• HOME
  • »
  • NEWS
  • »
  • TRENDING
  • »
  • BLACK BEAR DESTROYS MANY PARTS OF THE CAR AFTER IT GETS TRAPPED INSIDE TEACHERS PARKED CAR NK

Viral video: వామ్మో ఎలుగుబంటి... టీచర్ కారులో దూరి ఎంత పనిచేసింది...

Viral video: వామ్మో ఎలుగుబంటి... టీచర్ కారులో దూరి ఎంత పనిచేసింది...

Viral video: వామ్మో ఎలుగుబంటి... టీచర్ కారులో దూరి ఎంత పనిచేసింది... (image credit - Youtube)

Viral video: విదేశాల్లో ఎలుగుబంట్ల హల్‌చల్ ఎక్కువే. తరచూ అవి వాహనదారులను భయపెడుతూ ఉంటాయి. అలాంటి ఘటనే ఒకటి తాజాగా జరిగింది. అందుకు సంబంధించిన వైరల్ వీడియో చూద్దాం.

  • Share this:
    Viral video: అది అమెరికాలోని హోస్టన్ కౌంటీ. ఓ ఆర్ట్ టీచర్‌కి... తన జీవితంలో ఎప్పుడూ తగలని షాక్ తగిలింది. నల్ల ఎలుగుబంటి... ఫేస్ టు ఫేస్ ఎదురైంది. కారులో ఇరుక్కున్న ఎలుగు... బయటకు రావడానికి చేసిన రభస అంతా ఇంతా కాదు. ఆమె పేరు మేరీ జాన్ యార్ బ్రోగ్. వార్నర్ రాబిన్స్ హైస్కూల్‌లో టీచర్. కారును రోజూలాగే పార్క్ చేసి... స్కూలుకు వెళ్లింది. తిరిగి వస్తూ... దూరం నుంచి కారువైపు చూస్తే... అందులో ఏదో జంతువు ఉన్నట్లు ఆమెకు అనిపించింది. తాను కారు పార్క్ చేసినప్పుడు డోర్స్, విండోస్ లాక్ చేశాను కదా... మరి అందులోకి జంతువు ఎలా వచ్చింది అనుకుంది. తీరా దగ్గరకు వచ్చి చూస్తే... అది ఎలుగుబంటి. దాన్ని చూడగానే... ఆమెకు ముచ్చెమటలు పట్టాయి. అక్కడి నుంచి రయ్యిన దూరంగా పారిపోయింది.

    పోలీసులకు కాల్ చేసింది. కాసేపటికే వారు వచ్చారు. కారు దగ్గరకు వెళ్లారు. లోపల చూస్తే... ఎలుగుబంటి... దర్జాగా కూర్చొని ఉంది. పోలీసులు గట్టిగా అరవడంతో... భయపడిన ఎలుగుబంటి... కారులోంచీ దూకి పారిపోయింది. ఆ తర్వాత కారును చూస్తే... అసలు కారులాగానే లేదు. లోపల ఇంటీరియర్ మొత్తం సర్వనాశనం చేసింది ఎలుగు. అది పారిపోయిన వీడియో వైరల్ అవుతోంది. అది ఇక్కడ చూడండి.

    రిపోర్టుల ప్రకారం... ఆ టీచర్... త్వరలోనే జరిగే విద్యా సంవత్సరానికి క్లాసెస్ చెప్పేందుకు ప్రిపేర్ అవుతున్నారు. అందుకోసమే స్కూలుకు వెళ్తున్నారు. తీరాచూస్తే ఇలా అయ్యింది. ఈ ఎలుగుంటి... కారు అద్దాలను పగలగొట్టి లోపలికి వెళ్లిందని అర్థమైంది.

    "మొదట దూరం నుంచి చూసినప్పుడు కారులో నా కుక్క ఉందేమో అనుకున్నాను. దగ్గరకు వెళ్లాక... అది అరవడంతో... ఎలుగు బంటి అని అర్థమైంది." అని మేరీ అన్నారు. ఎలుగుబంటికి ఎలాంటి గాయాలూ కాలేదు. కానీ మాత్రం సర్వనాశనం అయ్యింది. అందులోని డ్యాష్, రేడియో, ఎయిర్ బ్యాగ్, విండో కవరింగ్స్ అన్నీ పాడైపోయాయి. అన్నీ చింపి చాట చేసింది.

    ఇది కూడా చదవండి: Old Rs.5 Note: ఆ పాత రూ.5 నోటు మీ దగ్గర ఉందా... ఐతే... రూ.30 వేలు మీవే...

    విదేశాల్లో చాలా చోట్ల అడవులకు దగ్గర్లోనే ఇళ్లు ఉంటాయి. దాంతో ఎలుగుబంట్లు తరచూ ఇలా వచ్చేస్తూ... వాహనాలను నాశనం చేస్తుంటాయి. మరోసారి అదే జరిగింది.
    Published by:Krishna Kumar N
    First published:

    అగ్ర కథనాలు