Home /News /trending /

BIRTHDAY CAKE NO LESS THAN A SAVIOUR FOR TWO BIKERS IN MADHYA PRADESHS BURHANPUR AS LEOPARD GIVES THEM CHASE FOR A KILOMETRE GH SRD

Leopard Chase: భూమ్మీద నూకలు ఉన్నాయ్..చిరుత పులి నుంచి ఇద్దరి యువకుల్ని కాపాడిన బ‌ర్త్‌డే కేక్‌!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Leopard Chase: అదృష్టం బాగుంటే ఎంతటి ప్రమాదం నుంచి అయినా తప్పించుకోవచ్చు అనడానికి తాజా ఘటనే ఉదాహరణ. భూమ్మీద నూకలు ఉంటే చాలు మృతువు అంచుల దాకా వెళ్లినా తిరిగి రావచ్చు అనడానికి ఈ ఇద్దరు యువకులే నిదర్శనం.

ఓ ఇద్ద‌రు బైక‌ర్లు చిరుత దాడి నుంచి త్రుటిలో త‌ప్పించుకున్నారు. దాదాపు చావు అంచుల‌దాకా వెళ్ళిన వీరు బ‌ర్త్ డే కేక్ పుణ్య‌మా అని బ‌య‌ట‌ప‌డ్డారు. ఆశ్చ‌ర్యంగానూ ఆస‌క్తికరంగానూ ఉన్న ఈ సంఘ‌ట‌న మ‌ధ్యప్ర‌దేశ్ రాష్ట్రం బుర్హాన్‌పురా జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మ‌ధ్య ప్ర‌దేశ్ రాష్ట్రంలోని బుర్హాన్‌పురా జిల్లాలోని గొరాడియా గ్రామానికి చెందిన ఫిరోజ్ మ‌న్సూరి, స‌బిర్ అన్న‌ద‌మ్ములు. ఫిరోజ్ కుమారుడి పుట్టిన‌రోజు సంద‌ర్భంగా కేక్ తీసుకురావ‌డానికి అన్న‌ద‌మ్ములిద్ద‌రూ క‌లిసి బైక్‌పైన ద‌గ్గ‌ర‌లోని నేపాన‌గ‌ర్‌కు వెళ్ళారు. అక్క‌డ కేక్ తీసుకుని బైక్‌పై ఇంటికి తిరుగు ప‌య‌న‌మ‌య్యారు.ఫిరోజ్ బండి నడుపుతుండ‌గా స‌బిర్ వెనుక కేక్ ప‌ట్టుకుని కుర్చున్నాడు. అయితే దారిలో వారికి హ‌ఠాత్తుగా ఒక చిరుత పులి క‌నిపించింది. రోడ్డు ప‌క్క‌నే ఉన్న చెర‌కుతోట‌ల్లోంచి చిరుత రోడ్డుపైకి వ‌చ్చి వీరిని వెంటాడింది. అంతే అన్న‌ద‌మ్ములిద్ద‌రికీ ఒక్క‌సారిగా గుండె జారిపోయింది. ఫిరోజ్ చిరుత నుంచి త‌ప్పించుకోవ‌డానికి బండి వేగం పెంచాడు. కానీ మ‌ట్టిరోడ్డు కావ‌డంతో అది వీరిని త‌ర‌మ‌డం సుల‌భ‌మైంది. ఇలా దాదాపు అర‌కిలోమీట‌రు వరకు చిరుత వీరి వెంట‌ప‌డింది. అంతేకాదు బండిపైన పంజా కూడా విసిరింది. బండిపై ప‌డిన పంజాగుర్తులు ఈ సంఘ‌ట‌న‌కు సాక్ష్యంగా నిలుస్తున్నాయి.

స‌హ‌జంగా చిరుతలు పెద్ద‌వాళ్ళ‌పై దాడిచేసిన సంద‌ర్భాలు అరుద‌నే చెప్పాలి. కానీ ఇక్క‌డ మాత్రం ఏకంగా వారిని త‌ర‌మ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగించింది. ఓ ప‌క్క ఫిరోజ్ పులిబారిన ప‌డ‌కుండా బండిని న‌డుపుతుంటే... వెనుక కూర్చున్న స‌బీర్ కేక్ చే జారిపోకుండా జాగ్ర‌త్త ప‌డుతున్నాడు... అయితే పులి పంజా స‌బిర్ ప‌ట్టుకున్న కేక్ బాక్స్‌ను చింపిన‌ప్పుడు అత‌నికి మెరుపులాంటి ఐడియా వ‌చ్చింది. బ‌హుశా పులికి ఈ కేక్ ఇచ్చేస్తే త‌మ‌ని వ‌దిలేస్తుందేమోన‌ని ఆలోచించాడు వెంట‌నే కేక్ బాక్స్‌ను దాని ముఖంపైకి విసిరాడు... దీంతో చిరుత ప‌క్క‌నే ఉన్న పొలాల్లోకి వెళ్ళిపోయింది... ఇంకేముంది కేక్ పోతే పోయింది బ‌తికి బ‌ట్ట‌క‌ట్టాం అంతే చాలు అనుకున్నారు ఆ అన్న‌ద‌మ్ములు.
తాము త్రుటిలో ప్ర‌మాదం నుంచి త‌ప్పించుకున్నామ‌ని స‌బిర్ అట‌వీ అధికారుల‌కు చెప్పాడు. తొలుత ఈ అన్న‌ద‌మ్ముల‌పై దాడి చేసింది చిరుతా కాదా అనే విష‌యంలో అట‌వీ అధికారులు సందిగ్ధంలో ప‌డ్డారు. త‌రువాత ఫిరోజ్‌, స‌బిర్ ప్ర‌యాణించిన మార్గంలో అట‌వీ అధికారులు చిరుత‌పులి పాద‌ముద్ర‌ల‌ను క‌నుగొన్నారు.
Published by:Sridhar Reddy
First published:

Tags: Leopard, Leopard attack, Madhya pradesh, VIRAL NEWS

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు