Bill Gates: నేను సింథటిక్ మాంసాన్ని మాత్రమే తింటా.. మీరూ తినండి.. యూత్ కు నేనిచ్చే సలహా అదొక్కటే..

బిల్‌గేట్స్ ( మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు )

ధనిక దేశాలన్నీ 100శాతం సింథటిక్ బీఫ్ వైపు మళ్లాలని తాను అనుకుంటున్నట్లు గతంలో ఎంఐటీ టెక్నాలజీ రివ్యూ ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు. రుచిలో వ్యత్యాసం కనిపిస్తుందని, అయితే కాలక్రమేణా సింథటిక్ మీట్ కి అలవాటు పడితే..

  • Share this:
బిల్ గేట్స్.. ప్రపంచానికి పరిచయం అక్కర్లేని పేరు ఆయనది. ప్రపంచ కుబేరుల జాబితాలో ముందు వరుసలో ఉండే ఈ దిగ్గజం తాజాగా రెడిట్ లో తన అభిమానులతో మాట్లాడారు. వారు అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పారు. ఈ సందర్భంగా పర్యావరణ మార్పులపై కూడా స్పందించారు. ఆలస్యం చేయకుండా ఈ సంక్షోభంపై దృష్టి సారించాలని తన 'ఆస్క్ మీ ఎనీథింగ్' సెషన్ లో ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ తెలియజేశారు. అంతేకాదు.. వాతావరణ మార్పుల గురించి ప్రస్తుతం తానేమి చేయబోతున్నారో వివరించారు. తన చివరి సెషన్ తర్వాత వాతావరణ మార్పుల గురించి ఓ పుస్తకాన్ని ప్రచురించినట్లు పేర్కొన్నారు. 15 ఏళ్ల నుంచి శక్తి, వాతావరణ మార్పుల గురించి నేర్చుకుంటూ ఉత్తేజకరమైన పురోగతిని సాధించానని, ఇప్పుడు ఈ వేగాన్ని దశలవారీగా అమలు చేసే ఆచరణాత్మక ప్రణాళిక అవసరం అని ఆయన రాశారు.

కర్భన ఉద్గారాలను తగ్గించడానికి మీరు ఏం చేయగలరు అని ఓ వినియోగదారుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా తాను తీసుకున్న చర్యల గురించి వివరించారు. సింథటిక్ మాంసం తినడం ప్రారంభించానని, గ్రీన్ ఏవియేషన్ ఇంధనాన్ని కొనుగోలు చేస్తున్నాని బదులిచ్చారు. అంతేకాకుండా ఇంటి వద్ద సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేశానని, ఎలక్ట్రిక్ వాహనాలను ఉపయోగిస్తున్నానని చెప్పారు. వాతావరణ మార్పులపై పోరాడేందుకు ఎలాంటి సాంకేతికత ఉపయోగపడుతుందని మరో వినియోగదారుడు అడుగ్గా.. " మనకు చాలా సాంకేతికిత అవసరం. సింథటిక్ మాంసం, శక్తి నిల్వ, నిర్మాణా సామాగ్రిని తయారు చేసే నూతన మార్గాలు లాంటి ఐడియాలు ఓపెన్ గా ఉండాలి" అని బిల్ గేట్స్ సమాధానం చెప్పారు.
ఇది కూడా చదవండి: పెళ్లి తర్వాత సినిమాలు మానేయమని రాజీవ్ కండీషన్ పెట్టాడు.. ఆసక్తికర విషయాలు బయటపెట్టిన యాంకర్ సుమ

కొద్ది నెలల క్రితం ఆయన ప్రచురించిన "వాతావరణ విపత్తు ఎలా నివారించాలి?" అనే పుస్తకంలో ఇదే విషయాన్ని ప్రస్తావించారు. ఆయన పరిష్కారాల్లో సింథటిక్ మీట్ ప్రధానమైంది. దీంతో పాటు 19 ఏళ్ల యువకుడికి మీరు ఎలాంటి సలహా ఇస్తారని ఓ యూజర్ అడగ్గా.. "మీరు వాతావరణ మార్పులు గురించి నేర్చుకోవాలి. అయితే ఫుల్ టైం ఉద్యోగంలా కాకుండా మీరు కోరుకునే ఉద్యోగం ఎంచుకుని, అందులో విజయం సాధించేందుకు లక్ష్యాలను కలిగి ఉండాలి" అని ఆయన అన్నారు. ధనిక దేశాలన్నీ 100శాతం సింథటిక్ బీఫ్ వైపు మళ్లాలని తాను అనుకుంటున్నట్లు గతంలో ఎంఐటీ టెక్నాలజీ రివ్యూ ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు. రుచిలో వ్యత్యాసం కనిపిస్తుందని, అయితే కాలక్రమేణా సింథటిక్ మీట్ కి అలవాటు పడితే అదే మరింత రుచిగా ఉంటుందని అన్నారు.
ఇది కూడా చదవండి: శోభన్ బాబు చనిపోయిన రోజు అసలేం జరిగింది..? తండ్రితో మాట్లాడి కొడుకు బయటకు వెళ్లగానే..

కరోనా మహమ్మారి గురించి 2015లోనే బిల్ గేట్స్ ప్రపంచాన్ని హెచ్చరించారు. సమీప భవిష్యత్తులో పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కోంటామనే విషయాన్ని ప్రజలు తెలుసుకోవాలని అప్పుడు చెప్పారు. మైక్రోసాఫ్ట్ అధినేత ఇటీవలే వెరిటాసియం అనే తన యూట్యూబ్ ఛానల్ ప్రారంభించారు. డెరెక్ ముల్లర్ తో ఓ వీడియో కాల్ ద్వారా చాట్ చేశారు. తన జోస్యం గురించి ఎలాంటి మంచి అనుభూతి కలగలేదని బదులిచ్చారు. అంతేకాకుండా రెండు విపత్తుల గురించి తెలిపారు. ఒకటి వాతావారణ మార్పు. ఈ మహమ్మారిలో సంభవించిన దానికంటే ఏటా ఎక్కువ మరణాలు నమోదవుతాయి అని చెప్పారు. రెండో సంక్షోభం గురించి ఆయన వెల్లడించడానికి ఇష్టపడలేదు. అయితే అది బయో టెర్రరిజం. నష్టాన్ని కలిగించాలనుకునేవారు ఎవరైనా ఎంత మూల్యానికైనా వైరస్ లను సృష్టించగలరని, దీని ద్వారా ప్రస్తుతం సంభవించే అంటువ్యాధుల కంటే ఎక్కువగా ఉంటాయని చెప్పారు.
ఇది కూడా చదవండి: ‘ఆ శోభన్ బాబు చచ్చిపోయాడురా.. అనేవాడు.. ప్రతి నెలా నాకు రూ.10 లక్షలు.. అంతా ఆయన చలవే..’.. దర్శకుడు కోదండరామిరెడ్డి కామెంట్స్
First published: