కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ (BJP) స్పీడ్ పెంచింది. ఇప్పటికే ప్రతిపక్షాలు అన్ని ఢిల్లీ వేదికగా ఒక్కటై బీజేపీని ఓడించడానికి శాయశక్తులు ఒడ్డుతున్నాయి. ఒక వైపు నితీష్ కుమార్ ప్రతిపక్ష నాయకులను వరుసగా భేటీ అవుతు హీట్ పెంచుతున్నారు. ఇక మరోవైపు రాహుల్ గాంధీ కూడా భారత్ జోడో యాత్ర పేరుతో ప్రజలకు చేరువయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో కేంద్రంలో ఉన్న మోదీ ప్రభుత్వం (PM MODI) కూడా వారికి ధీటుగా సమాధానం ఇచ్చే దిశగా పావులు వేస్తుంది. కాగా, తాజాగా, బీజేపీ 2024 ఎన్నికలే టార్గెట్ ఆయా రాష్ట్రాలను కేంద్ర మంత్రులకు బాధ్యతలను అప్పగించింది. దీనిలో భాగంగా.. రాష్ట్ర ఎన్నికలు, 2024 జాతీయ ఎన్నికలపై దృష్టి సారించిన బిజెపి, ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రుల నుంచి ఉద్వాసనకు గురైన నాయకుల కోసం కొత్త పార్టీ పాత్రలను నేడు ప్రకటించింది.
గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ, త్రిపుర మాజీ ముఖ్యమంత్రి బిప్లబ్ కుమార్ దేబ్, కేంద్ర మాజీ మంత్రులు ప్రకాశ్ జవదేకర్, మహేశ్ శర్మలకు కొన్ని రాష్ట్రాలు కేటాయించారు. పంజాబ్‌కు విజయ్ రూపానీ, హర్యానాకు బిప్లబ్ దేబ్ బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రకాష్ జవదేకర్ కేరళను పొందారు. గతంలో హర్యానా ఇన్‌ఛార్జ్‌గా ఉన్న పార్టీ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డేకి బీహార్ బాధ్యతలు అప్పగించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీకి నమ్మకస్తుడిగా భావించే సీనియర్ నేత ఓం మాథుర్‌పై బీజేపీ నాయకత్వం నమ్మకం అలాగే ఉంది. ఇటీవలే శక్తివంతమైన సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి ఎంపికైన తర్వాత, వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న ఛత్తీస్‌గఢ్‌కు శ్రీ మాథుర్ కూడా బాధ్యతలు చేపట్టనున్నారు.
भाजपा राष्ट्रीय अध्यक्ष श्री @JPNadda ने विभिन्न राज्यों के प्रभारी एवं सह-प्रभारी को नियुक्त किया है। pic.twitter.com/Rn4uyB8cmL
— BJP (@BJP4India) September 9, 2022
ఇదిలా ఉండగా ఛత్తీస్ గఢ్ లో కాంగ్రెస్‌ను గద్దె దించాలని బిజెపి బలంగా భావిస్తోంది. బిహార్ మాజీ మంత్రి మంగళ్ పాండే కీలక బాధ్యతలను చేజిక్కించుకున్న మరో నేత. ఆయనకు పశ్చిమ బెంగాల్ బాధ్యతలు అప్పగించారు. అక్కడ పార్టీ ఓట్లు, సీట్ల కోసం దూకుడుగా కొనసాగుతోంది. ఒడిశా , తెలంగాణతో పాటు బెంగాల్‌కు కూడా బాధ్యతలు అప్పగించిన సునీల్ బన్సాల్‌తో కలిసి ఆయన పని చేస్తారు. వీరిలో చాలా మంది నాయకులు ఏ పార్టీ పదవిని పొందలేదు కానీ వారు ఇంతకు ముందు ఎన్నికల ఇన్‌ఛార్జ్‌గా ఉన్నారు. బీజేపీ స్థావరాన్ని విస్తరించడంతోపాటు నిర్దిష్ట రాష్ట్రాల ఎన్నికల్లో గెలుపొందడంపై పూర్తిగా దృష్టి సారించడంతో వారు పార్టీ పదవులకు తూట్లు పొడిచే ఆలోచనలో ఉన్నట్లు వర్గాలు చెబుతున్నాయి.
రాజస్థాన్‌లో అరుణ్‌సింగ్, మధ్యప్రదేశ్‌లో మురళీధర్‌రావు వంటి కొంతమంది ఇన్ఛార్జ్లను కొనసాగించారు. లక్ష్మీకాంత్ వాజ్‌పేయి జార్ఖండ్ బాధ్యతలు చేపట్టనున్నారు. త్రిపుర బాధ్యతలను మహేష్ శర్మ చూసుకుంటాడు. బీజేపీకి చెందిన ప్రముఖ టీవీ ఫేస్ సంబిత్ పాత్ర ఈశాన్య రాష్ట్రాలకు సమన్వయకర్తగా వ్యవహరిస్తారు. పార్టీ జాతీయ కార్యదర్శి రితురాజ్ సిన్హా సంయుక్త సమన్వయకర్తగా వ్యవహరిస్తారు. బీజేపీలో నయాజోష్ నింపేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.