Viral Video: బైకర్ సూపర్ టైమింగ్.. చిన్నారి ప్రాణం సేఫ్

కొన్ని సంఘటనలు చూస్తుంటే చాలా మందికి వావ్ అనే ఫీల్ కలుగుతుంది. అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

news18-telugu
Updated: September 20, 2020, 10:27 AM IST
Viral Video: బైకర్ సూపర్ టైమింగ్.. చిన్నారి ప్రాణం సేఫ్
ఫొటో క్రెడిట్- Twitter/Vibhinna Ideas
  • Share this:
కొన్ని సంఘటనలు చూస్తుంటే చాలా మందికి వావ్ అనే ఫీల్ కలుగుతుంది. అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో ఓ వ్యక్తి చిన్నారి ప్రాణాలను కాపాడిన తీరు.. అద్భుతం అనిపించక మానదు. అసలు ఆ వీడియో ఏముదంటే.. ఓ చిన్నారిని తల్లి ఆడించడానికి ఊయలలాంటి చక్రలు కలిగిన బండిలో ఉంచింది. అదికాస్త రోడ్డు మీదకు దూసుకుని వచ్చింది. అయితే అదే సమయంలో బైక్‌పై వచ్చిన వ్యక్తి ఆ ద‌శ్యాన్ని గమనించి.. బైక్‌ను కింద పడేశాడు. ఆ తర్వాత పరుగెత్తూ కుంటూ వెళ్లి చిన్నారిని రక్షించాడు. చిన్నారి బండి వెంట పరుగెత్తుకుంటూ వచ్చిన చిన్నారి తల్లి.. బైకర్‌కు థ్యాంక్స్ చెప్పి చిన్నారిని తీసుకుని వెళ్లింది.


ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో పలువురు నెటిజన్లు ఆ వ్యక్తిని సూపర్ హీరో అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. చిన్నారి బండి జారుకుంటూ వెళ్తున్న వైపు లోయ మాదిరి ఉందని.. ఒకవేళ బైక్‌పై వచ్చిన వ్యక్తి తక్షణమే స్పందించడంతో పెను ప్రమాదం సంభవించేదని అంటున్నారు. అయితే ఈ ఘటన ఎక్కడ జరిగిందనే దానిపై స్పష్టత లేదు.
Published by: Sumanth Kanukula
First published: September 20, 2020, 10:26 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading