మనలో చాలా మంది పేదరికం, ఆర్థిక సమస్యల కారణంగా యూనివర్శిటీలోని హస్టళ్లలో ఉంటూ చదువుకుంటారు. ప్రభుత్వం అందించే ఉపకార వేతనం తీసుకుంటూ కష్టపడి చదువుతుంటారు. మరికొందరు.. చదువుకొవడంతో పాటు.. తీరిక సమయాల్లో పార్ట్ టైమ్ ఉద్యోగాలు కూడా చేస్తుంటారు. అయితే... ప్రభుత్వాలు.. నెల నెల ఆయా విద్యార్థులకు నెలకు కొంత డబ్బు, సరుకులు ఇస్తారు. దీన్ని నెలంతా ఉపయోగించుకుంటారు. కొంత మంది విద్యార్థులు.. ప్రభుత్వం ఖర్చులకు ఇచ్చిన సొమ్మును దాచుకుంటారు. ఎక్కువగా ఖర్చుచేయరు. మరికొందరు విద్యార్థులు హస్టళ్లలో ఇచ్చిన సరుకులు, సామానులను బయట అమ్ముతుంటారు. దానితో వచ్చిన డబ్బును కూడా దాచుకుంటారు.
కొందరు ఖర్చులు తగ్గించుకొవడానికి టీ, టిఫిన్ లు మానేయడం, ఒకపూట మాత్రమే భోజనం చేస్తుంటారు. మరికొంత మంది చికెన్ లు, మటన్ లకు దూరంగా ఉంటారు. అనవసర పదార్థాలు ముట్టుకొరు. ఇలాంటి విషయాలు మనకు తెలిసిందే. కానీ ఇక్కడోక వ్యక్తి.. డబ్బులను ఆదాచేయడానికి ఏకంగా అన్నం బదులు, నెలల తరబడి కుక్కల ఆహారం తింటున్నాడు. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో (Social media) వైరల్ గా (Viral news) మారింది.
పూర్తి వివరాలు.. యూకేలో (Uk) విచిత్రమైన ఘటన వెలుగులోనికి వచ్చింది. ఒక యూనివర్శిటీ విద్యార్థి గదిలోకి అతని స్నేహితులు వెళ్లారు. అప్పుడు అతని గది నిండా పెడిగ్రి (Pedigree) సంచులున్నాయి. దీన్ని ఏంచేస్తావని అడిగితే.. అతను చెప్పిన సమాధానానికి షాక్ అయ్యారు. తాను మూడు పూటల పిడిగ్రి తింటానని చెప్పాడు. దీంతో వారికి దిమ్మ తిరిగినంతా పనైంది.
తాను.. కొన్ని నెలలకు ముందు డాగ్ ఫుడ్ (Dog food) తినడం ప్రారంభించానని.. అది చాలా చవుకని వారితో చెప్పాడు. కొన్ని నెలలుగా టిఫిన్ ,లంచ్, డిన్నర్ గా డాగ్ పెడిగ్రిని ఆహారంగా తింటున్నట్లు చెప్పాడు. డబ్బులను ఆదా చేయడానికి ఇలా చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటన నెట్టింట హల్ చల్ చేస్తుంది. దీన్ని చూసిన నెటిజన్లు.. ఇదేం కక్కుర్తి బుద్ధిరా నాయన... అంటూ కామెంట్ లు పెడుతున్నారు.
ఇదిలా ఉండగా యూఎస్ లో.. పాన్ స్లాపింగ్ కంటెస్ట్.. ఒకరి తలపై మరోకరు పాన్ తో కొట్టుకొవడం.. వీడియో వైరల్ గా మారింది.
దీనిలో ఇద్దరు వ్యక్తులు బెంచ్ మీద కూర్చున్నారు. ఒకరికి ఎదురుగా మరోకరు కూర్చున్నారు. మెటల్ తో తయారు చేసిన హెల్మెట్ లను వేసుకున్నారు. నిర్వహకులు వారి చేతికి దోసా పెనం ఇచ్చారు. దాన్నిపట్టుకుని ఒకరి తలపై మరోకరు కొట్టుకుంటున్నారు. ఇద్దరు ఏమాత్రం తగ్గడం లేదు. అయితే, యూఎస్ లో.. కొన్ని చోట్ల పాన్ స్లాపింగ్ కాంటెస్ట్ ( Pan Slapping Contest) పోటీలను నిర్వహిస్తుంటారు. హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ స్క్వార్జెనెగర్ స్థాపించిన ఆర్నాల్డ్ స్పోర్ట్స్ ఫెస్టివల్ "స్లాప్ ఫైటింగ్ ఛాంపియన్షిప్"(Pan slapping contest) యొక్క అటవీ ఎడిషన్ను ప్రారంభించింది.
Published by:Paresh Inamdar
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.