BIRTHDAY GIFT GIVEN TO WIFE BY BUYING LAND ON THE MOON PVN
ఎంత ఘాటు ప్రేమయో : భార్య పుట్టినరోజుకి ఏ భర్త ఇవ్వని గిఫ్ట్ ఇచ్చాడు..షాక్ లో భార్య!
భార్యకు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన భర్త
Husband Gifts Wife Land On Moon : సాధారణంగా భార్య పుట్టినరోజుకి ఆమెకు ఇష్టమైన చీరలో,నగలో కొనిస్తుంటారు భర్తలు. మరీ అయితే ఖరీదైన కార్లు,వాచ్ లు గిఫ్ట్ లుగా ఇవ్వడం లేదా ఫారిన్ టూర్ కి తీసుకెళ్లి సర్ ప్రైజ్ చేయడం వంటివి చేస్తుంటారు.
Husband Gifts Wife Land On Moon : సాధారణంగా భార్య పుట్టినరోజుకి(Wife Birthday) ఆమెకు ఇష్టమైన చీరలో,నగలో కొనిస్తుంటారు భర్తలు. మరీ అయితే ఖరీదైన కార్లు,వాచ్ లు గిఫ్ట్ లుగా(Gifts) ఇవ్వడం లేదా ఫారిన్ టూర్ కి తీసుకెళ్లి సర్ ప్రైజ్ చేయడం వంటివి చేస్తుంటారు. అయితే ఇక్కడ ఓ భర్త మాత్రం...స్థలాన్ని కొనుగోలు చేసి ఇచ్చారు. అయితే ఇందులో వింత ఏముంది అనుకుంటున్నారా.. ఆ స్థలం కొన్నది భూమిపై కాదు చంద్రమండలంపైన(Land Buying On Moon).
హిమాచల్‌ప్రదేశ్(Himachalpradesh) రాష్ట్రంలోని కంగ్రా జిల్లాకు చెందిన హరీశ్ మహాజన్-పూజ భార్యాభర్తలు. భార్య పుట్టినరోజు సందర్భంగా ఏదైనా వెరైటీగా కానుక ఇవ్వాలనుకున్నాడు హరీశ్ మహాజన్. అనుకున్నదే తడువుగా చంద్రమండలం పైన ఎకరం స్థలాన్ని కొనుగోలు చేసి భార్యకు కానుకగా ఇచ్చాడు. ఆయన భార్య ఉండేది మాత్రం చల్లని జాబిల్లి వంటి ఆయన హృదయంలో కావచ్చు, తమ బర్త్ డే కానుకగా చంద్రుడిపై స్థలం కొని ఆమెకు కానుకగా ఇచ్చాడు. భర్త ఇచ్చిన సర్ప్రైజ్కు భార్యకు కొద్దిసేపు నోటివెంట మాటలు రాలేదు. భర్త గిఫ్ట్ తో ఫుల్ ఖుషీ అయిపోయింది. ఇలాంటి కానుక ఇస్తాడని తాను అస్సలు ఊహించలేదని అతడి భార్య పూజ తెలిపింది. అయితే చంద్రుడిపై ఎకరం స్థలాన్ని గతేడాదే కొనుగోలు చేయాలని హరీశ్ మహాజన్ అనుకున్నాడు. అందుకోసం ఇంటర్నేషనల్ లునార్ ల్యాండ్స్ సొసైటీకి దరఖాస్తు చేసుకున్నాడు. ఏడాది ప్రక్రియ అనంతరం సొసైటీ రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన పత్రాలను ఇప్పుడు ఆన్లైన్లో పంపించారు.
చంద్రమండలంపై స్థలం కొనుగోలుకి ఖర్చు చేసిన డబ్బు ఎంత అనేది మాత్రం హరీశ్ వెల్లడించలేదు. ఇది ప్రేమకు సంబంధించిన విషయమని,డబ్బుది కాదు అని హరీశ్ తెలిపారు. అయితే గతంలో చాలా మంది తమ కుటుంబసభ్యులకు చంద్రమండలంపై స్థలం కొనుగోలు చేసి గిఫ్ట్ గా ఇవ్వడం తెలిసిందే. గతంలో కూడా రాజస్తాన్ లోని అజ్మీర్ కు చెందిన ధర్మేంద్ర అనిజా అనే వ్యక్తి తమ వివాహ ఎనిమిదో వార్షికోత్సవం సందర్భంగా భార్య సప్నా అనిజాకు చంద్రుడిపై స్దలాన్ని కొనుగోలు చేసి కానుకగా ఇచ్చాడు. చాలా మంది ఈ భూమి మీద ఉన్న కార్లు, బంగారం వంటి వాటిని బహుమతులుగా ఇస్తూ ఉంటారని, అందువల్ల ఏదైనా ప్రత్యేకత చూపించాలని అనుకున్నానన్నారు. అందుకే చంద్రునిపై మూడెకరాల స్థలాన్ని కొన్నానని చెప్పారు. లూనా సొసైటీ ఇంటర్నేషనల్ ద్వారా ఈ స్థలాన్ని కొన్నానని, దీనికి అవసరమైన ప్రక్రియ పూర్తి కావడానికి ఒక సంవత్సరం పట్టిందని చెప్పారు.ఖగోళంలో ఎన్నిగ్రహాలున్నా చంద్రుడు మానవులకు ప్రత్యేకం. చంద్రుడి వెన్నెలను కవులు తమ కవిత్వానికి ప్రేరణగా తీసుకుంటే సామాన్యులు దాన్ని అస్వాదిస్తారు. చిన్నప్పుడు అమ్మ మనం అన్నం తినమని మారాం చేస్తే చందమామరావే.. జాబిల్లి రావే అంటూ పాటపాడి తినిపిస్తుంది. చంద్రమండలంపై మానవులు నివసించేందుకు అనువైన పరిస్థితులు ఉన్నాయా అన్నదానిపై ఇప్పటికీ పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి.
Published by:Venkaiah Naidu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.