Viral video: రెండు కాళ్లతో నడుస్తున్న మేక.. అచ్చం మనిషిలానే..

బ్రహ్మం గారు చెప్పినట్టే జరుగుతున్నది. పందికి ఏనుగు పిల్లలు పుట్టడం, చెట్లు కిందికి వంగడం, లేవడం.. అన్నీ ఆయన చెప్పినట్టే జరుగుతున్నాయి. బీహార్ లో ఒక మేక అచ్చం మనిషిలానే నడుస్తున్నది.

news18
Updated: October 9, 2020, 3:37 PM IST
Viral video: రెండు కాళ్లతో నడుస్తున్న మేక.. అచ్చం మనిషిలానే..
నడుస్తున్న మేక..
  • News18
  • Last Updated: October 9, 2020, 3:37 PM IST
  • Share this:
సాధారణంగా చాలా జంతువులు నాలుగు కాళ్లతోనే నడుస్తాయి. కానీ బీహార్ లో మాత్రం ఒక మేక రెండు కాళ్లతో నడుస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నది. అది ఒకటి రెండు అడుగులు కాదు.. ఏకంగా 33 అడుగుల దాకా ఏమాత్రం తొనకకుండా నడుస్తుండటం గమనార్హం. ఈ మేక నడిచిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది.

బీహార్ లోని తెల్వార్ గ్రామానికి చెందిన లోకేశ్ మిశ్రా దీనికి యజమాని. గతేడాది జన్మించిన ఈ మేకకు.. ముందరి రెండు కాళ్లు సరిగా ఉన్నాయి. పుట్టినప్పుడే సమస్యతో పుట్టిన ఈ మేకకు నడవడం కష్టంగా మారింది. దీంతో దాని యజమాని.. మేకకు వెనుక కాళ్ల ఆధారంగా నడవడం నేర్పించాడు. దాదాపు ఆరు నెలల శిక్షణ తర్వాత ఆ మేక.. వెనుక కాళ్లు ఉపయోగించి అచ్చం మనిషిలాగే నడుస్తున్నది. ఇందుకు సంబంధించి పలువురు నెటిజన్లు మేక నడుస్తున్న వీడియోను తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అంతే.. ఆ మేక సెలబ్రిటీ అయిపోయింది. ఇది ఆగకుండా 33 అడుగులు వేయగలుగుతుందని దీని యజమాని లోకేశ్ మిశ్రా తెలిపారు. తర్వాత కొంత సేపు ఆగి మళ్లీ నడక ప్రారంభిస్తుంది. సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఈ నడిచే మేకను చూడటానికి చుట్టు పక్కల గ్రామాల ప్రజలే గాక.. పొరుగు జిల్లా వాసులు కూడా వస్తున్నారు.



ఇక నెటిజన్లు.. ఈ వీడియోను సప్త సముద్రాలు దాటించారు. నడుస్తున్న మేక గురించి యూఎస్ కు చెందిన ప్రముఖ పత్రిక న్యూయార్క్ టైమ్స్ ఒక కథనాన్ని ప్రచురించింది.




ప్రముఖ సోషల్ నెట్ వర్కింగ్ సైట్ ట్విట్టర్ లో కూడా ఈ మేక గురించి చర్చ జరుగుతుంది. మేక నడుస్తున్న వీడియోను ఒక ట్విట్టర్ యూజర్ పోస్టు చేస్తూ.. ‘2047 సంవత్సరంలో మేకలు మానవ జాతిని అంతం చేసినప్పుడు ఒక మేక తిరుగుబాటుకు ముందు నిటారుగా నడవడం ప్రారంభించినప్పుడు లభించిన అరుదైన ఫుటేజీ ఇది’ అని రాస్తూ షేర్ చేశారు. మరి ఆ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి..
Published by: Srinivas Munigala
First published: October 9, 2020, 3:37 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading