బిర్యానీ అంటే హైదరాబాదీలకు ప్రాణమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే క్రమంగా దేశమంతా బిర్యానీ హవా చూపిస్తోంది. ఇతర వంటలను డామినేట్ చేసేస్తోంది. ఆన్లైన్ డెలివరీ ప్లాట్‌ఫామ్ స్విగ్గిలో బిర్యానీకే ఎక్కువ మంది ఓటేస్తున్నారు. కొన్ని రకాల బిర్యానీలకు యావరేజ్‌గా సెకనుకో ఆర్డర్ తప్పకుండా వస్తోందని ఆ సంస్థ వెల్లడించింది. చికెన్ బిర్యానీనే భారత ఫేవరెట్ వంటకంగా మారిపోయిందని చెప్పింది. ఒక్క వెజ్ బిర్యానీ ఆర్డర్ వచ్చే సమయంలో ఆరు చికెన్ బిర్యానీలు బుక్ అవుతున్నాయని తెలిపింది.
తమ తొలి ఆర్డర్‌గా ఈ ఏడాది 3 లక్షల మంది చికెన్ బిర్యానీని ఎంచుకున్నారని స్విగ్గి గణాంకాలు చెబుతున్నాయి. “వర్క్ అడ్రస్ ల కంటే ఇళ్లకే ఐదు రెట్లు అధికంగా జనవరి, మార్చి మధ్య డెలివరీలు చేశాం. ఏప్రిల్, మేలో ఈ సంఖ్య 9కి పెరిగింది” అని స్విగ్గి స్టాటిస్టిక్స్ వెల్లడించాయి.
ప్రస్తుతం చాలా మంది వర్క్‌ఫ్రమ్ హోం చేస్తూ.. ఆఫీస్ వాతావరణాన్ని మిస్సవుతున్నారు. అందుకే ఇళ్ల వద్దకే టీ, కాఫీల వెరైటీలను సైతం ఆన్లైన్లోనే ఆర్డర్ చేస్తున్నారట. అలాగే మసాలా చాయ్ చాలా ఫేమస్ మారింది. ఫాస్ట్‌ఫుడ్ లు సైతం ఎక్కువగా ఆర్డర్ అవుతున్నాయి.
మరోవైపు స్విగ్గి.. పానీపూరీని కూడా డెలీవరి చేస్తోంది. లాక్డౌన్ తర్వాత మొత్తం 2లక్షల పానీపూరి ఆర్డర్లను అందుకుంది. ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపే వంటకాల కోసం స్విగ్గీ హెల్త్ హబ్‌ను ఆ సంస్థ ప్రారంభించింది. ఢిల్లీ, బెంగళూరు వంటి నగరాల్లో ఈ హెల్త్‌హబ్ కేటగిరీలో 130శాతం ఆర్డర్లు పెరిగాయి.
రాత్రి వేళ ప్రజలు సగటున 342 క్యాలరీలు తింటున్నారట. అదే లంచ్‌లో అయితే 350 క్యాలరీలుగా ఉంది. అదే బ్రేక్‌ఫాస్ట్ సమయంలో సగటున 427 క్యాలరీలు తీసుకుంటున్నారని లెక్కలు చెబుతున్నాయి. కాగా గ్రాసరీ, కూరగాయాలను కూడా డెలివరీ చేయడం స్విగ్గీ ప్రారంభించింది. ఇప్పటి వరకు 75వేల ఉల్లిపాయలను అమ్మినట్టు సంస్థ వెల్లడించింది.