హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Allu Arjun దోశ మాడిపోయింది! -Rapido యాడ్‌ను నిషేధించిన హైకోర్టు -TSRTC పరువు తీస్తారా?

Allu Arjun దోశ మాడిపోయింది! -Rapido యాడ్‌ను నిషేధించిన హైకోర్టు -TSRTC పరువు తీస్తారా?

ర్యాపిడో యాడ్ పై హైకోర్టు ఆదేశాలు

ర్యాపిడో యాడ్ పై హైకోర్టు ఆదేశాలు

ర్యాపిడో ప్రకటన వివాదంపై తాజాగా ఆదేశాలిచ్చిన తెలంగాణ హైకోర్టు.. దానిని వెంటనే తొలగించాలని, యూట్యూబ్ లోనూ కనిపించడానికి వీల్లేదని కరాకండిగా చెప్పింది. యాడ్ పై నిషేధం తక్షణమే అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ర్యాపిడో కోసం అల్లు అర్జున్ వేసిన దోశ మాడిపోయిందంటూ కామెంట్లు వస్తున్నాయి..

ఇంకా చదవండి ...

బైక్ టాక్సీ అగ్రిగేటర్, లాజిస్టిక్ సర్వీసుల సంస్థ ర్యాపిడోకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవల సిటీల్లో బాగా విస్తరిస్తూ, లాభాల బాటలో ఉన్న ర్యాపిడో.. అదనపు ప్రచారం కోసం ఏకంగా అల్లు అర్జున్ తో చేసిన యాడ్ వివాదాస్పదమైంది. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణాన్ని కించపర్చేలా రూపొందిన సదరు ప్రకటనను హైకోర్టు దాదాపు నిషేధించింది. ఆర్టీసీని కించపర్చే అలాంటి ప్రకటనలు ప్రచారంలో ఉండటానికి వీల్లేదంటూ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ర్యాపిడో తన తాజా యాడ్ ను తక్షణమే వెనక్కి తీసుకోవాలని, యూట్యూమ్ మాద్యమం నుంచి కూడా దాన్ని తొలగించాలని కోర్టు ఆదేశించింది. ఒకవేళ ఈ ఆదేశాలను మీరితే ప్రాసిక్యూషన్ ఎదుర్కోవాల్సి ఉంటుందనీ కోర్టు హెచ్చరించింది. దీంతో కొద్ది రోజులుగా కొనసాగుతోన్న వివాదానికి ఆల్మోస్ట్ ఎండ్ కార్డ్ పడినట్లయింది. వివరాలివి..

పాపులర్ బైక్ ట్యాక్సీ యాప్ ర్యాపిడో.. తన సర్వీసుల్లోని గొప్పతనాన్ని వివరిస్తూ ఇటీవల ఒక ప్రకటన రూపొందించింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రధానంగా కనిపించిన ఆ ప్రకటనలో ఆర్టీసీ బస్సులో ప్రయాణాన్ని, ర్యాపిడో యాప్ ద్వారా బైక్ మీద ప్రయాణాన్ని పోల్చారు. ‘ఆర్టీసీ బస్సులు సాధారణ దోసెల మాదిరిగానే ఎక్కువ సమయం తీసుకుంటాయి.. అదే ర్యాపిడో అయితే చాలా వేగంగా, సురక్షితంగా ఉంటుంది.. అదే సమయంలో మసాలా దోసెను సిద్ధం చేస్తుంది..’అని అల్లు అర్జున్ ర్యాపిడోను ప్రమోట్ చేస్తారా యాడ్ లో. దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్.. అల్లు అర్జున్ కు, ర్యాపిడో సంస్థకు లీగల్ నోటీసులు పంపారు..

Shadnagar : చెత్త ఏరుకునే వ్యక్తితో వివాహిత అక్రమ సంబంధం.. భర్త బయటికెళ్లగానే ప్రతిరోజూ.. చివరికి ఏమైందంటే..



నిజానికి ర్యాపిడో యాడ్ లో చూపించిన బస్సు ఏపీఎస్ఆర్టీసీకి చెందినదే అయినా, ఆర్టీసీలంటే ప్రభుత్వరంగ సంస్థలే కాబట్టి టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సదరు యాడ్ లో ఆర్టీసీ బస్సుల్ని కించపరిచారంటూ నోటీసులు పంపారు. దీనిపై సోషల్ మీడియాలోనూ పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. దాంతో ర్యాపిడో సంస్థ తన ప్రకటనను ఎడిట్ చేసింది. ఆర్టీసీ బస్సు స్పష్టంగా కనపడకుండా ఎడిట్ చేసిన వెర్షన్ లో అల్లు అర్జున్ డైలాగులు మాత్రం మారలేదు. చివరికీ వ్యవహారం కోర్టు వద్దకు చేరింది.

Ghulam Nabi Azad : కాంగ్రెస్‌కు అతి భారీ షాక్! -గులాం నబీ ఆజాద్ సొంత పార్టీ? -హైకమాండ్ పై తీవ్ర విమర్శలు



ర్యాపిడో ప్రకటన వివాదంపై తాజాగా ఆదేశాలిచ్చిన తెలంగాణ హైకోర్టు.. దానిని వెంటనే తొలగించాలని, యూట్యూబ్ లోనూ కనిపించడానికి వీల్లేదని కరాకండిగా చెప్పింది. యాడ్ పై నిషేధం తక్షణమే అమల్లోకి వచ్చిన నేపథ్యంలో మరోసారి నెటిజన్లు ర్యాపిడోపై కామెంట్లు గుప్పించారు. కోర్టు తీర్పుతో ర్యాపిడో కోసం అల్లు అర్జున్ వేసిన దోశ మాడిపోయిందంటూ పలువురు ఎద్దేవా చేశారు. ఆర్టీసీ సంస్థను, బస్సులను కించపరిచేలా ఎవరు వ్యవహరించినా ఊరుకోబోమని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ హెచ్చరిస్తున్నారు.

First published:

Tags: Allu Arjun, Apsrtc, Telangana High Court, Television advertisements, Tsrtc

ఉత్తమ కథలు