కాంగ్రెస్‌కు ఝలక్ ఇచ్చాడని.. యువకుడికి సన్మానం చేసిన బీజేపీ

కాంగ్రెస్‌కు ఝలక్ ఇచ్చాడని.. యువకుడికి సన్మానం చేసిన బీజేపీ

దిగ్విజయ్‌కి ఝలక్ ఇచ్చిన అమిత్ మాలికి సన్మానం చేస్తున్న బీజేపీ నేతలు (ఏఎన్ఐ ట్విట్టర్ ఫొటో)

అతనికి మైక్ ఇవ్వగా మోదీ సర్జికల్ దాడులు చేపట్టారు..ఉగ్రవాదులను చంపేశారని..మోదీకి మద్దతుగా సమాధానమిచ్చాడు. తనకు ప్రతికూలంగా సమాధానం రావడంతో దిగ్విజయ్ సింగ్ ఒక్కసారిగా షాకయ్యారు.

  • Share this:
    అసలే ఎన్నికల సమయం.. ఒక పార్టీపై మరో పార్టీ దుమ్మెత్తి పోసుకుంటాయి. ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ప్రత్యర్థిపై పై చేయి సాధించేందుకు ప్రయత్నిస్తాయి. అలాంటిది ప్రత్యర్థి బలహీనతలు తెలిస్తే ఇంకేమైనా ఉందా.. ఓ ఆటాడుకుంటాయి. వారిని విమర్శించిన వారిని అందలమెక్కిస్తాయి. తాజాగా, కాంగ్రెస్ సభలో ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి దిగ్విజయ్ సింగ్‌కు ఝలక్ ఇచ్చి, మోదీని పొగిడినందుకు అమిత్ మాలి అనే యువకుడికి బీజేపీ నేతలు ఘనంగా సన్మానం చేశారు. అనవసర ఆరోపణలు చేస్తున్న ఆ పార్టీకి సరైన బుద్ధి చెప్పావని అతడ్ని కొనియాడారు. ఈ సందర్భంగా మాలి మీడియాతో మాట్లాడుతూ ఆ వ్యాఖ్యలు చేశాక తననెవరూ ఏమీ అనలేదని చెప్పాడు.

    ఎన్నికల ప్రచారంలో భాగంగా భోపాల్‌లో ఏర్పాటు చేసిన సభలో దిగ్విజయ్ పాల్గొన్నారు. ఈ సభకు యువతీయువకులు పెద్ద సంఖ్యలో వచ్చారు. సభలో దిగ్విజయ్ మాట్లాడుతూ.. ''ప్రతి ఒక్కరి అకౌంట్లో మోదీ రూ.15 లక్షలు వేస్తామన్నారు..ఎవరికైనా వచ్చాయా? '' అని అడిగారు. ఐతే ఓ యువకుడు చెయ్యి పైకెత్తడంతో అతడిని స్టేజి మీదకు పిలిచి ప్రశ్నించారు దిగ్విజయ్. అతనికి మైక్ ఇవ్వగా మోదీ సర్జికల్ దాడులు చేపట్టారు..ఉగ్రవాదులను చంపేశారని..మోదీకి మద్దతుగా సమాధానమిచ్చాడు. తనకు ప్రతికూలంగా సమాధానం రావడంతో దిగ్విజయ్ సింగ్ ఒక్కసారిగా షాకయ్యారు. పక్కనే కాంగ్రెస్ నేత ఒకరు ఆ యువకుడిని స్టేజీ మీద నుంచి గెంటేశాడు. యువకుడు తన జవాబుతో దిగ్విజయ్ సింగ్‌ను కంగు తినిపించిన వీడియో వైరల్ అయ్యింది.
    First published: