బర్గర్ కోసం క్యూలో బిల్ గేట్స్...హ్యాట్సాఫ్

ప్రపంచ కుబేరుల్లో ఒకరు. అలాంటి ఆయన ఏం కావాలన్న చిటికెలో సాధించుకోలడు. తనకు ఏం అవసరమైన క్షణాల్లో టేబుల్‌పైకి రప్పించగలడు. కానీ బిల్ గేట్స్ మాత్రం అలా కాదు

news18-telugu
Updated: January 19, 2019, 10:05 AM IST
బర్గర్ కోసం క్యూలో బిల్ గేట్స్...హ్యాట్సాఫ్
బర్గర్ కోసం క్యూలైన్లో నిల్చున్న బిల్ గేట్స్
  • Share this:
అన్ని ఉన్న ఆకు అణిగి మనిగి ఉంటుంది. ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుందన్న సామెత మనకు తెలిసింది. కొందరు కాస్త డబ్బు రాగానే... ఎగిరెగిరి పడతారు. ఆకాస్త సంపదకే ఎక్కడలేని బిల్డప్ చూపిస్తారు. పక్కనవాళ్లను, తనవాళ్లను సైతం పట్టించుకురా. కళ్లు నెత్తిన పెట్టుకొని తిరుగుతారు. కానీ ప్రపచంలో చాలామంది సుసంపన్నులు మాత్రం ఇందుకు విరుద్ధం. సాధారణమైన జీవితాన్ని గడిపేందుకు చాలామంది రిచ్ పర్సన్స్ ఇష్టపడుతుంటాడరు. అందులో ఒకరు బిల్ గేట్స్. ఈయన పేరుకే పరిచయమే అవసరం లేదు. మైక్రోసాఫ్ట్ అధినేత. సాఫ్ట్ వేర్ ప్రపంచంలో ఈయన పేరు అందరికీ సుపరిచితం. అంతేకాదు ఈయన ప్రపంచ కుబేరుల్లో ఒకరు. అలాంటి ఆయన ఏం కావాలన్న చిటికెలో సాధించుకోలడు. తనకు ఏం అవసరమైన క్షణాల్లో టేబుల్‌పైకి రప్పించగలడు. కానీ బిల్ గేట్స్ మాత్రం అలా కాదు. శాసించే స్థాయిలో ఉన్న అలాంటి ఓ గొప్ప వ్యక్తి చేసిన ఓ చిన్న పని అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఆయన స్థాయిని మరింత రెట్టింపు చేసింది.

బిల్ గేట్స్ ఓ బర్గర్ కోసం ఆ షాపు ముందు క్యూలో నిలబడ్డారు. వినడానికే ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఓ బర్గర్ దుకాణం వద్ద ఆయన ఓ సాధారణ వ్యక్తిలా క్యూలో నిల్చున్న ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఏమాత్రం దర్పం లేకుండా, ఓపిగ్గా తన వంతు కోసం ఎదురుచూస్తున్న ఆయన నిరాడంబరతకు నెటిజన్లు హేట్సాఫ్ చెబుతున్నారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే దానికి బిల్ గేట్స నిలువెత్తు నిదర్శనమంటూ జోహార్లు పలుకుతున్నారు.ఇవికూడా చదవండి:

పోర్న్ స్టార్‌తో రాహుల్ గాంధీ... ఫోటో వైరల్... సోషల్ మీడియాలో దుమారం...

మీ ఓటే మా గిఫ్ట్.. హర్యానాలో పెళ్లి శుభలేఖ వైరల్
Published by: Sulthana Begum Shaik
First published: January 19, 2019, 9:52 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading