స్విస్ బ్యాంకుల ఖాతాదారుల వివరాలు భారత్‌కు.. ఇక నల్ల కుబేరుల భరతం పట్టుడే!

Black Money: స్విస్‌ బ్యాంకుల్లో అక్రమంగా సొమ్మును దాచుకున్న వ్యక్తుల్లో ప్రధానంగా రియల్‌ ఎస్టేట్‌, ఆర్థిక సర్వీసులు, టెక్నాలజీ, హోమ్‌ డెకరేషన్‌, టెక్స్‌టైల్స్‌, ఇంజనీరింగ్‌ గూడ్స్‌, జెమ్స్‌ అండ్‌ జువెలరీ, టెలికం, పెయింట్స్‌ రంగాలకు చెందిన వారున్నారు.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: June 17, 2019, 7:44 AM IST
స్విస్ బ్యాంకుల ఖాతాదారుల వివరాలు భారత్‌కు.. ఇక నల్ల కుబేరుల భరతం పట్టుడే!
ప్రతీకాత్మక చిత్రం (image: REUTERS/Denis Balibouse)
  • Share this:
స్విట్జర్లాండ్ బ్యాంకుల్లో నల్లధనం దాచి, భారత ప్రభుత్వానికి పన్నులు ఎగ్గొట్టిన నల్ల కుబేరుల బండారం బయటపడనుంది. అక్కడి బ్యాంకుల్లో ఖాతాలు కలిగిన 50 మంది భారతీయుల వివరాలు భారత్‌కు అందించే ప్రక్రియను స్విస్‌ అధికారులు చేపట్టారు. నల్లధనాన్ని పోగు చేసిన ఇండివిడ్యువల్స్‌పై కఠిన చర్యలు తీసుకునేందుకు ఇరు దేశాలకు చెందిన రెగ్యులేటరీ, నియంత్రణా సంస్థలకు ఈ వివరాలను అధికారులు అందజేయనున్నారు. ఇప్పటికే ఇరు దేశాలకు చెందిన అధికారులు పరస్పరం విధానపరమైన సాయాన్ని ఇచ్చిపుచ్చుకునే ప్రక్రియను ప్రారంభించారు. స్విస్‌ బ్యాంకుల్లో అక్రమంగా సొమ్మును దాచుకున్న వ్యక్తుల్లో ప్రధానంగా రియల్‌ ఎస్టేట్‌, ఆర్థిక సర్వీసులు, టెక్నాలజీ, హోమ్‌ డెకరేషన్‌, టెక్స్‌టైల్స్‌, ఇంజనీరింగ్‌ గూడ్స్‌, జెమ్స్‌ అండ్‌ జువెలరీ, టెలికం, పెయింట్స్‌ రంగాలకు చెందిన వారున్నారు. కాగా, 2014లో మోదీ సర్కారు బాధ్యతలు చేపట్టిన తర్వాత స్విస్ బ్యాంకుల్లో అక్రమంగా సొమ్ము దాచుకున్న వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తూ వస్తోంది. దానికోసం ఆర్థిక నేరాలకు పాల్పడిన వారి వివరాలు, సమాచారం ఇచ్చిపుచ్చుకునేందుకు స్విస్ ప్రభుత్వంతో భారత్ ఒప్పందం కూడా చేసుకొంది.

ఇదిలా ఉండగా, ఒప్పందాలకు అనుగుణంగానే ఇండివిడ్యువల్స్‌పై దృష్టి సారించేందుకు స్విస్‌ ప్రభుత్వం ఫెడరల్‌ గెజిట్‌ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఇందులో భాగంగానే కొద్ది వారాల్లో 50 మంది ఇండివిడ్యువల్స్‌కు నోటీసులు జారీ చేసింది. బ్యాంకు ఖాతాలకు సంబంధించిన వివరాలను వెల్లడి చేయాలని లేనిపక్షంలో భారత ప్రభుత్వంతో ఆ వివరాలను పంచుకుంటామని స్విస్‌ ప్రభుత్వం స్పష్టం చేసింది. గత ఏడాదికాలంగా దాదాపు వంద మంది భారతీయులకు సంబంధించిన సమాచారాన్ని భారత ప్రభుత్వంతో స్విస్‌ ప్రభుత్వం ఇచ్చిపుచ్చుకుంది.

First published: June 17, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు