Viral: ఫ్లై ఓవర్ పై పాములా..! స్కూటీతో ఫీట్లు.. ప్రయాణికులకు ఇబ్బందులు..

చేతిలో బైక్ ఉంది కదా అని ఇష్టమొచ్చినట్టు వెళ్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని పోలీసులు.. రవాణా శాఖ మొత్తుకుంటున్నా కొంతమందికి చెవికెక్కడం లేదు. అతి వేగంగా వెళ్లి వారికే గాక ఇతరులకు ప్రాణాపాయం తలబెడుతున్నారు.

news18
Updated: October 22, 2020, 12:24 PM IST
Viral: ఫ్లై ఓవర్ పై పాములా..! స్కూటీతో ఫీట్లు.. ప్రయాణికులకు ఇబ్బందులు..
  • News18
  • Last Updated: October 22, 2020, 12:24 PM IST
  • Share this:
చేతిలో బైక్ ఉంది కదా అని ఇష్టమొచ్చినట్టు వెళ్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని పోలీసులు.. రవాణా శాఖ మొత్తుకుంటున్నా కొంతమందికి చెవికెక్కడం లేదు. అతి స్పీడ్ కారణంగా వారికే గాక రోడ్డు పై వెళ్లుతున్న ఇతర ప్రయాణీకులకూ ఇబ్బందులు కలుగుతుంది. ముఖ్యంగా పలువురు యువత.. బైక్ దొరికిందంటే చాలు.. వారి వేగానికి అంతే ఉండటం లేదు. గుజరాత్ కు చెందిన ఇద్దరు ఆకతాయిలు చేసిన పనికి.. నెటిజన్లు చివాట్లు పెడుతున్నారు. వాళ్లు నడిపేది స్కూటీ అయినా.. స్పోర్ట్స్ బైక్ మాదిరిగా తిప్పుతూ.. అత్యంత వేగంగా రైడ్ చేశారు. వారి వేగాన్ని చూసిన ఒక రిపోర్టర్.. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

గుజరాత్ లోని సూరత్ లో ఉన్న శ్రీ చంద్రశేఖర్ ఆజాద్ వంతెన.. మంగళవారం రాత్రి అవుతుంది. వంతెనపై వాహనాలన్నీ ప్రయాణిస్తుండగా.. ఇంతలో అక్కడకు వేగంగా దూసుకువచ్చిన వచ్చిన ఒక స్కూటీ.. పాములా పాకుతూ దూసుకువస్తుంది. ఆ బైక్ మీద ఇద్దరు ఆకతాయిలు.. ఇతరులకు ఇబ్బందులు కలిగిస్తూ ఫుల్ స్పీడ్ తో బైక్ నడుపుతున్నారు. ఇది చూసిన ఇతర ప్రయాణికులు వారిని హెచ్చరించినా వినకుండా ఇంకా ఎక్కువ వేగంగా బైక్ నడుపుకుంటూ వెళ్లారు.




వీడియో ఆధారంగా పోలీసులు వారిని గుర్తించారు. నిందితులిద్దరూ మత్స్యకారులని తేలింది. దీనిపై పోలీసులు స్పందిస్తూ.. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇదే విషయమై పలువరు నెటిజన్లు స్పందిస్తూ.. రోడ్లపై ఇలాంటి సర్కస్ ఫీట్లను చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.అంతేగాక.. పోలీసులు కూడా వంతెనలపై వేగ నియంత్రణ చర్యలు చేపట్టాలని తద్వారా ఇలాంటి ఆకతాయిల నుంచి సాధారణ ప్రయాణికులకు ముప్పు తప్పుతుందని కామెంట్ చేస్తున్నారు.
Published by: Srinivas Munigala
First published: October 22, 2020, 12:24 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading