హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Viral video : గవర్నమెంట్ స్కూల్ మరుగుదొడ్డిలో బీజేపీ ఎంపీ .. మధ్యప్రదేశ్‌ ఎంపీ ఏం చేశారో తెలుసా ..?

Viral video : గవర్నమెంట్ స్కూల్ మరుగుదొడ్డిలో బీజేపీ ఎంపీ .. మధ్యప్రదేశ్‌ ఎంపీ ఏం చేశారో తెలుసా ..?

(Photo Credit:Youtube)

(Photo Credit:Youtube)

Viral video: మధ్యప్రదేశ్‌కి చెందిన ఓ ఎంపీ చేసిన పని అందర్ని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఏదో విధంగా అందరికంటే భిన్నంగా ప్రవర్తిస్తూ వార్తల్లో నిలవడం ఆయనకు కొత్తేమి కాకపోయినప్పటికి మరోసారి ప్రభుత్వ పాఠశాలలోని టాయిలెట్‌ని తన చేతులతో శుభ్రంగా కడగడటం వైరల్ అవుతోంది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Madhya Pradesh, India

మధ్యప్రదేశ్‌(Madhya Pradesh)కి చెందిన ఓ ఎంపీ చేసిన పని అందర్ని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఏదో విధంగా అందరికంటే భిన్నంగా ప్రవర్తిస్తూ వార్తల్లో నిలవడం ఆయనకు కొత్తేమి కాకపోయినప్పటికి మరోసారి ప్రభుత్వ స్కూల్‌(Govt School)లోని టాయిలెట్‌(Toilet)ని తన చేతులతో శుభ్రంగా కడుతున్న వీడియో సోషల్ మీడియా(Social media)లో వైరల్ అవుతోంది. ఎంపీ శుభ్రత, పరిశుభ్రత కోసం ఈ పని చేసినప్పటికి నెటిజన్లు మాత్రం డిఫరెంట్‌గా రియాక్ట్ అవుతున్నారు. ఏది ఏమైనా బీజేపీ(Bharatiya Janata Party)ఎంపీ జనార్ధన్ మిశ్రా(Janardan Mishra)తన సాహసోపేతమైన చర్యతో మళ్లీ అందరికి సుపరిచితమయ్యారు. ఈ వీడియో చూసిన తర్వాత నెటిజన్లు(Netizens)ఆయన్ని కామెంట్స్ చేస్తున్నారు. కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.

వామ్మో... బురద నీటిలో స్నానం చేసిన మహిళా ఎమ్మెల్యే.. వీడియో వైరల్..

టాయిలెట్ క్లీన్ చేసిన ఎంపీ..

మధ్యప్రదేశ్‌ రేవా ఎంపీ జనార్దన్ మిశ్రా మరోసారి వార్తల్లో నిలిచారు. గురువారం ఉదయం జిల్లాలోని మౌగంజ్‌లోని ఖత్‌ఖారీ ప్రాంతానికి చేరుకుని అక్కడి ప్రభుత్వ బాలికల పాఠశాలను సందర్శించారు. స్కూల్‌లో మరుగుదొడ్డి పూర్తిగా అపరిశుభ్రంగా ఉండటం చూసిన ఎంపీ వెంటనే తన స్వహస్త్రాలతో లెట్రీన్‌ను కడిగారు. ఎంపీ టాయిలెట్‌ను శుభ్రం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వాస్తవానికి బీజేపీ యువమోర్చా ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం కోసం వచ్చిన ఎంపీ జనార్దన్‌ మిశ్రా ఈవిధంగా బాత్రూం, లెట్రీన్‌ క్లీన్‌ చేసే సఫాయిగా మారడంపై నెట్టింట్లో చర్చ నడుస్తోంది. ఆ వీడియోనే తెగ వైరల్ అవుతోంది.

పబ్లిసిటీ కోసమేనా..

వెరైటీగా మాట్లాడటం.. తన ప్రసంగంతో ప్రజల్ని ఆకట్టుకోవడం బీజేపీ ఎంపీ జనార్దన్ మిశ్రాకు ఉన్న టాలెంట్‌. దాంతోనే పలుమార్లు వార్తల్లో నిలిచారు. ఇప్పుడు ఏకంగా టాయిలెట్ క్లీన్‌ చేసి మరోసారి తాను అందరు నేతల్లా కాదని ...అందరి వాడిని అని నిరూపించుకునే ప్రయత్నం చేయడం విశేషంగా చెప్పుకుంటారు నెటిజన్లు.

ఇది డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అంటే నమ్ముతారా? అందరికీ అర్థమయ్యేలా ముత్యాల్లాంటి అక్షరాలు

వైరల్ అవుతున్న వీడియో..

అయితే ఎంపీ జనార్దన్ మిశ్రా టాయిలెట్‌ క్లీన్ చేయడం ఇదే మొదటి సారి కాదు. గతంలో కూడా ఎంపీగా ఉన్న సమయంలోనే రెండు సార్లు పాఠశాలలోని మరుగుదొడ్లను శుభ్రం చేశారు.పరిసరాలు, మరుగుదొడ్లు శుభ్రంగా ఉంచుకోవాలంటూ సందేశాన్ని కూడా ఇచ్చారు. 2014లో బీజేపీ ఎంపీ జనార్దన్ మిశ్రాను స్వచ్ఛ భారత్ మిషన్ కింద పరిశుభ్రతకు బ్రాండ్ అంబాసిడర్‌గా మార్చిన విషయాన్ని ఈసందర్భంగా నెటిజన్లు గుర్తుకు చేసుకుంటున్నారు.

Published by:Siva Nanduri
First published:

Tags: Bjp, Madhya pradesh, Trending news, Viral Video

ఉత్తమ కథలు