్ ఇండోనేషియా, తూర్పుతైమూర్లలో దీన్ని కనుగోన్నారు. ఇవి విషపూరిత పిట్ వైపర్ ఉపజాతులు. వాస్తవానికి ఈ పిట్ వైపర్లు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. కానీ నీలం రంగులో ఉండటం చాలా అరుదు.

ఆసక్తికరమైన విషయమేమంటే రెండు నీలం రంగు పిట్ వైపర్లు కలిసి ఆకుపచ్చ రంగు పిల్లలు పెడతాయి. వైట్ లిపిడ్ వైపర్లు వివిపరియస్. అంటే దీనర్థం "తమను తాము రక్షించుకోవడానికి సిద్ధంగా ఉన్న యువకులను జన్మనిస్తారు" అని జనరల్ స్వేత్లానా అకులోవా అని అన్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట సందడి చేస్తోంది. ఔత్సాహికులు విభిన్నమైన కామెంట్లు పెడుతున్నారు.


"ఇది అత్యంత అందమైన బ్లూ పిట్ వైపర్" అని లైఫ్ యాన్ ఎర్త్ తన ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ పెట్టిన దగ్గర నుంచి ఆ వీడియో కాస్త వైరల్‌గా మారింది. ఒక్క రోజులోనే 52 వేల వ్యూస్ వచ్చాయి.. రెడిట్ ప్లాట్ ఫామ్ లో దీన్ని 22 లక్షల సార్లు వీక్షించారు. సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియో చూసి ఎంతో అందంగా ఉందని తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు. ఇంటర్‌నెట్ లభిస్తున్న సమాచారం.. ప్రకారం బ్లూ పిట్ వైపర్లు ఎంతో ప్రమాదాకరమైనవి, అంతేకాకుండా ఎంతో దూకుడుగా ప్రవర్తిస్తాయని తెలుస్తోంది.
Published by: Sumanth Kanukula
First published: September 19, 2020, 12:30 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading