#BirdBoxChallenge: ఇది కీకీ ఛాలెంజ్ కంటే డేంజర్

2018లో కీకీ ఛాలెంజ్ నెటిజన్లను ఊపేసింది. 2019 ఆరంభంలోనే బర్డ్ బాక్స్ ఛాలెంజ్ వచ్చింది. ఇది కీకీ ఛాలెంజ్ కంటే డేంజర్.

news18-telugu
Updated: January 3, 2019, 7:59 PM IST
#BirdBoxChallenge: ఇది కీకీ ఛాలెంజ్ కంటే డేంజర్
2018లో కీకీ ఛాలెంజ్ నెటిజన్లను ఊపేసింది. 2019 ఆరంభంలోనే బర్డ్ బాక్స్ ఛాలెంజ్ వచ్చింది. ఇది కీకీ ఛాలెంజ్ కంటే డేంజర్.
  • Share this:
గత ఏడాది కీకీ ఛాలెంజ్ నెటిజన్లకు కిక్కెక్కించింది. కదులుతున్న వాహనంలో నుంచి కిందకు దిగి.. డ్యాన్స్ చేయడం ఈ కీకీ ఛాలెంజ్ స్పెషాలిటీ. అయితే, ఇప్పుడు మరో కొత్త రకం ఛాలెంజ్ వచ్చింది. నెట్ ఫ్లిక్స్ రూపొందించిన బర్డ్ బాక్స్ సినిమా‌లో ఓ తల్లి తన పిల్లలను కాపాడుకోవడానికి చేసే ప్రయత్నమే ఈ ఛాలెంజ్. అందులో తల్లి, ఇద్దరు పిల్లల కళ్లకు గంతలు కడుతుంది. కళ్లకు గంతలు కట్టుకునే తన పనులన్నీ చేస్తుంటుంది. పక్షుల కూతల ఆధారంగా ఆమె నడుచుకుంటుంది. ఈ బర్డ్ బాక్స్ మూవీ నెటిజన్లను బాగా ఆకట్టుకుంది. దీంతో ప్రజలు కూడా అలాగే కళ్లకు గంతలు కట్టుకుని బర్డ్ బాక్స్ గేమ్‌లు ఆడడం మొదలుపెడుతున్నారు.







అమెరికాలో ఈ బర్డ్ బాక్స్ ఛాలెంజ్ ఫీవర్ పెరిగింది. జనం కళ్లకు గంతలు కట్టుకుని ఇలా పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు. వాటిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. దీంతో దయచేసి ఇలాంటి గేమ్స్ ఆడొద్దంటూ ఏకంగా నెట్‌ఫ్లిక్స్ విజ్ఞప్తి చేసింది.

First published: January 3, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading